కర్నూల్లో ఎంపీ అవినాష్ రెడ్డి హైడ్రామా

కర్నూల్లో ఎంపీ అవినాష్ రెడ్డి హైడ్రామా

వివేకా హత్య కేసులో ఆధారాల చెరిపివేతతో సహా.. కీలక నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి.. సీబీఐ విచారణ నుంచి తప్పించుకోవటానికి హైడ్రామా క్రియేట్ చేశారు. కర్నూల్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వేదికగా అవినాష్ హైడ్రామా పీక్ స్టేజ్‌కు చేరుకుంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే… మే 19వ తేదీనే సీబీఐ ముందు హాజరు కావాల్సిన అవినాష్ రెడ్డి… తన తల్లికి గుండెపోటు అంటూ ఎస్కేప్ అయ్యారు.

తాజాగా 22వ తేదీన మరోసారి హాజరు కాకుండా.. 10 రోజులు గడువు కావాలంటూ లేఖ రాశారు. తన తల్లిని కర్నూల్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అడ్మిట్ చేసి.. డ్రామా మొత్తం కర్నూల్ షిప్ట్ అయ్యేలా ప్లాన్ చేశారు. ఏపీ సీఎం మరియి తన అన్న జగన్ మోహన్ రెడ్డి అండతో.. కర్నూల్లోని ఆ ప్రైవేటు ఆస్పత్రి వద్ద హైడ్రామా క్రియేట్ చేశారు. సీబీఐ అధికారులు ఆస్పత్రికి చేరుకున్నా.. కుంటి సాకులు చెబుతూ వారిని అడ్డుకున్నారు.

ఈలోగా సుప్రీం కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పిటీషన్‌ను అవినాష్ దాఖలు చేశారు. మరోవైపు కర్నూల్లోని అవినాష్ తల్లి చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వైసీపీ శ్రేణులు భారీగా చేరుకున్నాయి. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు… నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే.. సీబీఐ అరెస్టు నుంచి తప్పించుకోవటానికే ఎంపీ అవినాష్ రెడ్డి ఇలా నాటకాలు ఆడుతున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. పెదనాన్న వివేకా హత్య తరువాత కూడా ఇలాంటి డ్రామాలే ఆడిన అవినాష్.. అక్కడి ఆధారాలను చెరిపివేశారని అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఆ కేసులోనే సీబీఐ అరెస్టు నుంచి కూడా ఎస్కేప్ కావటానికి ఇలా నాటకాలు ఆడుతున్నారని సామాన్య జనం అనుకుంటున్నారు.

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *