
చంద్రబాబుకే ఓటేస్తాం…
- Ap political StoryNewsPolitics
- March 28, 2023
- No Comment
- 37
గడప గడపకు మన ప్రభుత్వం అంటూ ప్రజల మధ్యకు వెళ్లిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే కిరణ్ కుమార్ కు ఊహించని షాక్ తగిలింది. అద్వానంపేటలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్ కుమార్, ఓ కుటుంబాన్ని కుశలపశ్నలు వేశారు. వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తావ్ పెద్దాయనా అని ఓ వృద్దుడిని అడిగాడు. ఇలా అడిగాడో లేదో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చంద్రబాబునాయుడు గారికి ఓటేస్తామని చెప్పేశాడు ఆ పెద్దాయన.
దీంతో వైసీపీ ఎమ్మెల్యే కిరణ్ కుమార్ మొఖం మాడిపోయింది. పక్కనున్న వైసీపీ నేతలు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయంటూ ఎమ్మెల్యే చల్లగా అక్కడ నుంచి జారుకున్నారు. కొంచెం ముందుకు వెళ్లగానే ఓ యువకుడు నాలుగేళ్లలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రకటన ఒక్కటి కూడా రాలేదని ఎమ్మెల్యేను నిలదీశాడు. దీంతో సమాధానం చెప్పలేక కిరణ్ కుమార్ కారెక్కి వెళ్లిపోయారు.