కవితపై కీలక అభియోగాలు.. మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం

కవితపై కీలక అభియోగాలు.. మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మద్యం కుంభకోణం వ్యవహారానికి సంబంధించి… ఈడీ అధికారులు తాజాగా మూడో ఛార్జ్ షీట్ ను దాఖలు చేశారు. ఈ ఛార్జ్ షీట్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో పాటు ఆమె భర్త అనిల్ పేర్లను చేర్చారు. సౌత్ గ్రూప్ కు సంబంధించిన కీలక విషయాలను ఈడీ ఈ ఛార్జ్ షీట్ లో పొందుపరిచింది. ఎమ్మెల్సీ కవిత ఆమె భర్తతో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, వైసిపి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ రెడ్డిపై ఈడీ అభియోగాలు మోపింది.దాదాపు రూ.100 కోట్ల ముడుపులకు సంబంధించి ఆధారాలు దొరికాయని ఈడీ పేర్కొంది.

మద్యం వ్యాపారంతో పాటు ఆర్థిక లావాదేవీలపై ఈడీ అభియోగాలు చేయడం గమనార్హం. లిక్కర్ స్కాంలో ముడుపులను కవితే ఇచ్చారని ఈడీ పేర్కొనడం సంచలనంగా మారింది. బినామీలతో మాగుంట, కవిత వ్యాపారం చేశారని ఈడీ ఆరోపించింది. ప్రేమ్‌రాహుల్ మాగుంట బినామీ అని, పిళ్లై కవిత బినామీ అని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఛార్జిషీట్‌లో తెలిపింది. ఇండోస్పిరిట్‌లో మాగుంట, కవిత ప్రతినిధులుగా ప్రేమ్‌రాహుల్, పిళ్లై ఉన్నారని… ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో ఇండోస్పిరిట్‌ రూ.192 కోట్ల లాభాలు ఆర్జించిందని ఈడీ పేర్కొంది. ట్విస్ట్ ఏంటంటే ఛార్జిషీట్‌లో కవిత భర్త అనిల్ కుమార్ పేరు కూడా ఉంది. ఇక, లిక్కర్ స్కాంలో వచ్చిన లాభాలతో కవిత భారీగా భూములు కొన్నట్టు ఈడీ పేర్కొంది. ఫీనిక్స్ రియల్ ఎస్టేట్ కంపెనీలో కవిత భూములను కొన్నారని.. ఈడీ ఛార్జ్ షీట్ లో పొందుపర్చింది. ఈ భూముల వ్యవహారమంతా కూడా పిళ్లై ద్వారా కవిత నడిపించినట్లు అభియోగం.

ఎంగ్రోత్ సంస్థలో ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ భాగస్వామిగా ఉన్నారని ఈడీ ఛార్జ్ షీట్ లో పేర్కొంది. నల్లధనాన్ని వైట్‌గా మార్చేందుకే ఆమె పెద్ద ఎత్తున భూముల కొనుగోలు చేశారని స్పష్టం చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మూడో ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే.. వైసీపీ ఎంపీ మాగుంట, ఆయన కుమారుడు రాఘవరెడ్డితో పాటు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా మరిన్ని చిక్కుల్లో పడినట్లు భావిస్తున్నారు. ఇప్పటికే ఈడీ కవితను పలుమార్లు విచారణకు పిలిచి గంటల తరబడి విచారించింది. అరెస్ట్ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ, అలాంటిదేమీ జరగలేదు. తాజాగా.. మూడో ఛార్జిషీట్‌లో ఈడీ పేర్కొన్న అంశాలను గమనిస్తే… మరోమారు ఆమె నోటీసులు వెళ్లే అవకాశముందని తెలుస్తోంది.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *