
యువగళం పాదయాత్రను విజయవంతం చేద్దాం
- Ap political StoryNewsPolitics
- May 3, 2023
- No Comment
- 23
ఈ నెల 4 వ తేదీన పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండలం రేమడురు గ్రామంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నార లోకేష్ పాదయాత్ర ప్రవేశిస్తున్న సందర్భంగా మండల కేంద్రం గడివేములలోని టీడీపీ కార్యాలయలయంలో తెలుగుదేశం పార్టీ నంద్యాల పార్లమెంట్ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన నాయకులకు కార్యకర్తలకు యువ గళం పాదయాత్ర గరించి దిశా నిర్దేశం చేశారు.
నారా లోకేష్ పాదయాత్రకు మండలం నుండి ప్రతి గ్రామం నుండి భారీగా ప్రజలు తరలి వచ్చి యువగళం పాదయాత్ర విజయవంతం చేయాలని గౌరు వెంకటరెడ్డి పిలుపు నిచ్చారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు, అభిమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ దేశం సత్యనారాయణరెడ్డి, సీనియర్ నాయకుడు బిడుదురి సీతారామిరెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, పంట రామచంద్ర రెడ్డి, రాష్ట్ర సోషల్ మీడియా మహిళా అధికార ప్రతినిధి సుభద్రమ్మ, రాష్ట్ర మహిళా ఆర్గనైజింగ్ సెక్రటరి లక్ష్మి దేవమ్మ, కత్తి శివారెడ్డి, నారాయణ రెడ్డి, మైనారిటీ సెల్ సెక్రెటరీ ఎస్ ఏ ఫరూక్, జయప్రకాశ్ రెడ్డి, కంది నాగరాజు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు దామోదరం నాగ శేషులు, రాచమళ్ళ శ్రీనివాసులు, ఐటీడీపి నియోజకవర్గం వైస్ ప్రెసిడెంట్ బీవీన్ రాజు మరియు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.