ఆటోమొబైల్ సెక్టార్‌లో లేటెస్ట్ ఎట్రాక్షన్‌గా మారుతి “ఫ్రాంక్స్”

ఆటోమొబైల్ సెక్టార్‌లో లేటెస్ట్ ఎట్రాక్షన్‌గా మారుతి “ఫ్రాంక్స్”

దేశంలోనే దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ… ఇండియ‌న్ మార్కెట్ లోకి తాజాగా మరో కొత్త కారును తీసుకువ‌చ్చింది. బడ్జెట్ ధరతో, అదిరే ఫీచర్లతో.. “మారుతీ ఫ్రాంక్స్” అనే ఈ కొత్త కారును లాంచ్ చేసింది. ఈ కారును ఆటో ఎక్స్‌పో 2023లో ఆవిష్కరించింది. కాగా, ఇప్పుడు ఇది అధికారికంగా మార్కెట్‌లోకి వ‌చ్చింది. టాటా మోటార్స్ నెక్సన్, హ్యుందాయ్ వెన్యూ, కియా సొనెట్ వంటి మోడళ్లకు పోటీగా మారుతీ సుజుకీ ఈ కొత్త ఫ్రాంక్స్ ఎస్‌యూవీని మార్కెట్‌లోకి దింపింది.

కాగా, “మారుతీ ఫ్రాంక్స్” కొత్త కారు లుక్స్ అయితే అదిరిపోయాయి. ఇది సబ్ 4 మీటర్ కాంపాక్ట్ SUV. ఈ కారు ప్రారంభ ధర 7.46 లక్షలుగా ఉండ‌గా… ఈ మోడ‌ల్ లోని టాప్ఎండ్ గరిష్ట ధర 13.13 లక్షలుగా ఉంది. ఈ కొత్త కారు నెక్సా డీలర్ షిప్స్ ద్వారా కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. ఫ్రాంక్స్ కారు సిగ్మా, డెల్టా, డెల్టా ప్లస్, జెటా, అల్ఫా వేరియంట్ల రూపంలో కస్టమర్లకు లభిస్తోంది. వేరియంట్ ని బ‌ట్టి ధర కూడా మారుతూ ఉంటుందని కంపెనీ వ‌ర్గాలు తెలిపాయి.

ఈ కొత్త కారు మైలేజ్ విషయానికి వస్తే.. లీటరుకు 20 నుంచి 22.89 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. LED మల్టీ రిఫ్లెక్టర్ హెడ్‌ల్యాంప్స్, LED డీఆర్ఎల్, 16 ఇంచ్ అలాయ్ వీల్స్, LED రియర్ కాంబినేషన్ ల్యాంప్స్, 9 ఇంచుల హెచ్‌డీ స్మార్ట్ ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, ఆటోమేటిక్ క్లైమెట్ కంట్రోల్, 360 డిగ్రీ వ్యూ కెమెరా, వైర్‌లెస్ చార్జర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ఇందులో ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ABS విత్ ఈబీడీ, త్రి పాయింట్ ఈఎల్ఆర్ సీట్ బెల్ట్స్, ఈపీఎస్ విత్ హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *