కేసీఆర్, కేటీఆర్ లను ఇరకాటంలో పడేసిన హిమాన్షు

కేసీఆర్, కేటీఆర్ లను ఇరకాటంలో పడేసిన హిమాన్షు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాడు. గచ్చిబౌలిలోని ఓ ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేసిన విధానం, ఆ సందర్భంగా ఆ కుర్రాడు చేసిన వ్యాఖ్యలు రాజకీయ రంగు పులుముకున్నాయి. కల్వకుంట్ల థర్డ్ జనరేషన్ కు చెందిన హిమాన్షు తొలి స్పీచ్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. కేసీఆర్, కేటీఆర్ లతో పాటు బీఆర్ఎస్ నేతలంతా… హిమాన్స్ స్పీచ్ కు ఫిదా అయిపోయారు. అయితే, హిమాన్షు చేసింది మంచి పనే అయినా.. బీఆర్ఎస్ కు బూమరాంగ్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. కేశవ్ నగర్ పాఠశాల దత్తత తీసుకోకముందు పందులకు ఆవాసంగా మారిందంటూ హిమాన్షు చేసిన కామెంట్స్, ప్రతిపక్షాలకు అస్త్రం అందించింది. రాష్ట్రంలో సర్కారీ బడులు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో నిజాయితీగా చెప్పావంటూ హిమాన్షును మెచ్చుకుంటూనే…ముఖ్యమంత్రిపై విపక్ష నేతలు మండిపడుతున్నారు. ఇక, మా పాఠశాలలు కూడా బాగు చేయాలంటూ కొన్నిచోట్ల విద్యార్థులు రోడ్డెక్కుతున్నారు. దీంతో, రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది.

తెలంగాణలో పవర్ పాలిటిక్స్ యూటర్న్ తీసుకొని ఇప్పుడు రాష్ట్రంలోని పాఠశాలలపైకి మళ్లింది. ఒకే ఒక్క స్పీచ్ తో సీఎం కేసీఆర్ ముద్దుల మనుమడు, మంత్రి కేటీఆర్ గారాల బిడ్డ హిమాన్షు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారారు. తెలంగాణలో విద్యావ్యవస్థ గొప్పగా ఉందంటూ చెప్పుకుంటున్న బీఆర్ఎస్ సర్కార్ పరువును హిమాన్షు గోదాట్లో కలిపేశారు. గచ్చిబౌలిలోని ఓ ప్రభుత్వ పాఠశాల అధ్వాన్నంగా ఉన్న తీరు చూసి కన్నీళ్లు వచ్చాయని హిమాన్షు చెప్పడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ సందర్భంగా హిమాన్షు తన ఫస్ట్ స్పీచ్ తో అదరగొట్టాడు. కల్వకుంట్ల రాజకీయ వారసుడొచ్చాడంటూ బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారు. అయితే, రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు ఎంత దారుణంగా ఉన్నాయో స్వయంగా హిమాన్షు చేసిన కామెంట్స్, బీఆర్ఎస్ సర్కార్ ను ఇరకాటంలో పడేసింది.

బంగారు తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితి గురించి హిమాన్షు చెప్పకనే చెప్పాడంటూ నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు. హిమాన్షు నిజాయితీని ప్రశంసిస్తూ.. కేసీఆర్, కేటీఆర్ లపై కాంగ్రెస్, బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. గత తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్, విద్యావ్యవస్థను ఎంతగా భ్రష్టుపట్టించిందో హిమాన్షు మాటలే చెబుతున్నాయంటూ ప్రతిపక్ష నేతలు బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్నారు. కమీషన్ల కోసం కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులకు పెట్టిన డబ్బును విద్య కోసం ఖర్చు చేస్తే తెలంగాణలో ఈ దుస్థితి ఉండేది కాదని అంటున్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో చాలా స్కూళ్లలో కనీస సౌకర్యాలు లేవని.. ఆడపిల్లలు టాయ్‌లెట్లకు వెళ్లాలన్నా జంకుతున్నారని ఆరోపిస్తున్నారు. ఒక్క స్కూల్‌ కాదు, తెలంగాణలోని అన్ని పాఠశాలలను మారుద్దాం. కలిసి ఉద్యమిద్దాం. సమస్యలపై మీ తాతను నిలదీయడానికి రావాలనే ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి.

మరోవైపు, హైదరాబాద్ నారాయణగూడలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. పాఠశాలలో సరైన వసతులు లేవని.. ముఖ్యమంత్రి మనువడు హిమాన్షు తమ పాఠశాలను దత్తతకు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలపైన హిమాన్షు అన్నయ్యకు ఉన్నంత శ్రద్ధ కూడా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి లేదంటూ పిల్లలు ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఏఐవైఎఫ్, బాల సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు ప్లకార్డులు చేతబట్టి హిమాన్షు అన్న తమ పాఠశాలను బాగు చేయాలని నినాదాలు చేశారు.

నిజానికి హిమాన్షు ప్రభుత్వ పాఠశాల ఆధునీకరణ కోసంం తన జేబులో నుంచి ఏమీ ఖర్చు చేయలేదు. ఫండ్ రైజింగ్ చేశాడు. సీఎం మనవడు, మంత్రి తనయుడు అంటే గొప్ప గొప్ప సంస్థలు కూడా భారీ మొత్తంలో ఫండ్స్ ఇచ్చేందుకు ముందుకు వస్తాయి. ఈ నేపథ్యంలో హిమాన్షు కోటి నగదును కలెక్ట్ చేయగలిగాడు. దాతల సహాయంతో పాఠశాలను అభివృద్ధి చేశాడు. అయితే, దీనిపై కల్వకుంట్ల కుటుంబం చేసిన పబ్లిసిటీ స్టంట్, బూమరాంగ్ అయ్యింది.

గతంలోనూ కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించేందుకు వెళ్లిన సమయంలో కూడా హిమాన్షుపై సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ వచ్చాయి. హిమాన్షు చిన్న పిల్లవాడు అని.. అతడి గురించి మీడియా వార్తలు రాయవద్దని మంత్రి కేటీఆర్ గతంలో పలు మార్లు చెప్పుకొచ్చారు. అతడిని అనవసరంగా రాజకీయాల్లోకి లాగొద్దని ప్రతిపక్షాలకు సూచించారు. అయితే, ఏకంగా ఇప్పుడు హిమాన్షు ఓ స్కూల్ దత్తత తీసుకొని ఆధునీకరించిన తీరు.. ఇచ్చిన స్పీచ్, బీఆర్ఎస్ ను డిఫెన్స్ లో పడేసింది. దీన్ని అస్త్రంగా మల్చుకొని విపక్షాలు రచ్చరచ్చ చేస్తుండడంతో, రాజకీయం సెగలు కక్కుతోంది.

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *