జగన్ అక్రమాలను ప్రశ్నిస్తూ.. కొనసాగుతున్న సెల్ఫీ ఛాలెంజ్‌

జగన్ అక్రమాలను ప్రశ్నిస్తూ.. కొనసాగుతున్న సెల్ఫీ ఛాలెంజ్‌

జగన్ సర్కార్ వచ్చి నాలుగేళ్లు అవుతున్నా.. ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధిఎక్కడి వేసిన గొంగళి అక్కడే ఉన్న చందంగా ఉంది. జగన్ పాలనలోని వైఫల్యాలను ప్రశ్నిస్తూ.. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి చూపిస్తూ.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రారంభించిన సెల్ఫీ ఛాలెంజ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఇతర పార్టీ ముఖ్య నేతలు.. తమ నియోజకవర్గాల్లో.. చేపడుతున్న సెల్ఫీ ఛాలెంజ్ కార్యక్రమానికి జనం నుంచి భారీగా స్పందన వస్తోంది. దీంతో వైసీపీ సర్కార్ సమాధానం చెప్పలేక బెంబేలెత్తి పోతోంది.

తాజాగా శృంగవరపుకోట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి .. సెల్ఫీ ఛాలెంజ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. లక్కవరపుకోట మండల కేంద్రంలో 2014 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులపై.. జగన్ ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్‌ విసిరారు. ఎస్.కోట నియోజకవర్గ ప్రజల కోసం టీడీపీ హయాంలో నిర్మించిన విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి.. సెల్ఫీ దిగి.. వైసీపీకి ఆమె ఛాలెంజ్ చేశారు. లక్కవరపుకోటలో.. 15 లక్షలతో పంచాయతీ భవనం, 7.5 లక్షల రూపాయలతో అంగన్‌వాడీ భవనాన్ని నిర్మించి గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి అంటే ఏంటో చూపించామన్నారు.

జగన్ ప్రభుత్వ హయాంలో ఎల్‌.కోట మండలంలో ఎక్కడైనా అభివృద్ధి పనులు జరిగితే చూపించాలని.. లలితకుమారి డిమాండ్‌ చేశారు. టీడీపీ హయాంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్‌ స్తంభాలు, సాగునీరు, తాగునీరు, స్కూళ్లకు ప్రహరీలు వంటి మౌలిక సదుపాయాలు అనేకం కల్పించామన్నారు. జగన్ వచ్చి నాలుగేళ్లైనా.. ఏపీని అభివృద్ధి చేయడంలో.. చిత్తశుద్ధి లేదన్నారు. వైసీపీ నేతలకు దమ్ముంటే.. టీడీపీ చేసిన అభివృద్ధిపై చర్చకి సిద్ధంగా ఉన్నామని.. లలితకుమారి తెలిపారు. ఇదే కార్యక్రమంలో లక్కవరపుకోట మండలానికి చెందిన పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *