కోటీశ్వరులను చేసిన టమోట

కోటీశ్వరులను చేసిన టమోట

లాటరీ ద్వారా కోట్లు గెలుచుకున్నవారిని … అనేక మందిని వార్తల్లో .. తరచుగా చూస్తునే ఉంటాం. కొన్నిరోజులుగా టమాటా ధరలు చుక్కలను చూపిస్తున్నాయి. ఇప్పటికే అనేక చోట్ల టమాటాలను అమ్మటానికి.. సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారంటే.. డిమాండ్ ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరికొన్ని చోట్ల టమాటాలు కొనడానికి గొడవలు కూడా పడుతున్నారు. టమాటాలను కొన్ని ప్రభుత్వాలు సబ్సీడీలకు కూడా అందిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. టమోట పంట.. కొందరి జీవితాలనే మార్చేసింది. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యారు. మహారాష్ట్రలోనిని పూణెలోని జున్నార్‌కు చెందిన.. రైతుల జీవితాన్ని.. టమోట మార్చేసింది.

దాదాపు నెల రోజులుగా వేచి చూస్తున్నా.. టమాట ధరలు దిగిరావడం లేదు. టమోట ధరల నియంత్రణపై.. తెలంగాణ మార్కెటింగ్‌శాఖ ఎలాంటి దృష్టిపెట్టడం లేదు. దీంతో.. వ్యాపారులు తమకు ఇష్టమొచ్చిన ధరలకు.. టమాటను విక్రయిస్తున్నారని సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో టమాట సాగు లేకపోవడంతో ఏపీ, మహారాష్ట్రతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి దిగుమతి అవుతోంది. అక్కడ నుంచి అతి తక్కువ ధరలకు తెలంగాణకు టమాటను తెప్పిస్తున్న వ్యాపారులు.. ఎక్కువ ధరలకు అమ్ముతున్నారని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులే టమాట ధరలను నిర్ణయించి వినియోగదారులకు విక్రయిస్తున్నారని మండిపడుతున్నారు.

టమాట సాగు వల్ల చాలా మంది అదృష్టమే మారిపోయింది. మహారాష్ట్రలోని పచ్ఘర్ పూణే, నగర్ జిల్లా సరిహద్దులో ఉన్న ఒక చిన్న గ్రామం. అందులో గయ్కర్ కుటుంబం ఒకటి. పచ్‌ఘర్‌కు చెందిన తుకారాం భాగోజీ గయ్కర్‌కు 18 ఎకరాల హార్టికల్చర్ భూమి ఉంది. 12 ఎకరాల్లో టమాట సాగు చేశాడు. ఇదొక్కటే కాదు గైకర్ టమోటా సాగుతో 100 మందికి పైగా మహిళలకు ఉపాధి కూడా లభించింది. తుకారాం భాగోజీ గయ్కర్‌కు.. 2023లో.. టమాటా పంట లాటరీ వచ్చింది. ఇటీవల, జూలై 11న టొమాటో .. 20 కేజీలు అంటే క్రేట్ ధర 2,100 రూపాయలు పలికింది. గైకర్ మొత్తం 900 టమోటా డబ్బాలను విక్రయించాడు. ఒక్కరోజులోనే 18 లక్షల రూపాయలు సంపాదించాడు. గతంలో గ్రేడ్‌ను బట్టి ఒక్కో క్రేట్‌కు 1000 నుంచి 2,400 రూపాయల వరకు ధరలు లభించాయి. దీంతో తుకారం భాగోజీ గైకర్ కోటీశ్వరుడయ్యాడు. అయితే గైకర్ లాగా టమాటా వల్ల లక్షాధికారులుగా మారిన రైతులు..10 నుంచి 12 మంది ఉన్నారు. కాగా మార్కెట్ కమిటీ టర్నోవర్ నెల రోజుల్లో 80 కోట్ల రూపాయల వరకు ఉంది.

ఛత్తీస్‌గఢ్‌ ధమ్‌తరీ జిల్లాలోని బీరన్‌ గ్రామానికి చెందిన అరుణ్‌ సాహూ 150 ఎకరాల్లో టమాటా సాగు చేసి.. రోజుకు 600 నుంచి 700 పెట్టెలు విక్రయించారు. కోటి రూపాయలకు పైగా నెల వ్యవధిలోనే సంపాదించారు. ఉన్నత విద్య చదివిన సాహూ.. వ్యవసాయంపై మక్కువతో.. ఈ రంగంలోకి దిగారు. దేశవ్యాప్తంగా పెరిగిన టమాట ధరలు ప్రజలను ఠారెత్తిస్తున్నాయి. తెలంగాణలో కిలో టమాట ధర రూ.200 లను తాకగా.. చాలా రాష్ట్రాల్లో రూ.200 నుంచి రూ.250కి కిలో టమాటాను విక్రయిస్తున్నారు. చండీగడ్‌ మార్కెట్‌లో రిటైల్‌ దుకాణాల్లో.. ఏకంగా కిలో టమాటను 300 నుంచి 400 రూపాయలకు విక్రయిస్తుండడం గమనార్హం. టమాట ధరలు రోజు రోజుకు పెరగటమే కాని.. తగ్గకపోవడంతో సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. లీటర్‌ పెట్రోల్‌ కంటే కిలో టమాట ధరనే అధికంగా ఉండటంతో.. సామాన్యులు కొనలేని పరిస్థితి నెలకొని ఉంది.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *