ప్రతి ఏటా నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ : నారా లోకేష్ హామీ

ప్రతి ఏటా నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ : నారా లోకేష్ హామీ

టిడిపి అధికారంలోకి రాగానే ప్రతిఏటా ఖాళీగా ఉన్న ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా మంగళవారం కడప కృష్ణదేవరాయ సర్కిల్ లో నిరుద్యోగ యువకులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. టీడీపీ పాలనలో గ్రూపు, పోలీస్, టీచర్ ఉద్యోగాలు పెద్దఎత్తున భర్తీ చేశారు. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం ద్వారా ఉచిత కోచింగ్ ఇప్పించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇవేమీ కనిపించడం లేదు.

జాబ్ క్యాలెండర్ ద్వారా 2.30లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని 25లక్షల యువతను మోసం చేశారు. కడప స్టీల్ ప్లాంట్ కు రెండు సార్లు శంకుస్థాపన చేసి కలగానే మిగిల్చారు. మీరు అధికారంలోకి వచ్చాక యువతను ఆదుకోవాలి. నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇప్పించి న్యాయం చేయాలని కోరుతున్నామని వారు విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తులపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. బద్దాలు, మోసం, వంచనకు ప్రతిరూపం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల సమయంలో ప్రతిఏటా జాబ్ క్యాలెండర్, 2.3లక్షల ఉద్యోగాలిస్తానని చెప్పి మోసగించారు. జగన్ నిర్వాకం కారణంగా తీవ్ర నిరాశ,నిస్పృహలకు గురైన 470మంది యువతీయువకులు ఆత్మహత్యలుచేసుకున్నారు.

నిరుద్యోగ యువతను గంజాయి, మత్తుపదార్థాలకు బానిసలుగా మార్చి, వారి రక్తమాంసాలతో వ్యాపారం చేస్తున్నారు. యువగళం పథకం కింద నిరుద్యోగ యువతకు రూ.3వేల రూపాయల భృతి కల్పిస్తాం. ప్రైవేటు రంగంలో పెద్దఎత్తున పరిశ్రమలను రప్పించి 20లక్షల ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. గతంలో మాదిరిగా నిరుద్యోగులకు స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు, స్టడీసర్కిళ్లు ఏర్పాటుచేస్తాం. కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టి కడప జిల్లాలో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. మీకోసం పనిచేసే చంద్రన్నను ముఖ్యమంత్రిని చేసేందుకు మీవంతు సహకారం అందించండని లోకేష్ వారికి విజ్ఞప్తి చేశారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *