జగన్ సర్కార్ పై.. నిప్పులు చెరిగిన చంద్రబాబు

జగన్ సర్కార్ పై.. నిప్పులు చెరిగిన చంద్రబాబు

నాలుగేళ్ల వైసీపీ సర్కార్ పై టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. సైకోపాలనలో నాలుగేళ్లపాటు ప్రజలు నరకం అనుభవించారని, పరిపాలన చేతగాని ఆర్థిక నేరస్తుడిచేతిలో రాష్ట్రం విలవిల్లాడుతోందని.. చంద్రబాబు మండిపడ్డారు. అన్నపూర్ణలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. ప్రస్తుతం అన్నమోరామచంద్రా అనే దుస్థితి తీసుకొచ్చిన ఘనత జగన్ కే దక్కిందన్నారు. యువత ఉద్యోగాలు ఉపాధిలేక దిక్కుతోచనిస్థితిలో కొట్టుమిట్టాడుతుందని అన్నారు. జగన్ పాలనలో జరిగినటువంటి దారుణాలు.. ఏ రాష్ట్రంలో కూడా జరిగి ఉండవని తెలిపారు. జగన్ పాలనలో రాష్ట్రం.. రావణకాష్టం మైందని.. పట్టపగలే హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, దొమ్మీలు జరుగుతున్నా.. కనీసం ముఖ్యమంత్రి జగన్ స్పందించడం లేదని.. చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట.. ప్రతి రెండు, మూడురోజులకు ఒకచోట దళితులు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏపీలో అడుగ‌డుగునా ప్ర‌భుత్వ ఉగ్ర‌వాదం క‌నిపిస్తోందని.. రోజుకో ఘోరం తెర‌మీదికి వ‌స్తోందని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో.. ప్ర‌జలు శాంతి సామ‌ర‌స్యాల‌తో జీవించ‌లేని ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నారని.. చంద్ర‌బాబు తీవ్ర‌స్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీలో జ‌రిగిన ఘోరాలు-నేరాల‌ను చంద్ర‌బాబు వివ‌రించారు. ఈ మేర‌కు చంద్రబాబు ట్వీట్ చేశారు. నాలుగేళ్ల జగన్ పాలనలో.. రోజుకో ఘోరం .. ప్రతి చోటా ప్రభుత్వ టెర్రరిజం కనిపిస్తోందని వైసీపై ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు.రోడ్డు నిర్మించ‌మ‌ని అడిగిన కానిస్టేబుల్‌ను విధుల నుంచి స‌స్పెండ్ చేశార‌ని .. ఇంత క‌న్నా ఘోరం ఏముంటుంద‌ని చంద్రబాబు ప్రశ్నించారు. అదేవిధంగా పింఛ‌ను కావాల‌ని కోరిన మహిళపై అక్ర‌మ కేసు పెట్టి బెదిరించార‌ని.. ఇదేనా జగన్ పాలనలో మ‌హిళ‌ల‌కు ఇస్తున్న భ‌ద్ర‌త? అని చంద్రబాబు మండిపడ్డారు.

ధర్మవరం వస్త్ర వ్యాపారులపై విజ‌య‌వాడ‌లో వైసీపీ రౌడీలు దాడి చేసిన‌ ఘటనను ప్ర‌జ‌లు సైతం ఛీత్క‌రిస్తున్నార ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. బకాయిలు చెల్లించాలని అడిగినందుకు.. ధర్మవరానికి చెందిన చేనేత వర్గ వస్త్ర వ్యాపారులపై విజయవాడలో వైసీపీ గూండాలు అమానుష దాడికి పాల్పడ్డారు… బాధితులను నగ్నంగా వీడియోలు తీసి వికృతానందం పొందారని చంద్రబాబు .. తన ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు వేయమని ఉపముఖ్యమంత్రిని అడిగిన పాపానికి చిత్తూరు జిల్లాలో దళిత వర్గానికి చెందిన కానిస్టేబుల్‌పై కేసు పెట్టారని.. తర్వాత.. సస్పెండ్ చేశారన్నారు. ఇది ప్ర‌భుత్వ ఉగ్ర‌వాదం కాదా? అని చంద్రబాబు నిల‌దీశారు. ప్రకాశం జిల్లాలో పింఛను డబ్బు అడిగిన వితంతు మహిళపై కేసు పెట్టారని చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు. జగన్ పాలనలో ప్రతి రోజుకో ఘోరం.. ప్రతి చోటా ప్రభుత్వ టెర్రరిజం ఉంటుందని.. ఇదీ జగన్ పాలనలో .. రాష్ట్రంలో పరిస్థితి అంటూ చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసు శాఖను.. వైసీపీ అనుబంధ విభాగంగా మార్చిన ఘ‌న‌త.. సీఎం జ‌గ‌న్‌కే ద‌క్కుతుంద‌ని చంద్రబాబు విమ‌ర్శించారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *