నాడు-నేడు ప్ర‌చార‌మే..బ‌డిలో పిల్ల‌ల‌కి ప్ర‌మాద‌మే

నాడు-నేడు ప్ర‌చార‌మే..బ‌డిలో పిల్ల‌ల‌కి ప్ర‌మాద‌మే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నాడు-నేడు కార్యక్రమం ద్వారా.. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తాన్న జగన్ వాగ్దానం.. కేవలం మాటలకే పరిమితం అయింది. ఇప్పటికీ ప్రాథమిక స్కూళ్లల్లో ఏ మాత్రం మారని దుస్థుతి నెలకొంది. ఓ వైపు శిధిలమైన భవనం.. పెచ్చులూడిన గచ్చులు, విరిగిపోయిన బల్లలు, వర్షం పడితే విద్యార్థులంతా ఒక మూల కూర్చునేలా కురుస్తున్న గదులతో ఆ పాఠశాల ఉంది.. అపరిశుభ్ర వాతావరణంలో.. కనీసం టాయిలెట్ సౌకర్యం కూడా లేనటువంటి పరిస్థితి నెలకొంది.

ఇటువంటి ఇబ్బందుులు తీవ్రంగా విద్యార్థులను వేధిస్తున్నా.. పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. యువ‌గ‌ళం పాద‌యాత్ర శింగ‌నమ‌ల నియోజ‌క‌వ‌ర్గంలో నిర్విరామంగా కొన‌సాగుతోంది. నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నప్పుడు..సలకంచెరువు గ్రామ ప్రాథమిక పాఠశాల ను సందర్శించారు. అక్కడి స్కూల్ విద్యార్థులు.. ఆప్యాయంగా నారా లోకేష్ ను పలకరించారు. అనంతరం.. నాడు-నేడు కింద చేపట్టిన పనులను పరిశీలించారు. పనులు మధ్యలో ఆగిపోవడంతో మొండిగోడలు దర్శనమిచ్చాయి.

సలకంచెరువు గ్రామ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల దుస్థితిని చూసి నారా లోకేష్ చలించిపోయారు. ఆ స్కూల్ ను పరిశీలిస్తే.. స‌గం కూలిన‌ ఈ బ‌డిలో 40మంది నిరుపేద విద్యార్థులు చదువుకుంటున్నారు. మొండిగోడ‌ల మ‌ధ్య‌నే, ప్ర‌మాదం నీడ‌లోనే పిల్ల‌లు బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. నాడు-నేడు అనే ప్ర‌మాదం పొంచి వుంద‌ని క‌ల్మ‌షంలేని ఆ చిన్నారి మ‌న‌సుల‌కి తెలియ‌దు. దీంతో నారా లోకేష్ ఎంతో ఆవేదన చెందారు. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య సలహాదారుడి నియోజకవర్గంలో నాడు – నేడు కార్యక్రమం ఆర్భాటానికే పరిమితం అయ్యిందని, పిల్లలు ప్రమాదపుటంచున చదువుకుంటున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ అన్నారు.

మేనమామ అంటే బతుకు కోరుతాడు. జగన్ లా.. బలికోరేవాడిని కంసమామ అని అంటారని లోకేష్ అన్నారు. నాడు-నేడుతో ప్రభుత్వ పాఠశాలలు రూపరేఖలను.. కార్పొరేట్‌ స్కూళ్లకి ధీటుగా మార్చేశామని గొప్పులు చెబుతున్న జగన రెడ్డి ఇదేనా నీ అభివృద్ధి అని ప్రశ్నించారు. పేద‌పిల్ల‌ల‌కు అక్ష‌ర‌జ్ఞానం అందిస్తోన్న సలకంచెరువు పాఠ‌శాల మ‌ర‌మ్మ‌తుల‌కు నిధులు కేటాయించలేని దుస్థితిలో జగన్ ప్రభుత్వం ఉందని లోకేష్ తెలిపారు. నాడు-నేడు కోట్ల ఖ‌ర్చుతో .. సొంత మీడియా సాక్షిలో ప్ర‌చారానికి మాత్రం బాగానే ప‌నికొస్తోందని నారా లోకేష్ అన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే.. ఇటువంటి స్కూళ్ల పరిస్థితులను పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉందని.. నారా లోకేష్ అన్నారు.

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *