మూడా మాస్టర్‌ ప్లాన్‌పై అభ్యంతరాలు తెలపాలి: కొల్లు

మూడా మాస్టర్‌ ప్లాన్‌పై అభ్యంతరాలు తెలపాలి: కొల్లు

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో బుధవారం మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర టిడిపి కార్యాలయంలో పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ముడా నూతన మాస్టర్‌ ప్లాన్‌పై మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావుతో కలిసి మీడియా సమావేశం నిర్వహిస్తూ కొల్లు రవీంద్ర పలు కీలక విషయాలను తెలియజేశారు.

ఆనాడు భవిష్యత్తు తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మచిలీపట్నం అర్బన్‌ డెవల్ప్మెంట్‌ అధారిటీ (ముడా)ని ఏర్పాటు చేశామన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముడా సంస్థను నిర్వీర్యం చేశారన్నారు. తాజాగా ముడా అధికారులు తయారు చేసిన మాస్టర్‌ ప్లాన్‌పై ఎన్నో తప్పులు దొర్లాయన్నారు. మల్టీ పర్పస్‌ జోన్లు లేకుండా 90% రెసిడెన్షియల్‌ జోన్‌గా మార్చారన్నారు. దీని వల్ల భవిష్యత్తు తరాలకు తీరని నష్టం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

మాస్టర్‌ ప్లాన్‌ తయారీ అంతా లోపభూయిష్టంగా ఉంది. ప్రైవేట్‌ ఆస్తులను దోచుకునేలా మాస్టర్‌ ప్లాన్‌ ని తయారు చేశారు. గుడి, బడిని కూడా దోచుకునేలా మాస్టర్‌ ప్లాన్‌ ఉంది. వైసీపీ నేతల సొంత ఆస్తులను కమర్షియల్‌ జోన్‌లో పెట్టుకున్నారన్నారు. తాగునీటి అవసరాలను ఏ విధంగా తీరుస్తారో మాస్టర్‌ ప్లాన్‌లో చెప్పలేదు. ఇప్పటికైనా ప్రజలు కళ్లు తెరవాలని పిలుపునిచ్చారు.లోపభూయిష్టంగా ఉన్న మాస్టర్‌ ప్లాన్‌ పై అభ్యంతరాలు తెలియజేయాలి. మే 9వ తేదీ లోపు అభ్యంతరాలకు ప్రభుత్వం గడువు ఇచ్చిందన్నారు. ఈ లోపు ప్రతి ఒక్కరూ అభ్యంతరాలు తెలపాలని కోరారు. ప్రజల పక్షాన నిలబడి పోరాడేందుకు టీడీపీ సిద్ధంగా ఉందన్నారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *