
దసరా తో నాని నిర్ణయం మారిపోయిందా..?
- EntertainmentMoviesNews
- May 2, 2023
- No Comment
- 49
నేచురల్ స్టార్ నాని గట్స్ ఉన్న హీరో అనిచెప్పాలి తాను చేస్తున్న సినిమాల ఫలితంతో సంబంధం లేకుండా తన ప్రయత్నాలు చేస్తూ వెళ్తున్నాడు. శ్యామ్ సింగ రాయ్ తో హిట్ అందుకున్న నాని అంటే సుందరానికీ సినిమాతో నిరాశ పరచాడు. ఇక ఆ తర్వాత దసరాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. తాను వేసే ప్రతి అడుగు చాల సెలెక్టీవ్ గా ప్రతిభ గల డైరెక్టర్స్ ని ఎంచుకోని మరి వేస్తున్నారు .
నానికి కెరీర్ స్టార్టింగ్ నుండి కొత్త దర్శకులతో ప్రయోగాలు చేయడం అలవాటే నానికి ఇప్పుడు ఉన్న క్రేజ్ కూడా అలానే వచ్చింది అయితే దసరా లెక్క వేరే అని చెప్పొచ్చు. ఎందుకంటే దర్శకుడికి మొదటి సినిమానే అయినా సినిమా బడ్జెట్.. బ్యాక్ డ్రాప్ అంతా కూడా స్టార్ డైరెక్టర్ రేంజ్ లో రాసుకున్నాడు.
మరి నానికి అతనిలో ఏం నచ్చి శ్రీకాంత్ ని నమ్మాడో కానీ నాని నమ్మకాన్ని నిలబెట్టుకుని అతనికి సూపర్ హిట్ ఇచ్చాడు శ్రీకాంత్ ఓదెల. దసరా సినిమా పాన్ ఇండియా రిలీజ్ అంటూ హడావుడి చేశారు. కానీ దసరా తెలుగులో తప్ప మిగతా ఎక్కడ సరిగా ఆడలేదు.
ఇంకా బాలీవుడ్ లో ఐతే హిందీ ఆడియన్స్ దసరాపై పెద్దగా ఆసక్తి చూపించలేదు. సినిమా అక్కడ ఇలా వచ్చి అలా వెళ్లినట్టు అయ్యింది. అందుకే నాని 30వ సినిమాకు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు నాని. అదేంటి అంటే ఇక మీదట తన సినిమాలన్నీ సౌత్ అన్ని భాషల్లో మాత్రమే రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడట.
ఐతే నాని సుందరానికీ సినిమాను అలానే రిలీజ్ చేశారు. కానీ ఆ సినిమా పెద్దగా నచ్చకపోవడంతో రిజల్ట్ తేడా కొట్టింది. నాని 30వ సినిమా మాత్రం కచ్చితంగా సౌత్ ఆడియన్స్ కి అందరికీ నచ్చుతుందని నాని నమ్ముతున్నాడట. అందుకే హిందీ వెర్షన్ కాకుండా సౌత్ అన్ని భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మరోసారి తండ్రిగా నేచురల్ స్టార్ కనిపించనున్నాడు. పెళ్లై ఒక పాప పుట్టాక విడిపోయిన భార్య భర్తల కథతో ఈ సినిమా వస్తుందని తెలుస్తోంది. ఈ సినిమా తో పాటుగా శైలేష్ కొలను హిట్ 3లో కూడా నాని నటిస్తున్న విషయం తెలిసిందే. చూద్దాం నాచురల్ స్టార్ నాని ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుందో