వివేకాది జగనాసుర రక్తచరిత్ర : నారా లోకేష్

వివేకాది జగనాసుర రక్తచరిత్ర : నారా లోకేష్

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడే డ్రామాలు ఆస్కార్ స్థాయిలో ఉన్నాయని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ అన్నారు. పత్తికొండ నియోజకవర్గంలో 71వ రోజు పాదయాత్ర ఘనంగా జరిగింది. లోకేష్ కు పత్తికొండ ప్రజలు నీరాజనాలు పలికారు. భోజన విరామం అనంతరం రాంపల్లి బహిరంగ సభలో నారా లోకేష్ మాట్లాడుతూ 2019 ఎన్నికల ముందు ప్రజలకు తనపై సానుభూతి రావాలనే డ్రామా మోహన్ కోడికత్తి డ్రామాను రక్తికట్టించాడు. ఎన్.ఐ.ఏ కోడికత్తి దాడి ఓ డ్రామా అని తేల్చేసింది. అదేవిధంగా ఎన్నికలు సమీపించే సమయంలో సొంత బాబాయ్ వివేకానందరెడ్డిని గొడ్డలితో అత్యంత దారుణంగా హత్యకు గురైన కేసులో సీబీఐ వేళ్లు జగన్మోహన్ రెడ్డి వైపు చూపిస్తున్నాయి. కానీ వివేకా హత్యపై కూడా డ్రామా మోహన్ 6రకాల డ్రామాలు ఆడాడు. మొదటగా గుండె పోటు, ఆ తర్వాత, నారాసుర రక్తచరిత్ర, కూతురు, అల్లుడే చంపారు, ఆస్తి తగాదాలు, రెండో పెళ్లి, చివరగా సునీల్ యాదవ్ తల్లిని వేధించడం వల్లే అని ప్రజల్ని మోసం చేస్తున్నాడు.

చివరకు వివేకాది జగనాసుర రక్తచరిత్రేనని తేలిపోయింది. పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఓ మహానటి. తన కుటుంబ సభ్యులు నియోజకవర్గాన్ని మాఫియాలా దోచుకుతింటున్నారు. దళితుల భూములను లాక్కుని, బాధితులపై హత్యాయత్నం కేసులు పెట్టించి వేధిస్తోంది. శ్రీదేవి దోపిడీకి హద్దులు లేకుండా పోతున్నాయి.అని లోకేష్ ఆరోపించారు. పత్తికొండ అభివృద్ధి చెందాలంటే మరోసారి పత్తికొండలో పసుపుజెండా ఎగరాల్సిందేనన్నారు. అశోకుడు పరిపాలించిన ప్రాంతం పత్తికొండ. వజ్రాల్లాంటి ప్రజలు పత్తికొండలో ఉన్నారు. నవ్యంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన కేఈ. కృష్ణమూర్తి ఇక్కడ నుండే ఎమ్మెల్యే గా గెలిచారు. పెరవళి రంగనాథ స్వామి ఆలయం, పత్తికొండ సాయిబాబా ఆలయం ఉన్న పుణ్య భూమి ఇది. ఎంతో ఘన చరిత్ర ఉన్న పత్తికొండ లో పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం అని లోకేష్ పేర్కొన్నారు.

యువగళం.. మనగళం.. ప్రజాబలం. యువగళం పాదయాత్రతో తాడేపల్లి ప్యాలస్ షేక్ అయ్యింది. సింహం సింగిల్ వస్తుంది అన్న వాడు నన్ను అడ్డుకోవడానికి వెయ్యి మంది పోలీసుల్ని పంపాడు అని లోకేష్ విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చావు దెబ్బ తగిలే సరికి జగన్ కి భయం పట్టుకుంది. బిడ్డ ఎంత భయపడ్డాడో తెలుసా? ఫేక్ వీడియోలు రిలీజ్ చేసుకునే దుస్థితికి దిగజారి పోయాడన్నారు. దళితులకు జగన్ పీకింది, పొడిసింది ఏమి లేదు అని నేను అంటే, దళితుల్ని నేను అవమానించానని ఒక ఫేక్ వీడియో వదిలారు. ఆ వీడియో చూపించి నన్ను అడ్డుకోవడానికి వస్తున్నారు. బ్రదర్ భయం నా బయోడేటా లేదు. నేను ఏమి జగన్ లా పరదాలు కట్టుకొని పర్యటించడం లేదు కదా. భారతి రెడ్డికి ఛాలెంజ్ చేశాను సౌండ్ లేదు. తాడేపల్లి ప్యాలస్ ఫేక్ గ్యాంగ్ మొత్తం అడ్డంగా బుక్కయింది. అమ్మా భారతి రెడ్డి దళితులకు ఎప్పుడు క్షమాపణ చెబుతున్నారు? అని ప్రశ్నించారు.

ఆర్.ఆర్.ఆర్ లో జగన్ నటిస్తే ఆస్కార్ వచ్చేది

జగన్ ఒక గొప్ప డ్రామా ఆర్టిస్ట్. ఆర్ఆర్ఆర్ లో నటిస్తే ఆస్కార్ వచ్చేది. అందుకే జగన్ కి డ్రామా మోహన్ అని పేరు పెట్టా అని లోకేష్ చెప్పారు. బాబాయ్ హత్య గురించి పెద్ద డ్రామా వేసాడు. ముందు గుండెపోటు అని ప్రకటించాడు. తరువాత నారాసుర రక్త చరిత్ర అన్నాడు, తరువాత అల్లుడూ, కూతురు కలిసి చంపేశారు అన్నాడు. ఆస్తి తగాదాలు అని ఒకసారి అన్నాడు, రెండో పెళ్లి వలనే మర్డర్ జరిగింది అని ఒకసారి కట్టుకథ అల్లాడు. సునీల్ యాదవ్ తల్లిపై కన్నేసాడు కాబట్టే మర్డర్ చేసారు అంటూ ఇంకో కధ అల్లారు. కానీ ఫైనల్ గా తేలింది ఏంటి? అరెస్ట్ అయిన ఉదయ్ కుమార్ ఎవరు అవినాష్ రెడ్డి అనుచరుడు అని వివరించారు. ఇప్పుడు చెప్పండి హూ కిల్డ్ బాబాయ్? అబ్బాయ్ కిల్డ్ బాబాయ్. అది జగనాసుర రక్త చరిత్ర.

కోడికత్తి అంటూ మరో డ్రామా వేసాడు. ఆఖరికి ఎన్ఐఏ ఏమి చెప్పింది? కోడికత్తి జగన్ డ్రామా తప్ప నిజం లేదని తేల్చేసింది. కోడి కత్తి లో కుట్ర లేదు మొత్తం జగన్ అల్లిన కధే అని ఎన్ఐఏ తేల్చేసింది. ఢిల్లీ వెళ్లి 35 మంది కమ్మ డిఎస్పీలకు ప్రమోషన్లు ఇచ్చారు అంటూ డ్రామా చేసాడు. అసెంబ్లీ సాక్షిగా అదంతా జగన్ ఆడిన డ్రామా అని తేలిపోయింది అని వివరించారు. హోంమంత్రి మేకతోటి సుచరిత అసెంబ్లీ సాక్షిగా ప్రమోషన్లు ఇచ్చిన వారిలో కేవలం 5మందే కమ్మ వారని మిగిలిన వారంతా అన్ని కులాల వారు ఉన్నారని ఆధారాలు విడుదల చేసి జగన్ పెద్ద డ్రామా ఆర్టిస్ట్ అని తేల్చేసారు. డ్రామా మోహన్ నీకు సిగ్గు లేదా? ఇంకా ఎంత కాలం ప్రజల్ని మోసం చేస్తావ్? అని ప్రశ్నించారు.

డ్రామా మోహన్ ఒక ఫిట్టింగ్ మాస్టర్. ఆయన ఎలా ఫిట్టింగ్ పెడతాడో మీకు చెబుతాను. డ్రామా మోహన్ కి రెండు బటన్స్ ఉంటాయి. ఒకటి బ్లూ బటన్. రెండోవది రెడ్ బటన్. బ్లూ బటన్ నొక్కగానే మీ అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. రెడ్ బటన్ నొక్కగానే మీ అకౌంట్ నుండి 100 రూపాయలు పోతుంది. అది ఎలాగో మీకు చెబుతా. విద్యుత్ ఛార్జీలు 8సార్లు బాదుడే బాదుడు, ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు బాదుడే బాదుడు, ఇంటి పన్ను బాదుడే బాదుడు, చెత్త పన్ను బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్ ధరలు బాదుడే బాదుడు, నిత్యావసర సరుకుల ధరలు బాదుడే బాదుడు. మీకు ఇంకో ప్రమాదం కూడా ఉంది త్వరలోనే వాలంటీర్ వాసు మీ ఇంటికి వస్తాడు. మీరు పీల్చే గాలిపై కూడా పన్నేస్తాడు. డ్రామా మోహన్ కట్టింగ్ మాస్టర్. ఎం కట్ చేసాడో చెబుతాను. అన్న క్యాంటిన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, విదేశీ విద్య కట్, చంద్రన్న భీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్, ఫీజు రీయింబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్లు కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్. దేశ చరిత్ర లో 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం ఈ డ్రామా మోహన్ అని వివరించారు.

డ్రామా మోహన్ యువతను మోసం చేశాడు

జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్ పధకం రద్దు చేసాడు. ఖైదీలకు 2 వేల రూపాయల మెస్ ఛార్జీలు ఇస్తుంటే, విద్యార్థులకు మాత్రం వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తున్నాడు అని లోకేష్ ఆరోపించారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం. జగన్ విశాఖ, అనంతపురం, గుంటూరు లో మూసేసిన స్టడీ సర్కిల్స్ తిరిగి ప్రారంభించడంతో పాటు అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. డ్రామా మోహన్ మహిళల తాళిబొట్లు తెంచుతున్నాడు. మద్యపాన నిషేధం తరువాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు మద్యాన్ని ఏరులై పారిస్తున్నాడు. మహిళల తాళిబొట్లు తాకట్టు పెట్టి 25వేల కోట్లు అప్పు తెచ్చాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సి, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తా అని మోసం చేసాడు అని చెప్పారు. టిడిపి అధికారంలోకి వచ్చాకా పన్నుల భారం తగ్గిస్తాం. నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు.

రైతుల మెడకు ఉరితాళ్లు బిగిస్తున్న డ్రామా మోహన్

డ్రామా మోహన్ పరిపాలనలో పురుగుల మందులు పనిచేయవు. జగన్ బ్రాండ్లు ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్, ఆంధ్రా గోల్డ్ కొడితే మాత్రం పురుగులు చస్తాయి. రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మీటర్లు పెడుతున్నాడు. రాయలసీమ లో 1000 అడుగుల వరకూ బోర్లు వేస్తే కానీ నీళ్లు రావు,మరి కరెంట్ బిల్లు ఎంత వస్తుందో ఆలోచించండి. మీటర్లు రాయలసీమ రైతులకు ఉరితాళ్లు అని లోకేష్ హెచ్చరించారు.

డ్రామా మోహన్ ఉద్యోగస్తులను కూడా వేధించాడు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని 200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు. మీకు తెలియకుండా మీ వస్తువు దొంగిలిస్తే దొంగ అంటాం. ఏకంగా పోలీసుల డబ్బులే కొట్టేసాడు డ్రామా మోహన్. పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడుఅని ఆరోపించారు. బీసీలకు బ్యాక్ బోన్ విరిచాడు డ్రామా మోహన్. పేరుకే బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసారు. నిధులు కేటాయించలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్ కట్ చేసి 16,500 మందిని పదవులకు దూరం చేశాడు.

బీసీలను అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల అక్రమ కేసులు బీసీల పై పెట్టాడు. బీసీలకు శాశ్వత కుల ధృవ పత్రాలు అందిస్తాం. బీసీలమని ఆరు నెలలకోసారి కుల ధృవపత్రాలు తీసుకోవాల్సిన దుస్థితి లేకుండా చేస్తాం. మొబైల్ లో ఒక్క బటన్ నొక్కగానే ఇంటికి బిసి కుల ధృవ పత్రాలు వచ్చే ఎర్పాటు చేస్తాం. అవి శాశ్వత కుల ధృవ పత్రాలు గా ఉపయోగపడేలా చట్టం లోమార్పులు తీసుకొస్తాం. దామాషా ప్రకారం బీసీ ఉపకులాలకు నిధులు, రుణాలు ఇస్తాం అని హామీ ఇచ్చారు.

దళిత ద్రోహి ఈ డ్రామా మోహన్

దళితులపై వైసిపి పాలనలో దమనకాండ కొనసాగుతూనే ఉందని లోకేష్ పేర్కొన్నారు. డాక్టర్ సుధాకర్ దగ్గర మొదలైంది. ఇప్పుడు డాక్టర్ అచ్చెన్న వరకూ వచ్చింది. ఇసుక అక్రమాలను ప్రశ్నించినందుకు వరప్రసాద్ కి గుండు కొట్టించారు, మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ ని కొట్టి చంపారు, జగన్ లిక్కర్ స్కామ్ పై పోరాడినందుకు ఓం ప్రతాప్ కి చంపేసారు. పెద్దిరెడ్డి అవినీతి పై పోరాడినందుకు జడ్జ్ రామకృష్ణ ని హింసించారు. ఒక్క కేసులో అయినా దళితుల పై దాడి చేసిన వారికీ శిక్ష పడిందా? సుబ్రహ్మణ్యం అనే దళిత యువకుడిని చంపేసిన ఎమ్మెల్సీ అనంతబాబు కి సన్మానం చేసి ఉరేగించారు. వైసిపి పాలనలో దళితులను చంపడానికి జగన్ స్పెషల్ లైసెన్స్ ఇచ్చారు అని ఆరోపించారు. మైనార్టీ సోదరులకు పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు. మైనారిటీలను వైసిపి ప్రభుత్వం దారుణంగా మోసం చేసింది.

దుల్హన్, రంజాన్ తోఫా వంటి పథకాలు రద్దు చేశాడు. మసీదు, ఈద్గా, ఖబర్ స్తాన్ ల అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కేటాయించలేదు. ఆత్మహత్య చేసుకోవడం మైనార్టీలు మహా పాపంగా భావిస్తారు. జగన్ రెడ్డి సీఎం అయ్యాక నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. కేవలం వైసీపీ నాయకుల వేధింపుల వల్లే వాళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఇబ్రహీం అనే ముస్లిం నేతను నరసరావుపేటలో దారుణంగా నరికి చంపేశారు. పలమనేరులో మిస్బా అనే పదో తరగతి చెల్లిని వైసీపీ నాయకుడు సునీల్ టీసీ ఇప్పించి, బలవంతంగా వేధించడంతో, చదువుకు దూరం చేయడంతో ఆత్మహత్య చేసుకుంది. కర్నూలు లో హాజీరాని అత్యాచారం చేసి చంపేశారు. ఆమె తల్లికి కనీసం పోస్టుమార్టం రిపోర్ట్ ఇవ్వకుండా ప్రభుత్వం వేధించింది. టీడీపీ హయాంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసాం. హజ్ యాత్రకు సహాయం చేసాం. ఆనాడు బీజేపీ తో పొత్తు ఉన్నా మైనార్టీల పై ఒక్క దాడి జరగలేదు, ఒక్క సంక్షేమ కార్యక్రమం ఆపలేదుఅని వివరించారు.

జగన్ పాలనలో రెడ్లకు గౌరవం లేదు

పత్తికొండలో ఉన్న రెడ్డి సోదరులు కూడా ఒక్క సారి ఆలోచించండి. మీరు జగన్ ని గెలిపించడం కోసం ఆస్తులు అమ్ముకున్నారు. ఇప్పుడు మీకు కనీస గౌరవం ఉందా? కేవలం పెద్దిరెడ్డి, సజ్జల రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి తప్ప మిగిలిన రెడ్లు ఎవరైనా బాగుపడ్డారా? అని ప్రశ్నించారు. డ్రామా మోహన్ నేను రాయలసీమ బిడ్డ అంటాడు కానీ ఆయన రాయలసీమ కు పట్టిన క్యాన్సర్ గడ్డ. అప్పర్ తుంగభద్ర కోసం కేంద్రం 5300 కోట్లు కేటాయించింది. ఆ ప్రాజెక్టు పూర్తి అయితే రాయలసీమ ఎడారిగా మారిపోతుంది. టిడిపి ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసింది 11 వేల కోట్లు. జగన్ 4 ఏళ్లలో ఖర్చు చేసింది 2,700 కోట్లు మాత్రమే. రాయలసీమ రైతులకు టిడిపి హయాంలో ఇచ్చిన డ్రిప్ ఇరిగేషన్ రద్దు చేసాడు జగన్ రెడ్డి. ఎస్సి,ఎస్టీలకు 100 శాతం సబ్సిడీ, మిగిలిన వారికి 90 శాతం సబ్సిడీ తో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం. అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు మరమత్తు కూడా మర్చిపోయాడు. ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయి 61 మంది చనిపోయారు. రిలయన్స్, అమరరాజా, జాకీ వెళ్లిపోవడం వలన రాయలసీమ యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయారుఅని ఆవేదన వ్యక్తం చేశారు.

పత్తికొండలో శ్రీదేవి దోపిడీ ఫుల్. అభివృద్ధి నిల్.

పత్తికొండ ఎమ్మెల్యే పేరు శ్రీదేవి. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారు అని మీరు భారీ మెజారిటీ తో గెలిపించారు. కానీ జరిగింది ఏంటి? నియోజకవర్గాన్ని, ప్రజల్ని గాలికి వదిలేసి ఫ్యామిలీ మాఫియాని రంగంలోకి దింపారు. ఆమె నేను నియోజకవర్గం లోకి రాకముందే నా అవినీతి గురించి మాట్లాడొద్దు అని ప్రెస్ మీట్ పెట్టారు. నేను మాట్లాడనంత మాత్రాన మీరు చేసిన అవినీతి మాయం అవుతుందా శ్రీదేవి గారు? అని లోకేష్ ప్రశ్నించారు. ప్రతి రోజూ సాయంత్రం ఫ్యామిలీ మాఫియా మొత్తం కూర్చొని వాటాలు వేసుకుంటారు. పత్తికొండ ని కేకు ముక్కల్లా కోసి ఫ్యామిలీ మాఫియాకు పంచేసారు శ్రీదేవి. శ్రీదేవి కొడుకు రామ్మోహన్ రెడ్డి, బంధువులు ప్రదీప్ రెడ్డి, జగన్నాధ రెడ్డిలకు ఒక్కో మండలాన్ని పంచేశారు. ఇసుక, మట్టి, అక్రమ మద్యం రవాణా, భూకబ్జాలకు పాల్పడుతూ ఫ్యామిలీ మాఫియా పత్తికొండను దోచుకుంటుంది అని ఆరోపించారు. ఈరోజు చెర్లకొత్తూరు కు చెందిన దళిత రైతులు నన్ను కలిశారు. వారు 1986 లో కొన్న 25 ఎకరాల భూమిని ఎమ్మెల్యే అనుచరులు, కుటుంబ సభ్యులు కొట్టేశారు. దానికి సంభందించిన ఆధారాలు కూడా నా వద్ద ఉన్నాయన్నారు.

వెల్దుర్తి, కృష్ణగిరి మండలాల నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. మద్దికెర రైల్వేస్టేషన్ లో కప్పం కట్టలేదు అని రైల్వే కాంట్రాక్టర్ పై దాడి చేసి వాహనాలు ఎత్తుకెళ్లారు ఫామిలీ మాఫియా సభ్యులు. బంగారు గనుల యజమానులను బెదిరించి పనులు జరగకుండా ఆపేశారు. అంగన్వాడీ టీచర్ల నియామకాలకు ఒక్కొక్కరి నుంచి 3 లక్షల వరకు, సబ్ స్టేషన్లలో ఆపరేటర్ల నియామకం కోసం ఒక్కో అభ్యర్థి నుంచి 12 లక్షలు తీసుకున్నారు. టమాటో మార్కెట్ ని కూడా వదలలేదు ఈ ఫ్యామిలీ మాఫియా. వ్యాపారస్తులను బెదిరించి కమిషన్లు వసూలు చేస్తున్నారు. ఆఖరికి రేషన్ బియ్యాన్ని కూడా అక్రమ రవాణా చేస్తుంది ఈ ఫ్యామిలీ మాఫియా. పార్వతికొండ,బుజుగుండ్ల కొండ నుండి ఎర్రమట్టి తరలించి సొమ్ము చేసుకున్నారు. ఇక్కడ నుండి ఇసుకను బెంగుళూరు కి తరలిస్తారు. ఆ బల్లు తిరిగివచ్చేప్పుడు కర్ణాటక మద్యం ఇక్కడికి తెచ్చి అమ్మేస్తారు. పత్తికొండ చెరువుని కూడా కబ్జా చేస్తున్నారు ఈ ఫ్యామిలీ మాఫియా. జగన్ పాదయాత్ర లో పత్తికొండ కి వచ్చినప్పుడు నియోజకవర్గంలోని చెరువులు నింపి నియోజకవర్గానికి నీటి సమస్య లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. శ్రీ దేవి గారు ఆ హామీ ఎం అయ్యింది? టమోటా జ్యూస్ ఫాక్టరీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తాం అన్నారు. శ్రీ దేవి గారు ఆ హామీ ఎం అయ్యింది? అని ప్రశ్నించారు.

టిడిపి హయాంలోనే పత్తికొండ అభివృద్ధి

సాగు, తాగునీటి ప్రాజెక్టులు నిర్మించాం. సిసి రోడ్లు, పంచాయతీ భవనాలు, పేదలకు టిడ్కొ ఇల్లు, పాఠశాల భవనాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది టిడిపి. టిడిపి హయాంలో 1600 కోట్లు ఖర్చు చేసి పత్తికొండ ని అభివృద్ది చేసింది టిడిపి. పత్తికొండ లో టమాటో రైతులు ఎదుర్కుంటున్న సమస్యలు నాకు తెలుసు. టిడిపి హయాంలో టమాటో వాల్యూ చైన్ కార్యక్రమం రూపొందించాం. వైసిపి ప్రభుత్వం ఆ ప్రాజెక్టు ఆపేసింది. విత్తనం నుండి గిట్టుబాటు ధర కల్పించడం వరకూ టమాటో రైతుల్ని ఆదుకుంటాం. కోల్డ్ స్టోరేజ్లు, కెచప్ ఫ్యాక్టరీలు, ప్రాసెసింగ్యూనిట్లు తీసుకొస్తాం.

స్థానికంగా ఉద్యోగాలు దొరక్క బెంగుళూరు, హైదరాబాద్ వలస వెళ్తున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పిస్తాం అని హామీ ఇచ్చారు. పత్తికొండ, డోన్ నియోజకవర్గాల్లో కరువు పల్లెలకు తాగు, సాగునీరు అందించాలని టీడీపీ ప్రభుత్వంలో నాటి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిలు 68 చెరువులకు హంద్రీనీవా కాలువ నుంచి కృష్ణా జలాలు ఇవ్వాలని రూ.253 కోట్లతో 68 చెరువులు లిఫ్ట్ స్కీమ్ కు శ్రీకారం చుట్టారు. 65 శాతం పనులు పూర్తి చేశారు. మరో ఆరు నెలలు ఉంటే వంద శాతం పనులు పూర్తి చేసి కరువు గ్రామాలకు చంద్రబాబే కృష్ణా జలాలు ఇచ్చేవారు. ఇంతలో ఎన్నికలు వచ్చి.. జగన్ సీఎం అయ్యారు. నాలుగేళ్లు అయినా 35 శాతం పనులు పూర్తి చేయలేదన్నారు.

హంద్రీనీవా ప్రాజెక్టు పందికోన (పత్తికొండ) రిజర్వాయర్ కుడి, ఎడమ కాలువల కింద పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల్లో 80 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి. ప్రస్తుతం 15-20 వేల ఎకరాలకు కూడా ఇవ్వడం లేదు. పెండింగ్ పనులు పూర్తి చేస్తే 80 వేల ఎకరాలకు సాగునీరు, పలు గ్రామాలకు తాగునీరు ఇవ్వవచ్చు. పత్తికొండ పట్టణం సహా 85 శాతం గ్రామాల్లో తీవ్ర తాగునీటి సమస్య ఉంది. చంద్రబాబు ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పందికోన రిజర్వాయరు నుంచి పైపులైను వేసి పత్తికొండ టౌన్ నీటి కొంతవరకు తీర్చారు. టౌన్ పెరుగుతుండడంతో సమస్య తీవ్రం అవుతుంది.

వర్షాకాలంలో ఖరీఫ్ పంటలు అయిపోగానే ఊళ్లకు ఊళ్లు బెంగళూరు, హైదరాబాదు, గుంటూరు ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారు. వలసల నివారణకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసి స్థానికంగా ఉపాధి దొరికేలా చర్యలు తీసుకుంటాం. పెండింగ్ లో ఉన్న సాగు, తాగు నీటి ప్రాజెక్టులు పూర్తిచేసి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం. పత్తికొండ ఫ్యామిలీ మాఫియా టిడిపి కార్యకర్తల్ని, నాయకుల్ని వేధించింది. కొంత మంది అధికారులు లైన్ దాటి అక్రమ కేసులు బనాయించారు. టిడిపి అధిరంలోకి వచ్చిన వెంటనే వడ్డీతో సహా వెన్నకి ఇచ్చే బాధ్యత నాది. జ్యుడీషియల్ ఎంక్వయిరీ వేసి అక్రమ కేసులు పెట్టిన అధికారుల పై చర్యలు తీసుకుంటాం. టిడిపి అధికారంలోకి వచ్చిన మూడు ఏళ్లలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందించే బాధ్యత నాదిఅని లోకేష్ హామీ ఇచ్చారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *