నాలుగు ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి మద్యం దోపిడీ రూ.41 వేల కోట్లు :నల్లమిల్లి.

నాలుగు ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి మద్యం దోపిడీ రూ.41 వేల కోట్లు :నల్లమిల్లి.

అనపర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ

1.జగన్మోహన్ రెడ్డి మాట తప్పడు మడమ తిప్పడు అనేది ఏ విధంగా ఉoటుందనేది అనేక విషయంలో చూసాం. మద్యం విషయంలో ఎన్నికల ముందు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు ఇప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారనేది మనం చూసాం.తన సొంత ఆదాయం పెంచుకోవడం కోసం ఎన్నికల ముందు సంపూర్ణo గా మద్యం నిషేధం చేస్తామని ఆ తరువాత అధికారం లోకి వచ్చిన తరువాత ఈవేళ మాట తప్పి మడమ తిప్పి తన అనుయాయులతో చేయిస్తూ ఈ రాష్ట్రంలో ఈ నాలుగు సంవత్సరాల కాలంలో సుమారు 41 వేల కోట్ల రూపాయలు దోచుకోవడం జరిగింది.

2. ఎన్నికల ముందు 2019లో మైనిపిస్టో ఒకసారి చుస్తే కాపురంలో మద్యం చిచ్చు పెడుతుంది అందుకు మేము అధికారం లోకి వచ్చాక మద్యాన్ని మూడు దశలలో నిషేధం చేస్తామని, మద్యాన్ని ఫైవ్ స్టార్ హోటల్స్ కి మాత్రమే పరిమితం చేస్తామని 2019ఎన్నికల మేనిపెస్టో లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ మరల అందులోనే మద్యం నిషేధం చేసే మరల ఓటు అడుగుతామని స్పష్టంగా చెప్పడం జరిగింది. 2024లో మరి ఏవిధంగా ఓటు అడుగుతారని ఈ సందర్బంగా ప్రశ్నస్తున్నాను నాడు మద్యం నిషేధం అని హామీ ఇచ్చి ఈవేళ ఏవైతే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానం లేకుండా చేసి తన సొంత బ్రాండ్లు జె – బ్రాండ్స్ తయారీ చేసి వాటి ద్వారా 41 వేల కోట్ల అర్జీంచడం జరిగింది.

3. ఈవేళ ఆంధ్రప్రదేశ్ లో నాసిరకం మద్యం సరఫరా అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి అనుయాయుల ద్వారా, ఆ నాసిరకం మద్యం త్రాగడం వలన నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది అని విష రసాయనాలు బాడీ లో ప్రవేశిస్తున్నాయని చెన్నై కి చెందిన SGS ల్యాబ్ రిపోర్ట్స్ లో వెల్లడించిన సంగతిని కూడా మనం మీడియాలో చూసాం.అదే విధంగా ఈ నాసిరకం మద్యం త్రాగి ఇటువంటి లక్షణాలు రావడం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేప్ లు కానీ, హత్యలు కానీ, మహిళలను ఇబ్బందులు పెట్టడం కానీ, హత్యాచారాలు, హత్యలు పెరిగాయి అని సాక్షాత్తు కేంద్ర హోమ్ శాఖ మంత్రి పార్లమెంట్ లో తెలపిన సంగతిని కూడా మనం చూసాం. దాదాపుగా 58వేల నేరాలు మహిళపై జరిగాయి అనేది కేంద్ర మంత్రి ఇచ్చిన సమాచారం.

4.అదే విధంగా మద్యం షాపులలో పేమెంట్స్ కి ఎక్కడ డిజిటల్ కి అవకాశం లేదు. అంత క్యాష్ ట్రాన్సక్షన్స్ మాత్రమే జరుగుతా ఉంది.ఇక ప్రభుత్వ ఖజానాకు వేళాల్సిన 28 వేల కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలస్ కి మల్లించారు.ఇక ఏవైతే మద్యం బిస్లారిలీ ఉన్నాయో వాటి ద్వారా 13 వేల కోట్లు ఈ రెండిటిని కలిపి 41వేల కోట్లు రూపాయలను తాడేపల్లి ప్యాలస్ దోచుకుంది అనేది ఈ సందర్బంగా ప్రజానీకానికి తెలియచేస్తున్నాను. ఇంత దారుణంగా దోచుకోవడంతో పాటు మద్యం ఆదాయాన్ని 15 ఏళ్ళకు తాకట్టు పెట్టి 33వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి దే. మరి 15 ఏళ్ళ కు మద్యం ఆదాయం తాకట్టు పెడితే ఏ విధంగా మద్యం నిషేధం చేస్తారు అని ఏ విధంగా నమ్ముతాము. మరి ఈ నాలుగు ఏళ్ళు మద్యం నిషేధం పెట్టగా పొగ తన సొంత ఆదాయాన్ని పెంచుకున్న వ్యక్తి ఈవేళ మద్యం ఆదాయాన్ని కుదువా పెట్టి వ్యక్తి ఈవేళ మద్యం నిషేధం చేస్తామoటే ఏవిధంగా నమ్మ బలుకుతాo ఆ మాటలు చెప్పిన నమ్మడానికి వీలులేని పరిస్థితి ఏర్పడింది.

5. అదే విధంగా ఈవేళ గ్రామీణ ప్రాంతంలో కాని, పట్టణ ప్రాంతంలో కానీ పేదల రక్త మాంసం పీల్చుకు తింటున్న పరిస్థితి ఈవేళ ఒక కూలీ రోజుకి 500 రూపాయలు సంపాదిస్తూ ఉంటే, గతంలో 100 -150 రూపాయలు మద్యం కోసం ఖర్చు పెట్టుకుని మిగిలినవి ఇంట్లో ఇచ్చే పరిస్థితి ఉండేది కానీ ఈ రోజు మద్యం రేట్లు విపరీతంగా పెంచడంతో ఇంట్లో ఖర్చులకు తక్కువ మొత్తం ఇవ్వడం మద్యానికి ఎక్కువ ఖర్చు పెట్టడం జరుగుతుంది. అదే విధంగా ఈ రాష్ట్రంలో గంజాయి కానీ,హెరాయిన్ కానీ, ఇతర మత్తు పదార్దాలు విచ్చల విడిగా దొరకడం మనం చుస్తునాం. గంజాయి డ్రగ్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక డ్రగ్స్ మాఫియా గా మారింది. అదే విధంగా గతంలో గుజరాత్, హుంద్ర పోర్టు లకు ఆఫ్గానిస్తాన్, ఇరాక్ ల నుండి బెజవాడ లో ఆషిఫ్ కంపెనీ పేరుతో 74 వేల కోట్ల డ్రగ్స్ రవాణా కావడం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి తల ఒంపుగా తయారైంది.

6.అదే విధంగా ఏపీ లో గంజాయి సాగు మూడు రెట్లు పెరిగిందని పార్లమెంట్ లో కేంద్ర మంత్రి నిత్యనంద రోయ్ చెప్పడం జరిగింది. ఈ వేళ ఎక్కడ దాక ఎందుకు అనపర్తి నియోజకవర్గం అనపర్తి గ్రామంలో ఇద్దరు ముఠాలు అనపర్తి ఫ్లైఓవర్ పై కొట్టుకోవడం కేసులు నమోదు చేసుకొనే పరిస్థితి. ఈవేళ యువతను పక్క దారి పట్టించే పరిస్థితి వస్తుంది. ఈవేళ జగన్మోహన్ రెడ్డి తన అధికారం కోసం, తన సంపాదన కోసం ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత ను నిర్వీర్యం చేసే పరిస్థితి ఉంది. ఇది ఎంతమాత్రం క్షమించే పరిస్థితి లేదు అని తెలియచేస్తున్నాను. అందువల్ల ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అన్ని తుంగలోకి తొక్కి తన ఆదాయo కోసం, తన అధికారం కోసం ఇటువంటి పనులు చేయడం జరుగుతుంది.

7.వైస్సార్సీపీ నాయకులు, వారి కార్యకర్తలు కానీ గొప్పగా చెబుతారు మాట తప్పడు మడమ తిప్పడు అని ఈవేళ ఏ విధంగా ఆ రెండు తప్పుతున్నాడో మనం చూస్తున్నాం.ప్రజానీకం గమనించాల్సిన అవసరం ఉంది. తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సరైన మార్గంలోకి తెచ్చుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి లోను ఉందని ఈ సందర్బంగా తెలియచేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.

ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు దత్తుడు శ్రీను,మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాసరెడ్డి,తూర్పుగోదావరి జిల్లా అధికార ప్రతినిధి వెంకటరామారెడ్డి,తూర్పుగోదావరి జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి వెంకటసుబ్బారెడ్డి,రాష్ట్ర ఎస్సి సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి సూర్యప్రకాష్,బసివిరెడ్డి,అనపర్తి నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జ్ వెంకటరెడ్డి,నాయకులు పాల్గోన్నారు.

Related post

పిల్ల సైకోలను కాదు .. నువ్వేరా తేల్చకుందాం జగన్ కు నారా లోకేష్ సవాల్

పిల్ల సైకోలను కాదు .. నువ్వేరా తేల్చకుందాం జగన్ కు నారా…

మానసిక వైకల్యంతో సైకోగా మారింది ఎవరో తెలుసుకో ప్యాలెస్ బ్రోకర్! తండ్రి శవం పక్కన ఉండగానే సంతకాలు సేకరించిన సైకో ఎవరు? ప్రజా మ్యానిఫెస్టో దెబ్బకు వైసిపి ప్రభుత్వం…
సుమలత తనయుడి పెళ్లి..రజనీకాంత్,మోహన్ బాబు సందడి

సుమలత తనయుడి పెళ్లి..రజనీకాంత్,మోహన్ బాబు సందడి

కర్ణాటక ఎంపీ, సీనియర్ నటి సుమలత ఇంట పెళ్లి బాజా మోగింది. సుమలత తనయుడు అభిషేక్ పెళ్లి అంగరంగవైభవంగా జరిగింది. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ ప్రసాద్‌ బిదపా కుమార్తె…
చేనేతలకు అధునాతన శిక్షణా కేంద్రాలు : నారా లోకేష్ హామీ

చేనేతలకు అధునాతన శిక్షణా కేంద్రాలు : నారా లోకేష్ హామీ

టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేనేతలు అధునాతన సాంకేతిక పరిజ్జానానికి శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళంపాదయాత్రలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *