మళ్లీ పూర్వ వైభవం కోసం కృషి చేసింది టిడిపినే : కొనకళ్ల

మళ్లీ పూర్వ వైభవం కోసం కృషి చేసింది టిడిపినే : కొనకళ్ల

మచిలీపట్నం నగరం మళ్లీ పూర్వ వైభవం కోసం కృషి చేసింది తెలుగుదేశం పార్టీనే అని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు అన్నారు.

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో బుధవారం జిల్లా టిడిపి అధ్యక్షుడు మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు మీడియా సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వ టిడిపి హయాంలో మచిలీపట్నం ప్రాంత అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులను ఉపయోగించి ముడా కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం మూడ మాస్టర్‌ ప్లాన్‌ను నిర్వీర్యం చేసే విధంగా లోప భూయిష్టమైన కార్యాచరణ తీసుకురావటాన్ని తీవ్రంగా ఖండిరచారు. పూర్వం అంతర్జాతీయ స్థాయిలో వాణిజ్యంలో గుర్తింపు పొందిన మచిలీపట్నం నగరం మళ్లీ పూర్వ వైభవం కావాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ఎంతో కృషి చేసింది.

తెలుగుదేశం పార్టీ ఎంతగానో పోరాడి మచిలీపట్నం పోర్ట్‌ సాధించుకుని ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగాలని కృషి చేసిందన్నారు. భవిష్యత్తులో చాలా త్వరగా ఎదగబోయే నగరం మచిలీపట్నం అని తెలిపారు. దానికి తగ్గట్టుగానే ఏ ప్రణాళికలు అయినా సిద్ధం చేయాలి. ఏదో ఒక దర్యాప్తు సంస్థకు ఇచ్చి మీకు మీ మనుషులకి అనుకూలంగా మచిలీపట్నం టౌన్‌ ప్లాన్‌ని తయారు చేసుకున్నారన్నారు. ఈ ప్లాన్‌లో రోడ్లు విస్తార్ణకు కనీసం ప్రాధాన్యత లేకుండా పోయిందన్నారు. ఈ ప్లాన్‌లో పోర్ట్‌ దగ్గరగా ఇండస్ట్రీస్‌ లేకుండా ఏదో మూలన పెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు గొర్రెపాటి గోపీచంద్‌, గోపు సత్యనారాయణ, పిప్పల్ల కాంతారావు, రాళ్ల కొట్టు రాము, దేవరపల్లి అనిత, వాలిశెట్టి తిరుమలరావు, కోస్తా మురళి, లెంకేసెట్టీ నీరజ, కరెడ్ల సుశీల, గోకుల్‌ శివ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *