కొడాలి నానికి క్యాన్సర్ అంటూ వార్తలు..ఆందోళనలో ఫ్యాన్స్

కొడాలి నానికి క్యాన్సర్ అంటూ వార్తలు..ఆందోళనలో ఫ్యాన్స్

కొడాలి నాని ఎక్కడున్నారు? కొద్దిరోజులుగా ఆయన కనిపించడం లేదు ఎందుకని? చీటికి మాటికి మీడియా ముందుకు వచ్చి…. టీడీపీ, జనసేన పార్టీలను తిట్టే కొడాలి… వాలంటీర్లపై ఇంత రచ్చ జరుగుతున్నా స్పందించకపోవడానికి కారణమేంటి? కొడాలి నాని అనారోగ్యానికి గురయ్యారా?హైదరాబాద్ లో చికిత్స తీసుకుంటున్నారా? ఆయన క్యాన్సర్ తో బాధపడుతున్నట్లుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి.

మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఏపీలో కనిపించకపోవడంపై రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆయన అనారోగ్యానికి గురైనట్లుగా వార్తలు వస్తున్నాయి. కొడాలి నాని క్యాన్సర్‌తో బాధపడుతూ, హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అనారోగ్య కారణాలతో ఆయన రాజకీయాలకు స్వస్తి పలకనున్నారని.. త్వరలోనే తమ్ముడి కొడుకును రాజకీయ వారసుడిగా ఎంట్రీ ఇవ్వనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. పవన్ పై వైసీపీ నేతలు ఒంటికాలిపై లేస్తున్నారు. పేర్ని నాని లాంటి నేతలు మీడియా ముందుకు వచ్చారు కానీ.. కొడాలి నాని బయటకు రాలేదు. దీంతో కొడాలి నాని ఎక్కుడున్నారనేది హాట్ టాపిక్ గా మారింది.

గతంలో కూడా కొడాలి నాని అనారోగ్యం విషయంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆయనకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రికి వెళ్ళారు. కిడ్నీలో రాళ్లున్న కారణంగా, లేజర్‌ చికిత్స చేయించుకున్నారనే గుసగుసలు వినిపించాయి. నియోజకవర్గంలో కొడాలి నాని గడపగడపకు కార్యక్రమంలో కూడా పెద్దగా పాల్గొనడం లేదు. ఈ విషయంలో సీఎం క్లాస్ పీకారని స్వయంగా కొడాలినానియే చెప్పారు. హైకమాండ్ ఆదేశించినప్పుడు ప్రెస్ మీట్లు పెడుతున్నారు తప్పితే, పెద్దగా యాక్టీవ్ గా కనిపించడం లేదు. కొడాలి నాని అనారోగ్యంపై సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతున్నా…దాని గురించి ఎవరూ ఖండించడం లేదు. దీంతో, కొడాలికి ఏదో అయ్యిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కొంతకాలంగా హెల్త్ సహకరించని కారణంగానే కొడాలి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారని సోషల్ మీడియాలో కోడై కూస్తోంది. ప్రస్తుతం ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని అంటున్నారు. ఈ వార్త అతని అనుచరులలో భయాందోళనలను రేకెత్తిస్తోంది. కొడాలి నాని మళ్లీ కనిపిస్తే గానీ, అతని అనారోగ్యానికి సంబంధించిన వార్తలపై క్లారిటీ వచ్చే అవకాశముంది.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *