
మృతిచెందిన కార్యకర్త కుటుంబానికి లోకేష్ భరోసా!
- Ap political StoryNewsPolitics
- June 28, 2023
- No Comment
- 20
సంక్షేమ నిధి నుంచి సాయం అందిస్తామని హామీ
గూడూరు నియోజకవర్గం చిట్టమూరులో ఇటీవల రోడ్డుప్రమాదంలో మృతిచెందిన వెంకటరమణ అనే కార్యకర్త కుటుంబసభ్యులు యువనేత నారా లోకేష్ ను కలిశారు. కుటుంబ పెద్దదిక్కును కోల్పోయిన తమ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని మృతుడి భార్య నాగమణి ఆవేదన వ్యక్తంచేసింది. వారి ఇద్దరు పిల్లలను దగ్గరకు తీసుకుని ఓదార్చిన యువనేత లోకేష్ కార్యకర్తల సంక్షేమ నిధినుంచి ఆదుకుంటామని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… దేశంలో ఇంతవరకు ఏ రాజకీయపార్టీ చేయని కార్యకర్తల సంక్షేమానికి 135కోట్లు వెచ్చించామని, తెలుగుదేశం పార్టీ కేడర్ కోసం ఎంత సొమ్ము వెచ్చించడానికైనా వెనుకాడబోమని స్పష్టంచేశారు.