రాజ‌మౌళికి థాంక్స్‌ చెప్పిన మ‌ణిర‌త్నం

రాజ‌మౌళికి థాంక్స్‌ చెప్పిన మ‌ణిర‌త్నం

మణిరత్నం డైరెక్షన్ లో వచ్చిన పొన్నియిన్ సెల్వ‌న్ 1 హిట్ అవ్వటం తో , ఏప్రిల్ 28న పొన్నియిన్ సెల్వ‌న్ రెండో భాగం ఐదు భాష‌ల్లో విడుద‌ల‌వుతుంది. హైద‌రాబాద్‌లో ఆదివారం జ‌రిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎంటైర్ టీమ్ వ‌చ్చింది. ఈ సంద‌ర్భంలో మ‌ణిర‌త్నం మాట్లాడుతూ రాజ‌మౌళికి ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాల‌ను తెలియ‌జేశారు.

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి బాహుబ‌లితో తెలుగు సినిమా స్థాయిని ప్ర‌పంచానికి చేర్చారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్‌తో ఏకంగా ఆస్కారే సాధించారు. బాహుబ‌లి త‌ర్వాత దేశంలోని ఇత‌ర ద‌ర్శ‌కులంద‌రూ త‌మ సినిమాల‌ను రెండు భాగాలుగా చేయ‌టానికి ఆస‌క్తి చూపించట‌మే కాదు.. ఆ మార్గంలో ట్రావెల్ కూడా చేశారు. అలాంటి వారిలో ఏస్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం ఒక‌రు. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన లేటెస్ట్ హిస్టారిక‌ల్ విజువ‌ల్ వండ‌ర్ PS2 (పొన్నియిన్ సెల్వ‌న్ పార్ట్ 2). ఈ మూవీ ఏప్రిల్ 28న పాన్ ఇండియా చిత్రంగా ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం మాట్లాడుతూ ప్ర‌త్యేకంగా రాజ‌మౌళికి థాంక్స్ చెప్పారు.

మ‌ణిర‌త్నం దర్శకత్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, మ‌ద్రాస్ టాకీస్ బ్యాన‌ర్స్‌పై సుభాస్క‌ర‌న్‌, మ‌ణిర‌త్నం నిర్మించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘పొన్నియిన్ సెల్వన్ 2’. గ‌త ఏడాది విడుద‌లైన ప్రేక్ష‌కుల‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుని.. బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్‌తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన పొన్నియిన్ సెల్వ‌న్ 1 చిత్రానికి ఇది కొన‌సాగింపు. చోళుల గురించి తెలియ‌జేసే సినిమా ఇది. అత్య‌ద్భుతమైన విజువ‌ల్స్‌తో లార్జ‌ర్ దేన్ లైఫ్ మూవీగా దీన్ని మ‌ణిర‌త్నం సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఆవిష్క‌రించారు. ఏప్రిల్ 28న వ‌ర‌ల్డ్ వైడ్‌గా పాన్ ఇండియా మూవీగా తెలుగు, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో `పొన్నియిన్ సెల్వ‌న్ 2` విడుద‌ల‌వుతుంది.

Related post

శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకుని క్షేత్రం

శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకుని క్షేత్రం

హిందువులకు అత్యంత ముఖ్యమైన ఆరాధ్య దైవం విఘ్నేశ్వరుడు. సకల శుభంకరుడు.. సకల గణాలకు నాయకుడు గణేశుడు. అంతే కాదు.. లయకారుకుడైన ఆదిశంకరుడు, జగన్మాతల ముద్దుబిడ్డ వినాయకుడు. శివుని ఆదేశాలతో…
పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

టీడీపీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది. కానీ, వాటన్నంటినీ ఎదుర్కొని పార్టీని సమర్థవంతంగా ముందుండి నడిపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కానీ, ఇప్పుడు ఆయనకే కష్టం వచ్చింది. అక్రమ అరెస్ట్…
ఫొటోస్ : రకుల్ ప్రీత్ సింగ్ ఫొటోస్

ఫొటోస్ : రకుల్ ప్రీత్ సింగ్ ఫొటోస్

ఫొటోస్ : రకుల్ ప్రీత్ సింగ్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *