
పవన్ పైకి ముద్రగడను ఉసిగొల్పిన జగన్.. కాపుల మధ్య చిచ్చు!
- Ap political StoryNewsPolitics
- June 21, 2023
- No Comment
- 22
ఏపీలో కాపులను చీల్చే కుట్ర జరుగుతోందా? మరోసారి కాపులను మోసగించే కార్యక్రమానికి జగన్ పూనుకున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. గత ఎన్నికల్లో కాపులకు మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్న జగన్…అధికారంలోకి వచ్చాక ఆ సామాజికవర్గాన్ని పూర్తిగా విస్మరించారు. దాంతో, జగన్ పై ఆగ్రహంతో ఉన్న కాపులంతా ఈసారి జనసేనకు మద్దతుగా నిలిచేందుకు ఏకమవుతున్నారు. ఈనేపథ్యంలో జగన్ విభజించు పాలించు అనే విధంగా… ఆ సామాజికవర్గంలో చీలిక తెచ్చేవిధంగా ఎత్తుగడను వేశారు. పవన్ కళ్యాణ్ టార్గెట్ గా ముద్రగడను ప్రయోగిస్తున్నారు. కాపు ఉద్యమనేతగా చెప్పుకునే ముద్రగడ పద్మనాభం, జగన్ కు జై కొట్టేవిధంగా పవన్ కళ్యాణ్ కు లేఖ రాయడం దుమారం రేపుతోంది.
ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కొనసాగుతోంది. ఆయా నియోజకవర్గాల్లో జగన్ సర్కార్ దోపిడీని పవన్ ఎండగడుతున్నారు. దాంతో, సమాధానం చెప్పలేక నీళ్లు నములుతున్నారు అధికార పార్టీ నేతలు. పవన్ ను నిలువరించేందుకు జగన్ తన పార్టీ కాపు నేతలైన పేర్నినాని, అంబటి రాంబాబు, బొత్స లాంటి నేతలను ఉసిగొల్పినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. దాంతో, ముద్రగను రంగంలోకి దింపారు.
వైసీపీ ముసుగులో ఉన్న ముద్రగడ పద్మనాభం… జనసేనానిని విమర్శస్తూ లేఖ రాయడంపై జనసేన నేతలు, కాపులు మండిపడుతున్నారు. జగన్ అధికారం చేపట్టిన తర్వాత కాపు ఉద్యమం, రిజర్వేషన్ల పై గతంలో ప్రశ్నించిన రీతిలో ముద్రగడ మాట్లాడడం లేదు. దాంతో, కాపు కార్పొరేషన్ ను నిర్వీర్యం చేసిన జగన్ ను ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నిస్తున్నారు. కాపు రిజర్వేషన్ ల విషయంలో ఎందుకు కొట్లాడడం లేదో ముద్రగడ చెప్పాలని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో వైసీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. గత ఎన్నికల్లో గంపగుత్తగా కాపుల ఓట్లను కొల్లగొట్టిన జగన్ కు… ఈసారి డిపాజిట్ కూడా దక్కదనే విశ్లేషణలు సాగుతున్నాయి. పవన్ చేపట్టిన వారాహి యాత్ర సాగే నియోజకవర్గాలన్నీ కాపుల ప్రాబల్యం అధికంగా ఉన్నవే. కాపుల మద్దతు లేనిదే అధికారం కల్ల అని గ్రహించిన జగన్… ముద్రగడ ద్వారా ఆ వర్గంలో చిచ్చు రాజేస్తున్నారు. ప్రస్తుతం కాపు నేతలు రెండుగా విడిపోయి విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తూ… వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి మద్దతివ్వడం సిగ్గుచేటని కాపునాయకులు మండిపడుతున్నారు. కాపుల మధ్య చిచ్చు పెట్టి చలిమంట కాచుకోవాలనుకుంటోన్న జగన్ కు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు.