
జగన్ కు ఝలక్.. జనసేనలోకి మంత్రి?
- Ap political StoryNewsPolitics
- June 28, 2023
- No Comment
- 26
ఎన్నికలకు ముందు వైసీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటివరకు ఓ లెక్క..ఇక నుంచి మరో లెక్క అన్నట్టుగా జగన్ ను సొంత ఎమ్మెల్యేలే ఆటాడుకుంటున్నారు. వై నాట్ 175 అంటోన్న తమ బాస్ పై వాయిస్ రెయిజ్ చేస్తూ చెమటలు పట్టిస్తున్నారు. వైసీపీలో తిరుగుబాటు చేసే ప్రజాప్రతినిథుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు జగన్ పై ఎమ్మెల్యేలే తిరుగుబాటు చేశారు. ఇప్పుడు ఓ మంత్రి రెబల్ గా మారారు. పదవుల కోసం పాకులాడను, ఎవరినీ విమర్శించనంటూనే..పవన్ కళ్యాణ్ సీఎం కావాలంటూ వెంకటేశ్వరుని సాక్షిగా సంచలనాలకు తెరదీశారు. వైసీపీ పెద్దల్లో వణుకు పుట్టించారు. ఇంతకీ ఎవరా మంత్రి?ఏంటా స్టోరీ? లెట్స్ వాచ్.
వైసీపీలో మరో వికెట్ పడినట్టే కనిపిస్తోంది. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు జగన్ కు ఝలక్ ఇవ్వగా…ఇప్పుడు ఏకంగా మంత్రి విశ్వరూప్ సొంత పార్టీపై ధిక్కార స్వరం వినిపించారు. కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై మంత్రి విశ్వరూప్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన తిరుమలలో పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలు పార్టీలో అగ్గిరాజేశాయి. పవన్ కళ్యాణ్ సీఎం కావాలనేది ఆయన అభిమానుల కోరిక మాత్రమే కాదు…తన కోరిక కూడా అంటూ విశ్వరూప్ చేసిన కామెంట్స్ వైసీపీలో దుమారం రేపాయి. అంతేకాదు, పదవుల కోసం తాను ఏనాడు జగన్ దగ్గరకు వెళ్లలేదన్న మంత్రి ..పదవులు వదులుకొని జగన్ దగ్గరకొచ్చానంటూ హాట్ కామెంట్స్ చేశారు. అవసరమైతే రాజకీయాల నుంచి విరమించుకుంటాను కాను…తాను ఎవరినీ విమర్శించనంటూ జగన్ కు ఝలక్ ఇచ్చారు.
అమలాపురానికి చెందిన మంత్రి పినిపె విశ్వరూప్ కు టిక్కెట్ ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నాల్లో జగన్ ఉన్నారట. ఈక్రమంలోనే ఇటీవల ఆయన ఇంటిపై దాడి జరిగినా సీఎం కనీస పరామర్శ లేదు. తర్వాత అనారోగ్యానికి గురై నెలల తరబడి చికిత్స పొందినా పెద్దగా పరామర్శల్లేవు. మంత్రి తన కుమారుడికి టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నా జగన్ పట్టించుకోవడం లేదు. అధినేత తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న విశ్వరూప్, జనసేనలోకి వెళ్లేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది.
జగన్ అరాచక పాలనతో విసిగిపోయిన నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే బయటకొచ్చేశారు. నెల్లూరుకు చెందిన ముగ్గురు రెడ్లు..త్వరలోనే టీడీపీలో చేరనున్నారు. గుంటూరుకు చెందిన ఎమ్మెల్యే శ్రీదేవి ప్రస్తుతం సెలైంట్ అయిపోయారు. మంత్రి విశ్వరూప్ త్వరలోనే జనసేనలో చేరతారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అమలాపూరంలో తన కుమారుడిని జనసేన తరపునుంచి బరిలోకి దిగుతారని అంటున్నారు. సొంత సామాజికవర్గం, జనసేన ఓటు బ్యాంకు, టీడీపీతో పొత్తు…అన్నీ కలిసొస్తాయనే లెక్కల్లో మంత్రి ఉన్నట్లు చెబుతున్నారు. అదే జరిగితే అక్కడ వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తప్పదంటున్నారు విశ్లేషకులు.
వైసీపీలో చాలా మంది ఎమ్మెల్యేలు, కొందరు మంత్రులు…పక్క చూపులు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు ముందు ఏ క్షణమైన గోడ దూకే అవకాశముందంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వంపై తీవ్ర ప్రజావ్యతిరేకత ఉంది. దానికి తోడు నేతలంతా జారిపోతే… జగన్ చెబుతున్నట్టు వైనాట్ 175 కాదు కదా..17కూడా వచ్చే పరిస్థితి ఉండదంటుని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.