
అధికార పార్టీలో అంతర్యుద్ధం..ఇద్దరు ఎమ్మెల్యేలు దూరం
- Ap political StoryNewsPolitics
- February 3, 2023
- No Comment
- 80
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో మూడు ముక్కలాట ఆడుతున్న AP CM జగన్ మోహన్ రెడ్డికి ఇద్దరు ఎమ్మెల్యేలు షాకిచ్చారు. నెల్లూరుజిల్లా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు కంచుకోటకు బీటలు వారాయి. రాజ్యాంగ బద్ధంగా ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆ ఇద్దరూ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ముసుగులో గుద్దులాట ఎందుకని ఆ ఇద్దరూ ఎమ్మెల్యేలు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు. అధిష్టాన వర్గ వ్యవహారశైలి సొంతపార్టీ నాయకులకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తడంతో ఆ పార్టీలో ఇమడలేని పరిస్థితి నెలకొంది.
ఆనంతో పాటు తాజాగా కోటంరెడ్డిని అధిష్ఠానం పొమ్మని పొగపెడుతోంది. అధిష్ఠానం తీరుపై కినుక వహించిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఇవాళ వేర్వేరుగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే ఆనం నెల్లూరులోని ఆయన నివాసంలో సైదాపురం మండల నాయకులతో సమావేశమై అభిప్రాయాలు సేకరిస్తున్నారు. వెంకటగిరి నియోజకవర్గానికి సమన్వయ కర్తగా నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డిని నియమించారు. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ సమన్వయకర్తగా వైకాపా రాష్ట్ర సేవా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కోటంరెడ్డి తమ్ముడు గిరిధర్‌రెడ్డిని నియమించాలని పార్టీలో చర్చ జరిగింది.
నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి వ్యవహారం సద్దుమణగకముందే మరో ఎమ్మెల్యే వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారం ఆ పార్టీలో కలకలం సృష్టిస్తోంది. నెల్లూరుజిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఆపార్టీకి దూరమయ్యేలా జగన్ వ్యవహారశైలి అద్ధంపడుతోంది. ఇద్దరి ఎమ్మెల్యేలను కాదని నియోజకవర్గ బాధ్యతలను వేరేవారికి అప్పజెప్పే ప్రయత్నాలు మనస్తాపానికి గురిచేశాయని తెలుస్తోంది. ఇద్దరు ఎమ్మెల్యేలు వేర్వేరు సందర్భాల్లో అధిష్టానం తీరును దుయ్యబట్టారు. సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి రక్షణగా ఉన్న నలుగురు గన్ మెన్లలో ఇద్దరిని ప్రభుత్వం తగ్గించింది.
తమ్ముడికి సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగిస్తే ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేదానిపై కోటంరెడ్డి ఆలోచనలో పడ్డారు. ఎమ్మెల్యే కోటంరెడ్డికి మద్దతుగా నియోజకవర్గంలో పలుచోట్ల ప్లెక్సీలు వెలిశాయి. పార్టీ, జెండా ఏదైనా తమ ప్రయాణం కోటంరెడ్డితోనే అంటూ అభిమానులు ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. వైకాపా అధిష్టానం కొత్త డ్రామాకు తెరలేపడంతో ఇద్దరు ఎమ్మెల్యేలు కచ్చితంగా పార్టీ మారాల్సిన పరిస్థితి ఏర్పడింది.