దొంగచేతికి తాళాలు ఇచ్చారు. ఏం జరిగింది? నారా లోకేష్

దొంగచేతికి తాళాలు ఇచ్చారు. ఏం జరిగింది? నారా లోకేష్

జగన్ పాలనలో అన్నివర్గాల ప్రజలూ బాధితులే
మరోసారి అధికారమిస్తే ఇళ్లలోకి వచ్చి దోచేస్తారు
అధికారంలోకి వచ్చాక అడ్వకేట్లకు ప్రత్యేక రక్షణ చట్టం
జగన్ వేసిన అడ్డగోలు పన్నులు తగ్గిస్తాం
పాత ఫీరీఎంబర్స్ మెంట్ విధానాన్ని అమల్లోకి తెస్తాం
ప్రముఖులతో ముఖాముఖిలో యువనేత లోకేష్
……
జగన్ ది ఫ్యాక్షన్ మనస్తత్వం. జగన్ పాలనలో అన్ని రంగాలవారు బాధితులే, సొంత జిల్లా కడప, సొంత నియోజకవర్గం పులివెందులకి ఏం చేశాడో జగన్ చెప్పగలడా? అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సవాల్ విసిరారు. ప్రొద్దుటూరు నియోజకవర్గం కొత్తపల్లిలో వివిధరంగాల ప్రముఖులతో యువనేత లోకేష్ ముఖాముఖి సమావేశమయ్యారు. సమావేశంలో లోకేష్మాట్లాడుతూ ఉమ్మడి కడప జిల్లాలో 10కి 10 సీట్లు ఇస్తే జగన్ చేసింది ఏంటి? దొంగ చేతికి తాళం ఇస్తే ఏం జరిగింది? అందరూ దోపిడీకి గురయ్యారు. లాయర్లు, డాక్టర్లు, వ్యాపారస్తులు, టీచర్లు, ఐటి నిపుణులు అందరూ జగన్ చేతిలో బాధితులే. మిమ్మల్ని విపరీతంగా జగన్ వేధిస్తున్నారు.

జగన్ పాలనలో ఏపి బీహార్ తో పోటీ పడుతుంది. ప్రస్తుతానికి షాపులు, వ్యాపారాల మీద దాడి చేస్తున్నారు. మరోసారి ఓటేస్తే జగన్ అండ్ కో ఇళ్లలోకి వకచ్చి దోచుకుంటారు. ప్రొద్దుటూరు ప్రశాంతంగా ఉండాలి అంటే టిడిపి జెండా ఎగరాలి అని లోకేష్ పిలుపునిచ్చారు. వ్యాపారస్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రొద్దుటూరులో వ్యాపారస్తులు కప్పం కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. మరో పక్క చెత్త పన్ను, బోర్డు పన్ను, కరెంట్ బిల్లులు పేరుతో భారీగా జే ట్యాక్స్ కడుతున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ పెంచిన అడ్డగోలు పన్నులు తగ్గిస్తాం. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తీసుకొచ్చాం. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తీసుకొచ్చి వ్యాపారాలు తక్కువ ఖర్చుతో నిర్వహించే విధంగా ప్రోత్సహిస్తాం. వెయ్యి, రెండు వేల నోట్లు రద్దు చెయ్యాలని చెప్పిన ఏకైక నాయకుడు చంద్రబాబు గారు. దొంగబ్బాయ్ ఉన్నంత వరకూ దొంగ నోట్లు ఉంటాయి. బాబు గారు వచ్చిన వెంటనే అక్రమార్కులు ఆటోమేటిక్ గా కంట్రోల్ అవుతారు అని లోకేష్ చెప్పారు. బాబు అంటే బ్రాండ్. జగన్ అంటే జైలు.

టిడిపి హయాంలో 6లక్షల ఉద్యోగాలు కల్పించాం అని వైసిపి ప్రభుత్వమే ఒప్పుకుంది. ఇప్పుడు కోడి గుడ్డు మంత్రి రాష్ట్ర పరువు తీస్తున్నాడు. జగన్ వేధింపుల వలన అన్ని కంపెనీలు ఇతర రాష్ట్రాలకు పారిపోతున్నాయి. టిడిపి హయాంలో అభివృద్ది వికేంద్రీకరణ చేసి చూపించాం. రాయలసీమను ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ హబ్ గా మార్చాం, విశాఖకు ఐటి కంపెనీలు తీసుకొచ్చాం. జగన్ వేదింపులు, జే ట్యాక్స్ కట్టలేక కంపెనీలు అన్ని ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయి. అమర్ రాజా, ఫాక్స్ కాన్, రిలయన్స్ లాంటి సంస్థలు వేరే రాష్ట్రాలకు వెళ్లి పోయాయని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్ విధానాలు విద్యార్థుల పాలిట శాపం

జగన్ వచ్చిన తరువాత విద్యా వ్యవస్థను నాశనం చేశాడని లోకేష్ ఆరోపించారు. టీచర్లను మద్యం దుకాణాల ముందు నిలబెట్టి సెక్యూరిటీ గార్డుల్లా ట్రీట్ చేశారు. ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని భ్రష్టు పట్టించాడు. విద్యా దీవెన, వసతి దీవెన అనే చెత్త కార్యక్రమాలు తీసుకొచ్చాడు. డబ్బులు పడక, సర్టిఫికేట్లు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జగన్ కొత్త విధానాలు తల్లిదండ్రులు, విద్యార్థుల పాలిట శాపంగా మారాయి.

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పాత ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేస్తాం. కేజీ టూ పీజీ వరకూ పాఠ్యాంశాలు పూర్తిగా మారుస్తాం. విద్య పూర్తి చేసే సరికి ఉద్యోగాలు చెయ్యడానికి సిద్దంగా ఉండేలా విద్యార్థులను తీర్చిదిద్దుతాం.విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తాం. టీచర్లపై ఎటువంటి వేధింపులు ఉండవు, యాప్ ల పేరుతో పెట్టిన భారం లేకుండా చేస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత టీచర్లు కేవలం పాఠాలు చెప్పే పని తప్ప ఇతర పనులతో వేధింపులు ఉండవని లోకేష్ హామీ ఇచ్చారు.

న్యాయవిభాగానికి మేం నిధులిస్తే ఆపేశారు

టిడిపి హయాంలో న్యాయ విభాగానికి నిధులు కేటాయించి కొత్త భవనాలు, లైబ్రరీలు కట్టించడానికి పనులు ప్రారంభించాం. ఈ ప్రభుత్వం ఆ పనులు నిలిపివేసిందని లోకేష్ చెప్పారు. నేను సాక్షిపై పరువు నష్టం దావా కేసు వేసాను. అందులో భాగంగా వైజాగ్ కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టుల్లో ఎంత దారుణమైన పరిస్థితి ఉందో అర్థమైంది. ఆ రోజే నిర్ణయించుకున్నా, న్యాయ వ్యవస్థకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అడ్వకేట్ల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తెస్తాం. మౌలిక వసతుల కల్పన కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తాం. కొత్త భవనాలు, జూనియర్ లాయర్ల కోసం కోర్టులోనే లైబ్రరీ, ఇతర మౌలిక వసతులు కల్పిస్తాం. అడ్వకేట్లకు ప్రత్యేక ఇన్స్యూరెన్స్ స్కీం తీసుకురావడం పై చర్చించి నిర్ణయం తీసుకుంటాం. అడ్వకేట్లకు నాణ్యమైన ఇళ్లు కట్టించి ఇస్తాం. ప్రత్యేక సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

టిడిపి హయాంలో తీసుకొచ్చిన ఫైబర్ గ్రిడ్ ని జగన్ చంపేశాడు. తక్కువ ధరకే హైస్పీడ్ ఇంటర్నెట్ అందిస్తే ప్రజలకు మేలు, వర్క్ ఫ్రం హోమ్ చేసుకోవచ్చు అని చంద్రబాబు ఫైబర్ గ్రిడ్ డిజైన్ చేశారు. ఫైబర్ గ్రిడ్ పథకాన్ని చంపడానికి నాపై అనేక ఆరోపణలు చేశారు. ఫైబర్ గ్రిడ్ దగ్గర నుండి స్కిల్ డెవలప్మెంట్ వరకూ అనేక ఆరోపణలు చేశారు. ఒక్కటి కూడా నిరుపించలేకపోయారు. ఎవరూ అడగకపోయినా ఆస్తులు ప్రకటించిన కుటుంబం మాది. మాకు జగన్ లా దోచుకొని జైలుకి వెళ్ళాలి అనే ఆశ లేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే చౌకగా హై స్పీడ్ ఇంటర్నెట్ అందిస్తామని హామీ ఇచ్చారు.

పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేస్తాం

పర్యాటక రంగం లో ఏపికి అనేక అద్భుత అవకాశాలు ఉన్నాయని లోకేష్ వెల్లడించారు. ఎకో టూరిజం ఏర్పాటు ద్వారా ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా తీర ప్రాంతాన్ని, ఏకో టూరిజం, టైగర్ ఎకో టూరిజం అభివృద్ది చేస్తాం. ధనవంతులకు, పేదలకు మధ్య వ్యత్యాసం బాగా పెరిగిపోయింది. టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చి ఆ వ్యత్యాసాన్ని తగ్గిస్తామని చెప్పారు.

ముఖాముఖి సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలు

కొత్తపల్లి విడిది కేంద్రం వద్ద వివిధ రంగాల నిపుణులతో నిర్వహించిన సమావేశంలో పలువురు తమ అభిప్రాయాలను తెలియజేశారు. అడ్వకేట్ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ కోర్టుల్లో మౌలిక వసతులు లేక ఇబ్బంది పడుతున్నాం, కనీస సౌకర్యాలు కూడా లేవన్నారు. ఐటి ఉద్యోగి కొండయ్య మాట్లాడుతూ జగన్ పాలనలో ఒక్క ఐటి కంపెనీ కూడా రాకపోవడంతో ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఉద్యోగాలు చేసుకోవాల్సిన
పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు.

నవీన్ మాట్లాడుతూ కడపలో పర్యాటక రంగాన్ని జగన్ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని చెప్పారు. అడ్వకేట్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అడ్వకేట్ల కు హెల్త్ స్కీం అనేది లేక ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. మరో అడ్వకేట్ ప్రకాష్ మాట్లాడుతూ ఇంటి స్థలాలు, ఇళ్లు లేక అడ్వకేట్లు ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. విద్యార్థి శ్రీనివాస్ మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఎత్తేసారు, ఉపాధ్యాయులను ప్రభుత్వం వేధిస్తుంది. ప్రభుత్వ విధానాల వలన నాణ్యమైన విద్య అందడం లేదన్నారు.

వ్యాపారి రాము మాట్లాడుతూ ప్రొద్దుటూరులో వ్యాపారస్తులు అనేక ఇబ్బందులు పడుతున్నాం. దొంగ నోట్లు ఎక్కువుగా చలామణి అవుతున్నాయని అన్నారు. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం వచ్చాక ఏపి ఫైబర్ ను నాశనం చేశారు. టిడిపి హయాంలో 10 లక్షల కనెక్షన్లు ఉంటే ఇప్పుడు కేవలం 4 లక్షల కనెక్షన్లు మాత్రమే ఉన్నాయన్నారు. అడ్వకేట్ క్లర్క్ వరదరాజులు మాట్లాడుతూ పేద అడ్వకేట్లు, అడ్వకేట్ గుమాస్తాలను ఆదుకోవడానికి ప్రత్యేక సంక్షేమ నిధి ఏర్పాటు చెయ్యాలని కోరారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *