తన ఉద్యోగికి.. అంబానీ గిఫ్ట్ గా ఇచ్చిన ఇంటి ఖరీదు ఎంతో తెలుసా?

తన ఉద్యోగికి.. అంబానీ గిఫ్ట్ గా ఇచ్చిన ఇంటి ఖరీదు ఎంతో తెలుసా?

అపర కుబేరుడు, ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ కంపెనీల్లో పనిచేస్తే ఆ అదృష్టమే వేరప్పా. ఎందుకంటే, ఆ పేరుకున్న పాపులారిటీ అలాంటిది మరి. వ్యాపార విజయాలతో పాటు వ్యక్తిగత జీవితం విషయంలోనూ నిత్యం వార్తల్లో నిలిచే ముఖేష్ అంబానీకి సంబంధించి…ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వచ్చింది. ముఖేష్ అంబానీ, తన ఉద్యోగికి ఇచ్చిన ఓ గిఫ్ట్ గురించి ఆసక్తికర చర్చ నడుస్తోంది. అది అట్లాంటి, ఇట్లాంటి గిఫ్ట్ కాదు. అంబానీ బహుమతి అంటే అట్లుంటది మరి..! అని అంతా మాట్లాడుకునేలా చేశారు. ఇంతకీ ముఖేష్ అంబానీ తన కంపెనీ ఉద్యోగికి ఇచ్చిన ఖరీదైన బహుమతి ఎంతో తెలుసా?

మీరు ఇప్పటివరకు పండుగలకు బోనస్ లు ఇచ్చిన బాస్ లను చూసుంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఉద్యోగులను ఆదుకున్న యాజమాన్యాలను చూసుంటారు. కంపెనీని లాభాల బాట పట్టించిన వారికి..ఓ కారు, ఫ్లాట్ గిఫ్ట్ గా ఇచ్చిన మేనేజ్ మెంట్ లను చూసుంటారు. కానీ, అంబానీ తన ఉద్యోగులకు ఇచ్చే బహుమతి..అంతకు మించి ఉంటుందని మీకు తెలుసా. అవును, రిలయన్స్ జియో ఎండీగా పని చేస్తున్న మనోజ్ మోడీ అనే ఉద్యోగికి ముఖేష్ అంబానీ లేటెస్ట్ గా అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. దాని ఖరీదెంతో తెలిస్తే నోరెళ్లబెడతారు. ముంబైలో 1,500 కోట్లు విలువ చేసే ఖరీదైన భవంతిని అంబానీ మనోజ్ మోడీకి బహుమతిగా ఇచ్చేశారు.

ఇప్పటికే ముఖేష్ అంబానీ నివాసం ఉండే యాంటిలియాలో పనిచేసే కార్మికులకు నెలకు లక్షల రూపాయల వేతనం ఇస్తున్నట్లు వార్తలు వచ్చాయి. రిలయన్స్ ఉద్యోగులకు కూడా ముఖేష్ అంబానీ మంచి సౌకర్యాలు కల్పిస్తారనే పేరుంది. తాజాగా ముఖేష్ అంబానీ..తన రైట్ హ్యాండ్ మనోజ్ మోడీకి ముంబైలోని నేపియన్ సీ రోడ్‌లో ఒక విలాసవంతమైన భవంతిని గిఫ్ట్ ఇచ్చారు. ఇది 22 అంతస్తులు కలిగి 1.7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలోఉంటుంది. ఇందులో అధునాతన సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

మనోజ్ మోడీ కేవలం ఉద్యోగి మాత్రమే కాదు. ముఖేష్ అంబానీ బ్యాచ్ మేట్ కూడా. ఇద్దరూ ముంబైలోని హిల్ గ్రాంజ్ స్కూల్‌లో క్లాస్‌మేట్స్. ముంబై యూనివర్సిటీ నుంచి కెమికల్ ఇంజినీరింగ్ కూడా పూర్తి చేశారు.అంబానీ కుటుంబంతో అతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 1980లో మనోజ్ మోడీ రిలయన్స్‌లో చేరారు. ఆ సమయంలో ధీరూభాయ్ అంబానీ రిలయన్స్‌కు నేతృత్వం వహిస్తున్నారు. మనోజ్ మోడీ తండ్రి హరిజీవందాస్ కూడా ముఖేష్ తండ్రి ధీరూభాయ్‌తో కలిసి పనిచేశారు. ఇప్పుడు మనోజ్ ముఖేష్, అతని కుమారులు ఇషా, ఆకాష్‌లతో కలిసి పనిచేస్తున్నారు.రిలయన్స్ సామ్రాజ్య విస్తరణలో మనోజ్ మోడీ కీలక పాత్ర పోషించాడు. మనోజ్ మోడీ ప్రస్తుతం రిలయన్స్ రిటైల్, రిలయన్స్ జియో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

మనోజ్ మోడీ కుటుంబసభ్యులంతా ఆ భవనంలో నివసించేలా ఏర్పాట్లు చేయించారు అంబానీ. ఇందుకోసం అధునాతన సౌకర్యాలు కల్పించారు. ఫర్నిచర్ అంతా ఫారెన్ నుంచి దిగుమతి చేశారు. మొత్తంగా, ఈ వార్త చూసిన వారంతా, ఎంతైనా అంబానీ అంబానీయే అంటున్నారు.

 

Related post

శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకుని క్షేత్రం

శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకుని క్షేత్రం

హిందువులకు అత్యంత ముఖ్యమైన ఆరాధ్య దైవం విఘ్నేశ్వరుడు. సకల శుభంకరుడు.. సకల గణాలకు నాయకుడు గణేశుడు. అంతే కాదు.. లయకారుకుడైన ఆదిశంకరుడు, జగన్మాతల ముద్దుబిడ్డ వినాయకుడు. శివుని ఆదేశాలతో…
పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

టీడీపీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది. కానీ, వాటన్నంటినీ ఎదుర్కొని పార్టీని సమర్థవంతంగా ముందుండి నడిపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కానీ, ఇప్పుడు ఆయనకే కష్టం వచ్చింది. అక్రమ అరెస్ట్…
ఫొటోస్ : రకుల్ ప్రీత్ సింగ్ ఫొటోస్

ఫొటోస్ : రకుల్ ప్రీత్ సింగ్ ఫొటోస్

ఫొటోస్ : రకుల్ ప్రీత్ సింగ్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *