నిరుద్యోగులను నట్టేట ముంచిన జగన్‌ : నక్కా ఆనంద్‌బాబు

నిరుద్యోగులను నట్టేట ముంచిన జగన్‌ : నక్కా ఆనంద్‌బాబు

ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖున జాబ్‌ క్యాలెండర్‌ రిలీజ్‌ చేస్తాము, అధికారంలోకి రాగానే 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాను అని చెప్పిన జగన్‌ మోహన్‌ రెడ్డి నిరుద్యోగులను నట్టేట ముంచాడని మాజీ మంత్రి, పోలిట్‌ బ్యూరో సభ్యులు నక్కా. ఆనంద్‌ బాబు విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు లేవు ఉన్న పరిశ్రమలు తన్ని తరిమేశాడు ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల పరిస్థితి ప్రశ్న అధికంగా మారి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు సుమారు ఇప్పుడు వరకు 21,000 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారంటే చాలా బాధాకరమైన విషయం.

ఒక నివేదిక ప్రకారం 2019 ఏప్రిల్‌ నాటికి 4% ఉన్న నిరుద్యోగిత 2022 డిసెంబర్‌ నాటికి 7.7% కి పెరిగింది అంటే వీరి చేతగానితనం మనకు అర్థమవుతుంది. టిడిపి హయాంలో5.13 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని స్వయంగా మీ మంత్రి శాసనసభలో చెప్పారు. అమరావతి రాజధాని నిర్మాణం ద్వారా 15 లక్షల ఉద్యోగాలకు తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుడితే జగన్మోహన్‌ రెడ్డి అధికారులకు వచ్చి అమరావతిని నిర్వీర్యం చేశాడు.

తెలుగుదేశం పార్టీ హయాంలో డీఎస్సీ నిర్వహించి సుమారు 18 వేల టీచర్ల పోస్టులు భర్తీ చేయడం జరిగింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏటా మెగా డీఎస్సీ నిర్వహిస్తాను అని చెప్పి బూటకపు వాగ్దానాలు చేసే అధికారులకు వచ్చిన జగన్మోహన్‌ రెడ్డి ఎన్ని టీచర్ల పోస్టులు భర్తీ చేశాడో చెప్పాలి. స్కిల్‌ డెవలప్మెంట్‌ ప్రోగ్రామ్‌ ద్వారా అనేకమంది నిరుద్యోగులకు ట్రైనింగ్‌ ఇచ్చి వారికి ఉద్యోగ కల్పన నాడు మేం చేసాం నేడు జగన్మోహన్‌ రెడ్డి స్కిల్‌ డెవలప్మెంట్‌ ను పూర్తిగా నిర్వీర్యం చేశాడని అన్నారు.and

Related post

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరు నగరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నగర ఇన్‌చార్జ్‌ ,మాజీమంత్రి పొంగూరు నారాయణ, సతీమణి రమాదేవి కలిసి పలు చోట్ల.. వినాయక స్వామివారిని…
పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

టీడీపీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది. కానీ, వాటన్నంటినీ ఎదుర్కొని పార్టీని సమర్థవంతంగా ముందుండి నడిపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కానీ, ఇప్పుడు ఆయనకే కష్టం వచ్చింది. అక్రమ అరెస్ట్…
చంద్ర‌బాబుకు అండ‌గా నిలుద్దాం..  విడుదల అయ్యేంత వరకు పోరాటం

చంద్ర‌బాబుకు అండ‌గా నిలుద్దాం.. విడుదల అయ్యేంత వరకు పోరాటం

నాలుగున్నర దశాబ్దాల పాటు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవినీతికి తావు లేకుండా.. టీడీపీ అధినేత చంద్రబాబు పరిపాలన చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం.. నిరంతరం అభివద్ధే ధ్యేయంగా పని చేసిన చంద్రబాబుపై…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *