
Khalisthan Dead..
- News
- May 6, 2023
- No Comment
- 38
ఒకప్పుడు ఇండియాలో ఖలిస్థాన్ మూవ్‌మెంట్‌లో కీలకపాత్ర పోషించిన ఖలిస్థాన్ కమాండో ఫోర్స్ మాజీ చీఫ్ పరంజిత్ సింగ్ పంజ్వర్ దారుణ హత్యకు గురయ్యాడు. పాకిస్థాన్‌లో ని జోహార్ పట్టణంలో ఇద్దరు ఆగంతకులు జరిపిన కాల్పుల్లో అతను హతం అయ్యాడు. శనివారం ఉదయం 6 గంటల సమయంలో వాకింగ్ చేస్తుండగా.. పరంజిత్ సింగ్ పై కాల్పులు జరిగాయి. దీంతో పరంజిత్ సింగ్ అక్కడికక్కడే చనిపోగా.. అతని గన్ మెన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇండియా వాంటెడ్ లిస్టులో పరంజిత్ సింగ్ పాకిస్థాన్ కేంద్రంగా కొంత కాలంగా డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నాడు. 1986లో ఖలిస్థాన్ కమాండో ఫోర్స్‌లో చేరాడు.
ఖలిస్థాన్ ఉద్యమకారుడు లాభ్ సింగ్‌ను భారత భద్రతా దళాలు మట్టుబెట్టిన తర్వాత కేసీఎఫ్ బాధ్యతలను పంజ్వర్ చూసేవాడు. ఈ నేపథ్యంలో ఆయన పాకిస్థాన్‌కు పారిపోయాడు. పాకిస్థాన్ ఆశ్రయంలో ఉన్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో పంజ్వర్ ఒకడు. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణా ద్వారా వచ్చే నిధులతో కేసీఎఫ్‌ను నడుపుతున్నాడు. పంజ్వర్ తమ దేశంలో ఉన్నాడనే ఆరోపణలను పాకిస్థాన్ ఖండిస్తోంది. అయితే.. తాజాగా దుండగుల్లో కాల్పుల్లో అతను హతం అవ్వటంతో.. పాకిస్తాన్ వాదన అబద్దం అని తేలిపోయింది.