కాలు బెణికిందంటూ జగన్‌ డ్రామాలు: కింజరపు అచ్చెన్నాయుడు

కాలు బెణికిందంటూ జగన్‌ డ్రామాలు: కింజరపు అచ్చెన్నాయుడు

కాలు బెణికిందన్న సాకుతో ఒంటి మిట్ట సీతారాముల వారి కళ్యాణానికి వెళ్లకుండా ఎగ్గొట్టిన సీఎం జగన్‌ నేడు చిలకలూరిపేట పర్యటనకు ఎలా వెళ్లారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. గురువారం నాడు టీడీపీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. శ్రీ రాముడు ఆదర్శప్రాయుడు, ప్రతి ఒక్కరూ కొలుస్తారు, ఉమ్మడి ఏపీలో భద్రాచలంలో అంగరంగ వైభవంగా రాముల వారి కళ్యాణం చేయడం ఆనవాయితీ.ఏపీ విభజన తర్వాత ఆ సంప్రదాయాన్ని ఒంటిమిట్ట కోదండరామాలయంలో టీడీపీ ప్రభుత్వం కొనసాగించింది.నాటి సీఎం చంద్రబాబు ఒంటిమిట్ట ఆలయాన్ని అభివృద్ధి చేశారు.అధికారిక లాంఛనాలతో ఒంటిమిట్ట కోదండ రామాలయంలో కళ్యాణాన్ని జరిపించాం.

కళ్యాణోత్స వానికి సీఎం దంపతుల వెళ్లడం ఆనవాయితీ. శ్రీరామ నవమి రోజున రాముల వారి కళ్యాణోత్సవానికి సీఎం జగన్‌ వెళ్తారని షెడ్యూల్‌ ఇచ్చారు.కానీ కాలు బెణికిందనే సాకుతో జగన్‌ ఒంటిమిట్ట వెళ్లలేదు.సతీ సమేతంగా వెళ్లాలి కాబట్టే జగన్‌ ఒంటిమిట్ట వెళ్లలేదు. జగన్‌ వేరే మతాన్ని ఆచరించొచ్చు.. కానీ సీఎం హోదాలో ఒంటిమిట్ట వెళ్లాలి కదా..? కాలు నొప్పి సాకుతో ఒంటిమిట్ట వెళ్లని జగన్‌ ..నిన్న జగ్జీనన్‌ రాం జయంతి, నేడు చిలకలూరి పేట కార్యక్రమాల్లో ఎలా పాల్గొన్నారు? ఒక్క రోజులోనే కాలు నొప్ప్పి తగ్గిందా? సీతారాముల వారి కళ్యాణానికి సతీసమేతంగా వెళ్లే ఇష్టం లేకనే జగన్‌ రెడ్డి కాలు బెణికిందంటూ కుంటి సాకు చెప్పారు.

జగన్‌ రెడ్డి తన వ్యవహారశైలితో కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. పాదయాత్ర లో అన్ని వేల కి.మీ నడిస్తే బెనకని కాలు, కేవలం సీతా రాముల కళ్యాణం ముందు రోజే బెణుకుతుందా? పెళ్లిళ్ల కు, పేరంటాలకు సతీసమేతంగా పాల్గొనే జగన్‌ రెడ్డి హిందూ దైవ కార్యక్రమాలకు మాత్రం ఎందుకు దూరం గా ఉంటున్నారు?తిరుమల శ్రీ వారి దర్శనానికి వెళ్లే ముందు డిక్లరేషన్‌ మీద జగన్‌ రెడ్డి ఎందుకు సంతకం పెట్టలేదు? రామతీర్ధంలో రాముడి విగ్రహం శిరస్సు ద్వంసం చేస్తే నిందితులపై చర్యలు లేవన్నారు.

Related post

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరు నగరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నగర ఇన్‌చార్జ్‌ ,మాజీమంత్రి పొంగూరు నారాయణ, సతీమణి రమాదేవి కలిసి పలు చోట్ల.. వినాయక స్వామివారిని…
పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

టీడీపీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది. కానీ, వాటన్నంటినీ ఎదుర్కొని పార్టీని సమర్థవంతంగా ముందుండి నడిపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కానీ, ఇప్పుడు ఆయనకే కష్టం వచ్చింది. అక్రమ అరెస్ట్…
చంద్ర‌బాబుకు అండ‌గా నిలుద్దాం..  విడుదల అయ్యేంత వరకు పోరాటం

చంద్ర‌బాబుకు అండ‌గా నిలుద్దాం.. విడుదల అయ్యేంత వరకు పోరాటం

నాలుగున్నర దశాబ్దాల పాటు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవినీతికి తావు లేకుండా.. టీడీపీ అధినేత చంద్రబాబు పరిపాలన చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం.. నిరంతరం అభివద్ధే ధ్యేయంగా పని చేసిన చంద్రబాబుపై…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *