
చంద్రబాబు పర్యటనకు మద్దతుగా తరలిన మండల నాయకులు
- Ap political StoryNewsPolitics
- May 5, 2023
- No Comment
- 35
ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు సారధ్యంలో ఉంగుటూరు మండలంలో జరిగే నారా చంద్రబాబునాయుడు పర్యటనకి చింతలపూడి మండల నాయకులు గురువారం బయలుదేరారు. రైతులు పడుతున్న ఇబ్బందులు, తడిచిన ధాన్యం రాశులని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంతవరకు కొనుగోలు చేయకపోవడంతో ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు పడిన ఇబ్బందులు తెలుసుకుని ప్రభుత్వం పై పోరాటానికి రైతులకు మద్దతుగా వెళుతున్నట్టు తెలిపారు.