చీటింగ్ చక్రపాణిరెడ్డి తిన్నదంతా కక్కిస్తాం..!

చీటింగ్ చక్రపాణిరెడ్డి తిన్నదంతా కక్కిస్తాం..!

యువగళంలో లోకేష్ వాడీవేడీ ప్రసంగాలతో హోరెత్తిస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలను బయటపెడుతూ ముచ్చెమటలు పట్టిస్తున్నారు. శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు సభలో లోకేశ్ స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డిలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చక్రపాణి రెడ్డి చీటింగ్, చీకటి వ్యాపారాలను ఆధారాలతో సహా బయటపెట్టారు . ఎమ్మెల్యే, ఆయన సోదరుడు, బంధువులంతా కలిసి శ్రీశైలంను ఏవిధంగా దోచుకుంటున్నారో ప్రజల ముందు ఉంచారు. భూకబ్జాలు, ఇసుక, ఎర్రమట్టి దందాలు, కమీషన్లు.. చివరికి దేవుడిని కూడా వదల్లేదు అంటూ చక్రపాణి రెడ్డిపై నిప్పులు చెరిగారు నారా లోకేశ్.

రూ.5 లక్షల పనికి కూడా 10 శాతం కమీషన్లు తీసుకునే మనిషి చీటింగ్ చక్రపాణి అంటూ లోకేష్ ధ్వజమెత్తారు. శిల్పాకు చెందిన వర్దన్ బ్యాంకు రూ. 100కోట్లు దోచేసి దుకాణం సర్దేసిందని లోకేష్ విరుచుకుపడ్డారు. బ్యాంకు పెట్టిన బినామీని పార్టీ నుండి సస్పెండ్ చేయించి ఎమ్మెల్యే డబ్బు మొత్తం కొట్టేశాడని లోకేష్ ఫైర్ అయ్యారు. 50 శాతం సబ్సిడీతో రుణాలు ఇస్తామని చెప్పి దళితుల్ని మోసం చేశాడని, చీటింగ్ చక్రపాణి చివరకు దేవుడ్ని కూడా వదలలేదని లోకేష్ ఫైర్ అయ్యారు. శ్రీశైలం దేవస్థానాన్ని ఏటీఎంలా మార్చుకున్నారని, తన ఏజెన్సీ ద్వారా కాంట్రాక్టు ఉద్యోగాల నియామకాల్లో భారీ అక్రమాలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే అవినీతిని ఎండగట్టారు.

తాము అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే తిన్నదంతా కక్కిస్తామన్నారు లోకేష్. ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదన్నారు. వైసీపీ వేసిన సిట్ తోనే విచారణ చేయించి ఆ పార్టీ నాయకులు దోచుకున్న డబ్బు మొత్తం రికవరీ చేస్తామని స్పష్టం చేశారు. ఇక, తన అవినీతి గుట్టు రట్టు కావడంతో ప్రస్టేషన్ లోకి వెళ్లిపోయారు ఎమ్మెల్యే. తనపైన చేసిన ఆరోపణలను రుజువు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ సవాల్ విసరగా…స్థానిక టీడీపీ ఇంఛార్జ్ బుడ్డా రాజశేఖర్ రెడ్డి ప్రతి సవాల్ విసిరారు.

నియోజకవర్గంలో ప్రజల వద్దకు వెళ్లి ఎవరు ఏం చేశారో తేల్చుకుందాం..దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. తనపై నిందలు వేస్తున్నారని చెబుతున్న శిల్పా..తాను ఏం మోసచేయకపోతే సీబీఐ విచారణతో ఎంక్వైరీకి సిద్ధపడాలన్నారు. శిల్పాలాంటి చీటర్లు వాళ్ల పబ్బం గడుపుకోవడమే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని రాజశేఖర్ రెడ్డి దుయ్యబట్టారు.

మొత్తంగా, యువగళం పాదయాత్రలో లోకేష్ ఎక్కడిక్కడ వైసీపీ ఎమ్మెల్యేల అక్రమాలను బయటపెడుతుండడంతో ప్రభుత్వ పెద్దల్లో వణుకు పుడుతోంది. లోకేష్ తమ నియోజకవర్గానికి వస్తున్నారంటేనే హడలిపోతున్నారు అధికార పార్టీ నేతలు.

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *