మహా వీరుడు మూవీ రివ్యూ

మహా వీరుడు మూవీ రివ్యూ

శివకార్తికేయన్ హీరోగా, అదితి శంకర్ హీరోయిన్‌గా మడోన్నా అశ్విన్ డైరెక్టర్‌ చేసిన యాక్షన్, కామెడీ, డ్రామా మహా వీరుడు. శివకార్తికేయన్ ఓ పిరికివాడు క్యారెక్టర్‌లో సత్యగా నటించాడు. సినిమాలకు లాంగ్‌ గ్యాప్‌ ఇచ్చి లెజెండరీ యాక్టర్‌ సరిత మదర్‌ క్యారెక్టర్‌లో మెరిసింది. అనుకోని సిట్యూవేషన్స్‌లో చెల్లి, తల్లితో కలిసి ఇష్టం లేకపోయిన గవర్నమెంట్ ఇచ్చిన అపార్ట్‌మెంట్స్‌లో ఉండాల్సిన పరిస్థితిలు వస్తాయి. కమిషన్స్‌ కోసం కకుర్తి పడి నాణ్యతలేని అపార్టమెంట్స్‌ కట్టిస్తాడు మినిస్టర్‌. తన తోటి అపార్ట్‌మెంట్‌ వాసులను ఎలా కాపాడేడు.. బేసిక్ గా పిరికివాడైన సత్య మహావీరుడిలా ఎలా అయ్యాడు. అ టైమ్‌లో హీరోయిన్‌తో లవ్‌ స్టోరీ. అండ్‌ కొంత యాక్షన్ ఎలిమెంట్స్‌ని కలిపి కథ రెడి చేశాడు డైరెక్టర్.

హీరో పిరికివాడు అనే పాయింటే సినిమాకు స్పెషల్ ఎస్టార్ట్‌.. భయం నుంచే హిలేరియాస్‌ కామెడీ పుట్టింది. పిరికివాడు మహావీరుడిగా మారే క్రమంలో క్రియేట్‌ చేసిన డ్రామాలో కామెడీ సీన్స్, యాక్షన్ సీన్స్ అండ్‌ ఇంటర్వెల్ బ్లాక్‌ చాలా బాగున్నాయి. ఫన్‌తో పాటుగా ఎమోషన్‌ మిక్స్‌ చేయడం అందరిని ఆకట్టుకున్నాయి. మంచి కోసం ప్రకృతి కూడా సహకరిస్తుందన్న మేసేజ్‌ని చాలా ఇంట్రస్టింగ్‌గా ఫన్నీ వేలో చూపించాడు. శివకార్తికేయన్ ఎమోషనల్ అండ్ యాక్షన్ ఎపిసోడ్స్‌లో వండర్‌ ఫుల్‌గా చేశాడు. కీ సీన్స్‌లో శివకార్తికేయన్ యాక్టింగ్‌ నెక్ట్స్‌ వెలెవ్‌లో ఉంది. అదే సినిమాకే స్పెషల్‌ అట్రాక్షన్‌గా ఉంది. హీరోయిన్‌గా డైరెక్టర్‌ శంకర్‌ కూతురు అతిధి శంకర్ 100 % న్యాయం చేసింది. యోగి బాబు పంచ్ లు అండ్ కామెడీ టైమింగ్‌తో ఎప్పటిలాగానే నవ్వులు పూయించాడు. మహావీరుడుతో లింకైన సీన్స్‌.. ఆ ట్రాక్‌ విలన్‌తో శివకార్తికేయన్‌ సీన్స్‌ బాగున్నాయి. రవితేజ వాయిస్‌ ఒకటి సినిమాకు మంచి ఎనర్జీని ఇచ్చింది కథను రేసిగా మార్చేస్తుంది మహా వీరుడుని రెడీ చేస్తుంది.. ఫస్టాఫ్‌ కామెడీ, ఎమోషన్స్‌తో బాగనే అనిపిస్తుంది.

ఫస్టాఫ్‌ ఇచ్చిన బూస్ట్‌ సెకండాఫ్‌లో మిస్‌ అవుతుంది. సినిమా కంటెంట్‌లో మ్యాటర్ ఉన్నపటికీ.. ఆ పాయింట్ కి తగ్గట్టు స్క్రీన్ ప్లే రాసుకోవడంలో డైరెక్టర్‌ మడోన్నా అశ్విన్ తడబడ్డాడు. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ హైలో కానీ మహావీరుడులో అది మిస్‌ అయింది. సెకండ్‌ ఆఫ్ డల్‌ అవుతుంది. ఈ టైప్‌ మూవీని ప్యాక్డ్‌ యాక్షన్‌తో రేసింగ్‌ రన్‌ చేస్తే బాగుంటుంది. కానీ డైవర్ట్‌ అయి హీరో విలన్ దగ్గరకి వెళ్లి సరెండర్ అవ్వడంతో వచ్చే సీన్స్‌ ఆ రేంజ్‌లో ఉండవు. లాజిక్స్ కూడా ఎక్కడ కనిపించవు. హీరోహీరోయిన్ల మధ్య లవ్‌ ట్రాక్‌ కూడా పెద్దగా బలంగా లేదు. అలాగే పేద ప్రజల కోసం కట్టిన బిల్డింగ్ సమస్యను కూడా ఇన్‌టెన్స్‌గా చూపించడంలో డైరెక్టర్‌ ఫెయిల్ అయ్యాడు. ఫస్టాఫ్‌లో ఫన్‌లో నడింపించాడు.. సెకండ్‌ ఆఫ్‌లో కంటిన్యూ చేయలేక పోయాడు. టెక్నికల్ గా చూసుకుంటే.. భరత్ శంకర్ మ్యూజిక్‌ సినిమాకు పెద్ద ప్లస్. విధు అయ్యన్న సినిమాటోగ్రఫీ సినిమాకి హైలైట్ గా నిలిచింది.

మహావీరుడు మూవీలో మెయిన్ కాన్సెప్ట్, మహావీరుడి ట్రాక్, అండ్‌ కామెడీ అండ్ యాక్షన్ సీన్స్ బాగున్నాయి. అలాగే, కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా పర్వాలేదనిపిస్తాయి. ఫస్ట్ ఒకే అనిపిస్తుంది . సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇంట్రెస్టింగ్ కంటెంట్‌ చెప్పడంలో వీక్‌ అయింది. ఓవరల్‌గా యావరేజ్ మూవీ శివకార్తీకేయన్‌ పర్పార్మెన్స్‌ సూపర్‌.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *