
యువనేతను కలిసిన మెకానిక్స్ అసోసియేషన్ ప్రతినిధులు..
- Ap political StoryNewsPolitics
- April 21, 2023
- No Comment
- 35
ఆదోనిలో మోటారు సైకిల్ మెకానిక్స్ అసోసియేషన్ ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా మెకానిక్ లు ఉన్నాం.
2020 నుండి అన్ని కంపెనీలు బీఎస్-6 వర్షన్ వాహనాలను ప్రవేశపెట్టారు.
వీటి రిపేర్లపై మాకు పెద్దగా అవగాహన లేదు.
టీడీపీ అధికారంలో ఉండగా స్కిల్ డెవల్ప్మెంట్ కేంద్రాల ద్వారా చేతివృత్తుల వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చేవారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ కార్యక్రమం కనుమరుగైంది.
మీరు అధికారంలోకి వచ్చాక టూ వీలర్ మెకానిక్ లను గుర్తించి శిక్షణ ఇప్పించాలి.
బీఎస్-6 వాహనాలు రిపేర్లకు ఉపయోగపడే టూల్ కిట్ ఇవ్వాలి.
మాకు సొసైటీ లేదా కార్పొరేషన్ ఏర్పాటు చేసి సబ్సీడీ రుణాలు అందించాలి.
ఆటో నగర్ లలో మెకానిక్ లకు మూడు సెంట్ల స్థలాన్ని ఇవ్వాలి. నారా లోకేష్ మాట్లాడుతూ…
టిడిపి ప్రభుత్వ హయాంలో నైపుణ్య శిక్షణ కోసం ఏర్పాటుచేసిన సంస్థను జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది.
మోటారు సైకిల్ మెకానిక్ లు కోరిన విధంగా అధునాతన వాహనాలపై నైపుణ్య శిక్షణ ఇచ్చి, టూల్ కిట్లు అందించేలా చర్యలు తీసుకుంటాం.
ఆటోనగర్లలో అందుబాటులో ఉన్న స్థలాలను పరిశీలించి మెకానిక్ లకు కేటాయించేలా చర్యలు తీసుకుంటాం.
మోటారు సైకిల్ మెకానిక్ లు షెడ్లు ఏర్పాటుచేసుకునేందుకు సబ్సిడీ రుణాలు అందజేస్తాం.