కోడికత్తి శ్రీను ప్రాణాలకు ముప్పు..?

కోడికత్తి శ్రీను ప్రాణాలకు ముప్పు..?

“కోడికత్తి” దాడి కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న “జనుపల్లి శ్రీను” అలియాస్ “కోడికత్తి శ్రీను” ప్రాణాలకు ముప్పు పొంచి ఉందా..? కేసు విచారణ ఆలస్యం అయ్యే కొద్దీ అతనికి ప్రాణహాని మరింతగా పెరగనుందా..? పరిటాల రవి, వివేకా హత్య కేసుల్లో ముద్దాయిలకు పట్టిన గతే… “కోడికత్తి శ్రీను” కు పడుతుందని అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారా..? తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు.. వారి ఆందోళనకు కారణమౌతున్నాయా..? కోడికత్తి కేసులో సీఎం జగన్ రెడ్డి కుంటి సాకులు చెబుతుండటం దేనికి సంకేతం..? ఆయన నిజంగానే బిజీగా ఉన్నారా..? లేక కాలయాపన కోసం కథలు చెబుతున్నారా..? ఇంతకీ.. కోడికత్తి శ్రీను తన ప్రాణాలకు ముప్పు ఉందని ఎందుకు భయపడుతున్నాడు…? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ..

2019 ఎన్నికలకు ముందు ఏపీ రాజకీయాల్లో రెండు అనూహ్య నేర ఘటనలు జరిగాయి. అందులో ఒకటి.. సీఎం జగన్ మోహన్ రెడ్డిపై కోడికత్తి దాడి ఘటన కాగా.. మరొకటి ఆయన సొంత చిన్నాన్న వివేకానంద రెడ్డి హత్యకేసు. యాధృచ్చికమో.. కాకతాళీయమో తెలియదు కానీ.. ఈ రెండు ఘటనలూ ప్రస్తుతం సీఎం జగన్ రెడ్డి చుట్టూనే తిరుగుతున్నాయి. అసలు దోషులు ఎవరో తెలియని స్థతిలో.. ఏళ్ల తరబడి కోర్టుల్లో నానుతున్నాయి. ఎడతెగని వాయిదాలు.. పిటీషన్లు, అప్పీళ్ళు ఇలా.. వివేకా కేసు.. కోడికత్తి కేసులు డైలీ సీరియల్స్‌లా సాగుతూనే ఉన్నాయి. ఇది నాణానికి ఒకవైపు కాగా.. మరోవైపు బయటకు కనిపించని చీకటి కోణాలెన్నో ఈ కేసుల వెనుక దాగి ఉన్నాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రస్తుతం కోడికత్తి కేసును తీసుకుంటే.. ఈ కేసులో ముద్దాయిగా ఉన్న “జనుపల్లి శ్రీను” ఐదేళ్ళుగా అండర్ ట్రయల్ ఖైదీగానే జైల్లో మగ్గుతున్నాడు. ఈ కేసు విచారణకు హాజరై సీఎం జగన్ రెడ్డి సాక్ష్యం చెబితే.. విచారణ తదుపరి దశకు వెళుతుంది. కానీ.. జగన్ రెడ్డి కోర్టుకు రావటానికి ఇష్టపడటం లేదు. దీంతో.. కోడికత్తి శ్రీను.. అండర్ ట్రయల్‌గా ఏళ్ళ తరబడి జైలులోనే మగ్గాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే అతని ప్రాణాలకు ముప్పు పొంచి ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికల్లో గెలవటానికి జగన్ రెడ్డి అండ్ కో ఈ డ్రామా ఆడారని.. ఇప్పుడు అతని అడ్డు తొలగించుకునే కుట్రలకు ప్లాన్ చేస్తున్నారని టీడీపీ ఇతర ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. గతంలో పరిటాల రవి హత్యకేసు.. ఆ తరువాత వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక ముద్దాయిలు చనిపోయిన వైనాన్ని గుర్తు చేస్తున్నాయి.

వాస్తవానికి టీడీపీ నేత పరిటాల రవి హత్య ఘటన తీసుకుంటే.. 2005జనవరి 25న పరిటాల రవి హత్య జరిగింది. ఈ కేసులో చానాళ్లపాటు విచారణ జరిగింది. అయితే ముగ్గురు ప్రధాన నిందితులు మద్దెలచెర్వు సూరి, మొద్దు శీను, తరగకుండ కొండారెడ్డిలు హత్యకు గురయ్యారు. ఇందులో మొద్దు శ్రీనును జైల్లోనే కడతేర్చారు. ఈ కేసులో రాజకీయంగా పలు అనుమానాలూ తలెత్తాయి. కీలకమైన నిందితులు, ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు హత్యకు గురికావడం అప్పట్లోనే చర్చనీయాంశమైంది. ఆ తరువాత వివేకానంద రెడ్డి హత్య కేసులోనూ దాదాపు అదే సీన్ రిపీట్ అయ్యింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాసరెడ్డి విచారణ సమయంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతని అసహజ మరణంపై అనేక అనుమానాలు ఉన్నాయి. ఇదే కేసులో మరో నిందితుడు గంగాధర్ రెడ్డి సైతం అనుమానాస్పద స్థితిలోనే చనిపోయడు. ఆయనది సహజ మరణమని ఆ తరువాత పోలీసులు డిక్లేర్ చేసినప్పటికీ.. సందేహాలు మాత్రం నివృత్తి కాలేదు. ఇక.. ప్రస్తుతం అప్రూవర్ గా మారిన దస్తగిరికి సైతం నిత్యం బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. దీంతో.. తన ప్రాణానికి ముప్పు ఏర్పడితే సీఎం జగన్ రెడ్డిదే బాధ్యత అంటూ అతను మీడియా ముందు మొరపెట్టుకున్నాడు.

ఇక.. జగన్ పై కోడికత్తి దాడికేసు విషయం తీసుకుంటే.. అందులో నిందితునిగా ఉన్న “జనుపల్లి శ్రీను” ప్రస్తుతం జైల్లో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నాడు. బెయిల్ కోసం ఎన్నోసార్లు దరఖాస్తు చేసినా.. అతని పిటీషన్ రిజక్ట్ అయ్యింది. బాధితుడు మరియు సాక్షిగా ఉన్న సీఎం జగన్ రెడ్డి విచారణకు గైర్హాజరు అవుతున్నారు. దీంతో విచారణ ఎప్పటికి ముగుస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే కోడికత్తి శ్రీను ప్రాణాలకు ముప్పు ఉందని అతని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో కీలక వ్యక్తుల పాత్ర బయటకు రాకుండా తమ కుమారుడిని కడతేరుస్తారేమోనని.. అతని తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. న్యాయస్థానం స్పందించి తన కుమారుడి ప్రాణాలు కాపాడాలని కోరుతోంది.

మొత్తం మీద.. కోడికత్తి శ్రీనుకు పొంచి ఉన్న ప్రాణహానిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దీంతో.. సీఎం జగన్ రెడ్డి ఈ విషయంపై స్పందించి సమాధానం చెప్పాలనే డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి.

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *