
సీమ ప్రజల కష్టాలు, కన్నీళ్లు చూశా.. అందుకే .. మిషన్ రాయలసీమ
- Ap political StoryNewsPolitics
- June 17, 2023
- No Comment
- 18
రాయలసీమ అంటే ఫ్యాక్షనిజం అన్నది ఒకప్పటి మాట. టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలోకి వచ్చాక.. రాయలసీమకు అండగా పసుపు జెండా నిలబడింది. సీమ అభివృద్ధి కోసం నిరంతరం చంద్రబాబు నిరంతరం శ్రమించారు. తెలుగుగంగ నుంచి హంద్రీనీవా వరకు ప్రాజెక్టులను తెచ్చి సీమ ప్రజల తాగునీటి కష్టాలు తీర్చడానికి కృషి చేశారు. కియా, ఫ్యాక్స్ కాన్, టిసిఎల్ వంటి పరిశ్రమల ఏర్పాటుతో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో చంద్రబాబు కృషి చేశారు.
ప్రస్తుతం రాయలసీమ ప్రజల కష్టాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. నారా లోకేష్ స్పందించారు. 2019 ఎన్నికల్లో వైసిపి తరపున 49మందిని గెలిపించారని.. ఇంత భారీ మ్యాండేట్ ఇచ్చినందుకు ఎన్ని పరిశ్రమలు తేవాలి, ఎంత అభివృద్ధి చేయాలి? ఒక్క పరిశ్రమ తెచ్చారా? అని ప్రశ్నించారు. జగన్ రెడ్డి హయాంలో.. ఒక్క సాగునీటి ప్రాజెక్టు వచ్చిందా? అన్నారు. అదే మ్యాండేట్ రాబోయే ఎన్నికల్లో టిడిపికి ఇవ్వండి, అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తామని.. నారా లోకేష్ చెప్పారు.
యువగళం సుదీర్ఘ పాదయాత్రలో .. రాయలసీమ ప్రజల పడుతున్న కష్టాలు, కన్నీళ్లు చాశానని.. టీడీపీ అధికారంలోకి వచ్చాక రాయలసీమ ప్రాంత సమస్యలను పరిష్కరించి అభివృద్ధి బాట పట్టిస్తామని .. అందుకు మిషన్ రాయలసీమను ప్రకటిస్తున్నానని లోకేష్ భరోసా ఇచ్చారు. మిషన్ రాయలసీమలో భాగంగా.. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయడం ద్వారా ప్రతి ఎకరానికి సాగునీరు, వాటర్ గ్రిడ్ ద్వారా 24 గంటలు ఇంటింటికీ సురక్షితమైన మంచినీరు అందిస్తామన్నారు.
ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్ పరిశ్రమల ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన, రాయలసీమలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు, శ్రీశైలం కేంద్రంగా రాయలసీమను పర్యాటక కేంద్రంగా అభివద్ధి చేయడం వంటివి మిషన్ రాయలసీమలో అంతర్భాగమని లోకేష్ తెలిపారు. 2024లో అధికారంలోకి వచ్చాక.. మిషన్ రాయలసీమను.. ఎట్టి పరిస్థితుల్లోనూ.. అమలు చేసి తీరుతానని యువనేత లోకేష్ స్పష్టంచేశారు.