45 సంచుల్లో మానవ శరీర భాగాలు

45 సంచుల్లో మానవ శరీర భాగాలు

  • News
  • June 4, 2023
  • No Comment
  • 19

మెక్సికో సిటీ: ఉత్తర అమెరికా దేశం మెక్సికోలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన వెలుగులోకి వచ్చింది. 45 సంచుల్లో మానవ శరీర భాగాలను పోలీసులు గుర్తించారు. కొద్దిరోజుల క్రితం కనిపించకుండా పోయిన యువతీయువకుల గురించి దర్యాప్తు చేస్తుండగా ఈ దారుణం వెలుగుచూసింది. స్థానిక అధికారులు వెల్లడిరచిన వివరాల ప్రకారం.. జాలిస్కో రాష్ట్రంలోని గాడలాజారా సమీపాన ఒక లోయలో ఈ బ్యాగులు బయటపడ్డాయి. అవి స్త్రీ, పురుషుల శరీర భాగాలని అధికారులు తెలిపారు.

మే 20న దాదాపు 30 ఏళ్ల వయసున్న ఏడుగురు యువతీయువకులు కనిపించకుండా పోయారు. వారంతా ఒకే కాల్‌ సెంటర్‌లో పనిచేస్తున్నారు. ఆ కాల్‌ సెంటర్‌కు సమీపంలోనే ఈ బ్యాగులు దొరికాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆ కాల్‌ సెంటర్‌పై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అక్కడ చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మాదకద్రవ్యాలు, రక్తపు మరకలతో ఉన్న వస్తువులను గుర్తించినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఇదిలా ఉంటే.. ఆ శరీరభాగాలు ఎవరివనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *