చంద్రన్న తల్లికి వందనం

చంద్రన్న తల్లికి వందనం

నాలుగేళ్ల తర్వాత జగన్ పాలన అంటే.. ఏంటో ప్రజలకు పూర్తిగా తెలిసి వచ్చింది. 2019లో ప్రతిపక్ష నేతగా జగన్ ఇచ్చిన హామీలు.. అధికారంలోకి రాగానే అమలు కావనే విషయాన్ని అర్థం చేసుకున్నారు. నవరత్నాల్లో మొదటిది అయిన.. అమ్మఒడిపై జగన్ మాట తప్పారు. వేల కోట్ల రూపాయలు తెచ్చి.. అమ్మఒడి పథకాన్ని అమలు చేయలేక.. జగన్ చతికిల పడ్డారు. అందుకే.. ప్రజలను ఏమార్చి .. అమ్మఒడి పథకానికి అర్హులను తగ్గించారు. ఆ తర్వాత రూట్ మార్చి.. ఇంట్లో ఒక్కరికే పరిమితం చేశారు. ఇంట్లో ఎంతమంది ఉన్నా.. అందరినీ చదివిస్తాడు.. మీ మేనమామ.. అంటూ కబుర్లు చెప్పి.. కక్కలేక .. మింగలేక.. పథకానికి అరకొరగా నిధులు కేటాయిస్తున్నారు. అమ్మఒడి పథకానికి బటన్ నొక్కుతున్నట్లు.. చెబుతున్నా.. ఎవరికి వస్తుందో.. కూడా అర్థం కాకుండా చేశారు. జగన్ కు అమ్మఒడి పథకం తెచ్చిన తంటా.. ఇంతా అంతా కాదు. అందుకే అమ్మఒడి పథకంతో జగన్ అభాసుపాలయ్యారు.

గెలుపు అనివార్యం అయిన రాబోయే ఎన్నికల విషయంలో టీడీపీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. రాజమండ్రి మహానాడులో.. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన అద్భుతమైన ఆరు పథకాల్లో ఒకటి.. తల్లికి వందనం. టీడీపీ అధికారంలోకి రాగానే.. రాష్ట్రంలోని ఒక్కో తల్లి ఖాతాలో 15వేల రూపాయలు జమ చేస్తామని .. చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి విడివిడిగా 15వేల రూపాయలిస్తామని.. చంద్రబాబు హామీ ఇచ్చారు. నలుగురు పిల్లలు ఉన్న కుటుంబంలో అందరూ స్కూల్ లేదా కాలేజీకి వెళ్తుంటే ఏడాదికి ఆ కుటుంబానికి 60 వేల రూపాయలు అందిస్తామని .. స్పష్టంగా చంద్రబాబు భరోసా ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం .. ప్రతి కుటుంబంలోని తల్లి అకౌంట్లలో తల్లికి వందనం నగదు జమ చేస్తామని చంద్రబాబు చెప్పడం పట్ల.. చదువుకునే పిల్లలను వృద్ధి తీసుకురావాలనే ఆలోచన చాలా సుస్పష్టంగా అర్థమైంది.

జగనన్న అమ్మఒడితో పోలిస్తే.. టీడీపీ తల్లికి వందనం చాలా ఘనంగానే ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక.. అమ్మఒడి పథకంలో అర్హులను తగ్గించి.. మాట మార్చింది. అయితే చంద్రబాబు హామీ ఇచ్చారంటే.. కచ్చితంగా అమలు చేస్తారనే భరోసా ప్రజల్లో ఉంది. అమ్మఒడి పథకంలో .. జగన్ విధించిన ఇంటికి ఒక్కరే అర్హులు అనే నిబంధనను చంద్రబాబు విధించలేదు. ఒక కుటుంబంలో ఎంతమంది చదువుకుంటున్నా.. అందరికి తల్లి వందనం వర్తింపు చేస్తామని తెలిపారు. దీంతో టీడీపీ తెచ్చిన తల్లికి వందనం అనే కొత్త పథకం పట్ల ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. తల్లికి వందనం కార్యక్రమాన్ని మరింతగా జనాల్లోకి తీసుకువెళ్లాలని.. టీడీపీ నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *