విజయవాడలో కొండల్ని సైతం మింగేస్తున్న”అనకొండలు”

విజయవాడలో కొండల్ని సైతం మింగేస్తున్న”అనకొండలు”

అధికారంలోకి వచ్చింది మొదలు రాష్ట్రంలో వైసీపీ నేతల మట్టి మాఫియా చెలరేగిపోతోంది. ఈ జిల్లా, ఆ జిల్లా అని తేడా లేకుండా ఇసుక, మట్టి తవ్వేస్తున్నారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే అక్రమ తవ్వకాలతో రాష్ట్రాన్ని లూఠీ చేస్తున్నారు. విజయవాడ రూరల్ మండలంలో వందల ఎకరాల్లో అక్రమంగా మట్టి తవ్వేశారు. దీనిపై ఓ వ్యక్తి ఎన్టీటీని ఆశ్రయించారు. దర్యప్తునకు ఆదేశించడంతో ఎన్టీటీ బృందం రంగంలోకి దిగింది. అయితే వారి రాకను పసిగట్టిన వైసీపీ మాఫియా అడుగడుగునా అడ్డంకులు సృష్టించింది. అసలు విజయవాడ రూరల్ మండలంలో వేల కోట్ల మట్టి మాఫియాను నడుపుతోంది ఎవరు? మట్టి మాఫియా ఎవరి అండచూసుకుని చెలరేగిపోతోంది.

వైసీపీ అధికారంలోకి వచ్చాక కొండలు, గుట్టలు, స్మశానాలు, నదులు వేటినీ వదలడం లేదు. ఇక విజయవాడ రూరల్ మండలంలో మట్టి మాఫియా అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. గడచిన నాలుగేళ్లలో ఒక్క విజయవాడ రూరల్‌లోనే 4 వేల కోట్ల విలువైన మట్టి, ఇసుక తవ్వేశారని తెలుస్తోంది. ఎలాంటి అనుమతులు లేకుండానే రోజూ వేలాది ట్రక్కుల మట్టి తవ్వేసి అమ్మేసుకున్నారు. ఇవన్నీ తాడేపల్లి ప్యాలెస్ పెద్దల అండతోనే జరుగుతున్నాయనేది విమర్శలు వస్తున్నాయి. వైసీపీ పెద్దలకు కమీషన్లు ముట్టజెప్పి, మట్టి మాఫియా పనులు చక్కబెడుతోందని అంటున్నారు. పెద్దల అండదండలు పుష్కలంగా ఉండటంతో జిల్లా స్థాయి అధికారులు కూడా అక్రమార్కులవైపు చూడటానికి బయపడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే.. వెలగలేరులో అక్రమ తవ్వకాలపై సురేంద్రబాబు అనే వ్యక్తి ఎన్టీటీకి ఫిర్యాదు చేశాడు. వారి ఆదేశాల మేరకు ఓ బృందం క్షేత్ర పరిశీలనకు వెళ్లింది. దీంతో ఎన్టీటీ అధికారుల వాహనాలు వెళ్లకుండా అడ్డంగా కందకాలు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. వైసీపీ నేతలు అండతో మట్టి మాఫియా చుక్కలు చూపించింది. అధికారులు నడవడానికి కూడా వీల్లేకుండా కందకాలు తవ్వడంతో పరిశీలనకు వచ్చిన ఓ అధికారి కింద పడిపోయారు. అయినా వారు వెనక్కు తగ్గలేదు. అక్రమ తవ్వకాలను పరిశీలించడంతోపాటు, ఫోన్లో వీడియో రికార్డు చేసుకున్నారు. అనేక అక్రమాలను గుర్తించారు. ఎలాంటి అనుమతులు లేకుండా వందల ఎకరాల్లో, 70 అడుగుల లోతు మట్టి తవ్వకాలు చేస్తుంటే రెవెన్యూ అధికారులేం చేస్తున్నారంటూ ఎన్టీటీ బృందం ప్రశ్నించింది. దీనిపై సమగ్ర నివేదిక అందిస్తామని సబ్ కలెక్టర్ అదితి సింగ్ మీడియాకు వెల్లడించారు.

విజయవాడ సమీపంలోని వెలగలేరులో 50 ఎకరాల్లోని భారీ క్వారీని ఎన్టీటీ బృందం పరిశీలించింది. అక్రమార్కులు ఏర్పాటుచేసిన అడ్డంకులు దాటుకుంటూ అక్రమ తవ్వకాలు జరిపిన ప్రాంతాలకు చేరుకోవడానికి ఎన్టీటీ బృందానికి రెండు గంటల సమయం పట్టింది. ఎన్టీటీ బృందానికి స్థానిక అధికారులు ఏ మాత్రం సహకరించలేదు. గనులు, భూగర్భ వనరులు, జలవనరుల శాఖ అధికారులు ఎన్జీటీ బృందానికి కనిపించకుండా పోయారు. తమకు ఎలాంటి సమాచారం లేదని కొందరు… ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందలేదని మరికొందరు గైర్హాజరయ్యారు.

Related post

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరు నగరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నగర ఇన్‌చార్జ్‌ ,మాజీమంత్రి పొంగూరు నారాయణ, సతీమణి రమాదేవి కలిసి పలు చోట్ల.. వినాయక స్వామివారిని…
శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకుని క్షేత్రం

శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకుని క్షేత్రం

హిందువులకు అత్యంత ముఖ్యమైన ఆరాధ్య దైవం విఘ్నేశ్వరుడు. సకల శుభంకరుడు.. సకల గణాలకు నాయకుడు గణేశుడు. అంతే కాదు.. లయకారుకుడైన ఆదిశంకరుడు, జగన్మాతల ముద్దుబిడ్డ వినాయకుడు. శివుని ఆదేశాలతో…
పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

టీడీపీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది. కానీ, వాటన్నంటినీ ఎదుర్కొని పార్టీని సమర్థవంతంగా ముందుండి నడిపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కానీ, ఇప్పుడు ఆయనకే కష్టం వచ్చింది. అక్రమ అరెస్ట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *