ఎన్టీఆర్ కు భారతరత్న కోసం పోరాడుతాం : శతజయంతి సభలో చంద్రబాబు వెల్లడి

ఎన్టీఆర్ కు భారతరత్న కోసం పోరాడుతాం : శతజయంతి సభలో చంద్రబాబు వెల్లడి

ఎన్టీఆర్ కు భారతరత్న కోసం ప్రతిజ్ఞ చేయాలి

తీర్మానం చేసి ఢిల్లీ పంపుతాం

తెలుగుజాతి ఆత్మగౌరవం కోసమే ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం

రజనీకాంత్ ను ఆదర్శంగా తీసుకోవాలి

సినీ, రాజకీయ రంగాల్లో బాలకృష్ణ రాణిస్తున్నారు

ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి. అందుకోసం ప్రతిజ్ఞ చేయాలి. అందుకోసం తెలుగుజాతి పోరాడాలి. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేసి ఢిల్లీ పంపుతాం. అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలో భాగంగా విజయవాడ లో శుక్రవారం రాత్రి జరిగిన పుస్తకావిష్కరణ సభలో చంద్రబాబు ప్రసంగించారు. తెలుగు చరిత్ర ఉన్నంత వరకు ప్రజల గుండెల్లో వుండే వ్యక్తి ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు ను పర్యాటక కేంద్రంగా మారుస్తామని వెల్లడించారు. ఎన్టీఆర్ పేరుతో మెమోరియల్ కోసం కార్యాచరణ రూపొందించనున్నట్లు చంద్రబాబు చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం అమలు చేసి చూపింది తెలుగుదేశం పార్టీయే నన్నారు.

పదికోట్ల మంది తెలుగు ప్రజలు ఎన్టీఆర్ కు నివాళులు అర్పిస్తున్నారని చెప్పారు. ఒక నాయకుడు మరొక నాయకుడిని ఏవిధంగా ప్రభావితం చేస్తారో రజనీకాంత్ చక్కగా వివరించారని ప్రశంసించారు. రజనీకాంత్ ను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు. ఒక శక్తి. ఎన్టీఆర్ ఎక్కడ వుంటే అక్కడ స్ఫూర్తి వుంటుందన్నారు. భాషతో సంబంధం లేకుండా విదేశాల్లోనూ రజనీకాంత్ చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారని చెప్పారు. మంచి మానవత్వం వున్న వ్యక్తి రజనీకాంత్ అని చంద్రబాబు ప్రశంసించారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు రజనీకాంత్ ను ఆహ్వానించగా నే సినిమా చిత్రీకరణ ను సైతం రద్దు చేసుకొని వచ్చారని కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీఆర్ స్ఫూర్తి తెలుగుజాతిలో శాశ్వతంగా వుండాలని అభిప్రాయపడ్డారు.

ఎన్టీఆర్ నటించిన విధంగా భవిష్యత్ లో ఎవరూ చేయలేరన్నారు. తెలుగుజాతి శాశ్వతంగా గుర్తుంచుకునే వ్యక్తి ఎన్టీఆర్ అని ప్రశంసించారు. ఎన్టీఆర్ నటించిన విధంగా భవిష్యత్ లో ఎవరూ చేయలేరన్నారు. అధికారం కోసం కాకుండా దేశ రాజకీయాలలో మార్పు తెచ్చేందుకే ఎన్టీఆర్ సంకల్పించారు అని వివరించారు. తెలుగుజాతి అవమానాలకు గురవుతుంది అని ఎన్టీఆర్ బాధపడ్డారన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవం కాపాడేందుకు ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేశారని చెప్పారు. తెలుగు చరిత్ర వున్నంత వరకు ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా వుంటారని పేర్కొన్నారు. సినీ రాజకీయ రంగాలలో బాలకృష్ణ రాణిస్తున్నారు అని చంద్రబాబు ప్రశంసించారు. బసవరామ తారకం క్యాన్సర్ ఆసుపత్రిని సేవాభావంతో నడిపిస్తున్నారని అన్నారు.

అదేవిధంగా ఎన్టీఆర్ మెచ్చిన పాత్రికేయుడు వెంకటనారాయణ అని చంద్రబాబు ప్రశంసించారు. ఎన్టీఆర్ పై తొలినాళ్లలో వెంకట నారాయణ పుస్తకం రాసారాన్నారు. ఎన్టీఆర్ గురించి దేశానికే కాకుండా ప్రపంచానికే తెలియచెప్పారని అభినందించారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *