
కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు – యాదవ సామాజికవర్గ నేతలకు నారా లోకేష్ హామీ
- Ap political StoryNewsPolitics
- April 10, 2023
- No Comment
- 43
టిడిపి అధికారంలోకి రాగానే బిసి కార్పొరేషన్ లకు నిధులు కేటాయించి సబ్సిడీ పై రుణాలు అందజేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో సోమవారం భాగంగా శింగనమల నియోజకవర్గం లో యాదవ సామాజిక వర్గ నాయకులు లోకేష్ ను కలిసి వారి సమస్యలపై విన్నవించారు. శింగనమల లో యాదవ భవనం నిర్మించాలని, యాదవులకు పదవులు ఇచ్చి రాజకీయాలలో ప్రాధాన్యత కల్పించాలని, గొర్రెల పెంపకాన్ని సబ్సిడీపై రుణాలు అందజేయాలని, యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని వారు లోకేష్ కు విజ్ఞప్తి చేశారు.
వాట్ సమస్యలు పై లోకేష్ సానుకూలంగా స్పందించారు. తెలుగుదేశం పార్టీ యాదవులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని లోకేష్ చేశారు. యనమల రామకృష్ణుడు కు స్పీకర్ గా, ఆర్థిక మంత్రిగా, పుట్టా సుధాకర్ యాదవ్ కు టిటిడి చైర్మన్ గా టిడిపి అవకాశం కల్పించిందన్నారు. గొర్రెల పెంపకాన్ని టిడిపి హయాంలో రూ.4లక్షల వంతున వ్యక్తిగత రుణాలు అందజేసినట్లు తెలిపారు. శింగనమల లో యాదవ భవన్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు.