తక్కువ వ్యవధిలో వందల కోట్లు జగన్‌ ఎలా సంపాదించాడు? -మాజీ మంత్రి నక్కా ఆనంద్‌ బాబు

తక్కువ వ్యవధిలో వందల కోట్లు జగన్‌ ఎలా సంపాదించాడు? -మాజీ మంత్రి నక్కా ఆనంద్‌ బాబు

జగన్మోహన్‌ రెడ్డి ఈ మధ్య మాట్లాడుతూ, రాష్ట్రంలో జరిగేది క్యాస్ట్‌ వార్‌ కాదు..క్లాస్‌ వార్‌ అని, పేదలు… పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతోందని చెప్పడం చూస్తే నవ్వొస్తోం దని, దేశంలోనే అత్యంత ధనవంతుడైన సీఎం పేదవాడు ఎలా అవుతాడని, టీడీపీ పొలిట్‌ బ్యూరోసభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనంద్‌ బాబు ప్రశ్నించారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ది ప్రింట్‌ వెబ్‌ సైట్‌, ఏ.డీ.ఆర్‌ (అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌) నివేదికలు భారతదేశంలో అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అని తేల్చాయి. ఎన్నికల అఫిడవిట్లో తనకు రూ.510కోట్లు ఉన్నట్టు జగన్‌ చెప్పాడు. ఆయనచెప్పిన దానిప్రకారమే ఆయా సంస్థలు దేశంలోనే అత్యంత ధనికుడైన సీఎంగా జగన్‌ ను పేర్కొన్నాయి. 29రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రికి లేనంత డబ్బు జగన్‌ వద్దే ఉంది. 28 మంది ముఖ్యమంత్రుల ఆస్తులన్నీ కలిపితే, జగన్మోహన్‌ రెడ్డికి ఉన్న రూ.510కోట్లతో సమానం. తక్కువవ్యవధిలో వందలకోట్లు జగన్‌ ఎలా సంపాదించాడు? 2009 నుంచి 2019 నాటికి జగన్‌ ఆస్తిపాస్తులు ఏటికేడు అమాంతం ఎలా పెరిగాయి? తన సంపాదన వెనకున్న ఆ కిటుకు ప్రజలకు చెప్పి రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయాలని జగన్‌ ను కోరుతున్నాం.

2009లో ఎంపీగా పోటిచేసినప్పుడు జగన్మోహన్‌ రెడ్డి తనకు రూ.77.39కోట్లు ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నాడు. మరలా 2011లో జరిగిన ఉపఎన్నికల అఫిడవిట్లో తన కు ఉన్న ఆస్తి రూ.413కోట్లు అనిచెప్పాడు. కేవలం రెండుసంవత్సరాల్లోనే ఏకంగా రూ.368 కోట్లు సంపాదించిన గొప్ప వ్యాపారవేత్త జగన్‌. ఆయన తనసంపాదన పెరగడానికి అనుసరి స్తున్న సూత్రాల్ని పేదలకు చెబితే, రాష్ట్రంలో క్లాస్‌ వార్‌ ఉండదుకదా! 2009-2011 మధ్యన అధికారికంగా రూ.368కోట్లు సంపాదించడం జగన్‌ వల్లే అయ్యింది. మరలా 2019లో జగన్‌ తన ఎన్నికల అఫిడవిట్లో తన సంపాదన రూ.510కోట్లుగా చూపాడు. ఈ విధంగా ఏటికేడు కోట్ల ఆస్తులు ఎలాపెరిగాయో, ఆకిటుకు ఏమిటో జగన్‌ ప్రజలకుచెబితే, వారుకూడా ధనవం తులు అవుతారు. పేదరికనిర్మూలనకోసం జగన్‌ తనసంపాదన వెనకున్న చిట్కాలను బయ టపెడితే పేదలంతా సంతోషిస్తారు. దేశంలోనే అత్యధిక సంపాదన కలిగిన ముఖ్యమంత్రిగా ఉన్న జగన్‌ పేదపలుకులు పలుకుతూ, తానే కఠికపేదవాడు అన్నట్టు మాట్లాడటం సిగ్గుచేటు.

తండ్రి అధికారంలో ఉన్నప్పుడే లక్షలకోట్లు కొట్టేసిన జగన్‌, ఇప్పుడు ఏకంగా రాష్ట్రాన్ని మాఫియాలకు అడ్డాగామార్చి, లూఠీచేస్తున్నాడు. తనతండ్రి అధికారంలో ఉన్నప్పుడు జగన్‌ అడ్డగోలుగా లక్షకోట్లు సంపాదించాడని చెప్పారు. సీబీఐ విచారణ జరిపితే, జగన్‌ అక్రమార్జన రూ.43వేలకోట్లుగా ఈడీతేల్చి, ఆ సొమ్ముని జప్తు చేసింది. ఈవిధంగా వేలకోట్లు కొల్లగొట్టిన జగన్‌ ..తానుపేదవాడిని అనడం ఎవర్ని మోసగించ డానికి? అప్పుడు లక్షకోట్లు కొల్లగొట్టిన జగన్‌, ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉం డి రాష్ట్రాన్ని మాఫియాలకు అడ్డాగా మార్చాడు. ఎక్కడచూసినా ల్యాండ్‌ మాఫియా.. శాండ్‌ మాఫియా..లిక్కర్‌ మాఫియా…ఎర్రచందనం మాఫియానే. సిమెంట్‌ వ్యాపారం, రేషన్‌ బియ్యం రీసైక్లింగ్‌ చేసి అమ్ముకోవడం.. అనంతపురంలో లేపాక్షి భూములు, విశాఖపట్నంలో వేలాది ఎకరాలు కొట్టేయడం… గ్రానైట్‌, సిలికా దోపిడీ. ఇలా చెప్పుకుంటూపోతే చాలాపెద్ద జాబితా నే ఉంది. ఈ విధంగా రాష్ట్రాన్ని, ప్రజల్ని తన దోపిడీవనరులుగా మార్చుకొని, 4ఏళ్లల్లో లక్షలకోట్లు కొల్లగొట్టిన జగన్మోహన్‌ రెడ్డి బీదవాడా? తనకు ఏ ఆస్తులు, ఆదాయం, టీవీఛానళ్లు.. పత్రి కా సంస్థలు లేవని నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నాడు. జగన్‌ చేస్తున్న అవినీతి, దోపిడీ, అతనిప్రభుత్వ దుర్మార్గాలను ఈనాడు బయటపెడుతుం దన్న అక్కసుతోనే జగన్‌ రామోజీరావుపై తప్పుడుకేసులు పెట్టి వేధిస్తున్నాడు. రామోజీరావు తప్పులుచేస్తే కేంద్రప్రభుత్వం పద్మవిభూషణ్‌ తో గౌరవిస్తుందా? జగన్‌ ప్రజల బిడ్డకాదు..ముమ్మాటికీ క్యాన్సర్‌ గడ్డే. ఆగడ్డను కట్‌ చేసి తొలగించకపోతే ప్రజ లు, రాష్ట్రమే సర్వనాశనమైపోతుందని అన్నారు.

Related post

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరు నగరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నగర ఇన్‌చార్జ్‌ ,మాజీమంత్రి పొంగూరు నారాయణ, సతీమణి రమాదేవి కలిసి పలు చోట్ల.. వినాయక స్వామివారిని…
పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

టీడీపీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది. కానీ, వాటన్నంటినీ ఎదుర్కొని పార్టీని సమర్థవంతంగా ముందుండి నడిపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కానీ, ఇప్పుడు ఆయనకే కష్టం వచ్చింది. అక్రమ అరెస్ట్…
చంద్ర‌బాబుకు అండ‌గా నిలుద్దాం..  విడుదల అయ్యేంత వరకు పోరాటం

చంద్ర‌బాబుకు అండ‌గా నిలుద్దాం.. విడుదల అయ్యేంత వరకు పోరాటం

నాలుగున్నర దశాబ్దాల పాటు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవినీతికి తావు లేకుండా.. టీడీపీ అధినేత చంద్రబాబు పరిపాలన చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం.. నిరంతరం అభివద్ధే ధ్యేయంగా పని చేసిన చంద్రబాబుపై…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *