అవినాష్‌ పై ముస్లింల గుస్సా..!!

అవినాష్‌ పై ముస్లింల గుస్సా..!!

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నుంచి బయట పడేందుకు ఎంపీ అవినాష్ రెడ్డి ముస్లిం సమాజం పై చేసిన అనుచిత వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. వివేకానందరెడ్డికి ఓ ముస్లిం మహిళతో సంబంధాలున్నాయని, వారికి ఒక కుమారుడు కూడా ఉన్నారంటూ అవినాష్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను మైనార్టీ సంఘాలు ఖండిస్తున్నాయి. అసలు ఎంపీ అవినాష్ రెడ్డికి వివేకా హత్య కేసుతో సంబంధం లేకపోతే ఎందుకు ఇంతలా భయపడుతున్నారు? వివేకా హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు అవినాష్ రెడ్డి చేస్తున్న వివాదాస్పద కామెంట్లు వైసీపీ కి చేటు తేనున్నాయా..? ముస్లిం కమ్యూనిటీ ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తోంది..?

వివేకానందరెడ్డి హత్య కేసులో సహ నిందితుడిగా నిండా మునిగి, బయటపడేందుకు కొట్టుమిట్టాడుతోన్న ఎంపీ అవినాష్ రెడ్డి, మరో వివాదంలో చిక్కు కున్నారు. వివేకా హత్య కేసులో సీబీఐ విచారణను తప్పుదారి పట్టించేలా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ముస్లిం సమాజంలో ఆగ్రహానికి కారణం అవుతున్నాయి. ఓ ముస్లిం మహిళ వ్యక్తిగత జీవితాన్ని బజారున పడేసేలా ఎంపీ అవినాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. వివేకానందరెడ్డి అక్బర్ బాషాగా మారారని, ఓ ముస్లిం మహిళను వివాహం చేసుకోవడం ద్వారా వారికి “షేక్ షాహిన్ షా” అనే కుమారుడు పుట్టాడని చేస్తున్న ప్రచారంలో నిజం లేదని మైనార్టీ హక్కుల పరిరక్షణ సంస్థ నేతలు ఖండించారు. ఎంపీ అవినాష్ రెడ్డి చేస్తున్న అసత్య ఆరోపణలను ముస్లిం మత పెద్దలు తీవ్రంగా తప్పు పడుతున్నారు. విశ్వసనీయత, పరువు, మర్యాదలు ఒక్క వైఎస్ కుటుంబానికే ఉన్నాయా..? అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి…. వివేకానందరెడ్డి హత్యను తప్పుదారి పట్టిస్తున్నారని ఈ సందర్భంగా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వాస్తవానికి.. వేకానందరెడ్డి హత్య కేసు విచారణను తప్పుదారి పట్టించేందుకు ఎంపీ అవినాష్ రెడ్డి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. గుండెపోటు.. గొడ్డలి పోటు కథల తరువాత ఆయన.. కొత్త ప్రచారాన్ని తెరపైకీ తీసుకు వచ్చారు. వివేకానందరెడ్డికి ఉమాశంకర్ రెడ్డి భార్యతో అక్రమ సంబంధం ఉందని ఒకసారి, సునీల్ యాదవ్ తల్లి లైంగికంగా వేధించారని మరోసారి ఆరోపించారు. ఓ ముస్లిం మహిళతో వివేకాకు సంబంధాలు ఉన్నాయని వారికి కుమారుడు కూడా ఉన్నారంటూ ఇలా నోటికొచ్చింది మాట్లాడటంతో అవినాష్ రెడ్డి అడ్డంగా ఇరుక్కుపోయారు. ఇప్పటికే వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ నేతలు అడ్డంగా బుక్కయ్యారు. . సీబీఐ అరెస్టుల నుంచి తప్పించుకునేందుకు వారు వేస్తున్న ఎత్తులు, వారికే అడ్డం తిరుగుతున్నాయి. వివేకానందరెడ్డి హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు ముస్లిం సమాజంపైనే అసత్య ఆరోపణలు చేసిన ఎంపీ అవినాష్ రెడ్డిపై పరువు నష్టం దావా వేసేందుకు మైనార్టీ నేతలు సిద్దం అవుతున్నారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *