చంద్రన్నను సిఎం ను చేయాలి నారా లోకేష్ విజ్ఞప్తి

చంద్రన్నను సిఎం ను చేయాలి నారా లోకేష్ విజ్ఞప్తి

పేదలకోసం పనిచేసే చంద్రన్నను ముఖ్యమంత్రిని చేసేందుకు సహకారం అందించండి అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. యువగళం పాదయాత్రలో భాగంగా శనివారం కర్నూలు 48వవార్డు అమీర్ హైదర్ ఖాన్ నగర్ వాసులు యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.

గత 20 ఏళ్ల నుండి 48వ వార్డులో 250 కుటుంబాలు నివసిస్తున్నాం. ఇక్కడ సరిగా డ్రైనేజీ కాలువలు లేవు. రోడ్లు లేక వర్షాలు వస్తే ఇబ్బందులు పడుతున్నాం. మంచినీటి సమస్య వెంటాడుతోంది, ఎండాకాల వస్తే తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. మా ప్రాంతంలో చాలామందికి ఇళ్లులేవు, పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలి అని వారు విజ్ఞప్తి చేశారు.

వారి సమస్యల పరిషకారానికి నారా లోకేష్ హామీ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మేయర్ రామయ్యలకు దోచుకోవడంపై శ్రద్ధ ప్రజలకు సౌకర్యాలు కల్పించడంపై లేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కర్నూలు నగరంలో ఇంటింటికీ కుళాయి అందజేసి, తాగునీటి సమస్య పరిష్కరిస్తాం. రోడ్లు, డ్రైనేజిలు వంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తాం. ఇళ్లులేని పేదలందరికీ పక్కా ఇళ్లు మంజూరు చేస్తామని వెల్లడించారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *