అబ్బాయిలిద్దరికీ చంచల్ గూడా జైలు ఖాయం : నారా లోకేష్ వెల్లడి

అబ్బాయిలిద్దరికీ చంచల్ గూడా జైలు ఖాయం : నారా లోకేష్ వెల్లడి

సిబిఐ దెబ్బ కు ప్యాలెస్ లో కూర్చుని వెంట్రుకలు పీక్కుంటున్నాడు
నాడు బాబాయిని చంపి, నేడు క్యారెక్టర్ ను చంపేస్తున్నారు!
కథలెన్ని చెప్పినా గూగుల్ టేకవుట్ కు చిక్కిన జగన్ డ్రామా ట్రూప్
ఒక్క ఛాన్స్ తో రాష్ట్రాన్ని అడ్డంగా దోచేస్తున్న లూటీ మోహన్
ఆలూరు లో గుమ్మనూరు సోదరుల కబ్జాలు, సెటిల్మెంట్లు
వలగొండ బహిరంగసభలో యువనేత నారా లోకేష్
……
ఒక బాబాయ్ ని చంపిన కేసులో ఇంకో బాబాయ్ జైలుకి వెళ్లడం. అది కూడా జగన్ జైలు చంచల్ గూడాకి వెళ్లడం ఖచ్చితంగా దేవుడి స్క్రిప్టే నని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆలూరు నియోజకవర్గం వలగొండ క్రాస్ వద్ద యువగళం పాదయాత్రలో భాగంగా ఏర్పాటుచేసిన బహిరంగసభలో యువనేత లోకేష్ మాట్లాడుతూ వివేకా హత్య కేసులో జగన్ డ్రామా ట్రూప్ చిన్న లాజిక్ మిస్సైయింది. వివేకా గారిని ఒప్పిస్తే అవినాష్ ఎంపీ అవుతాడు. వివేకాని చంపేస్తే నేరస్తులు అవుతారు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావ్ జగన్. ఆరు రకాల కధలు చెప్పినా గూగుల్ టేక్ అవుట్ లో దొంగలు మొత్తం దొరికిపోయారు. చంచల్ గూడా జైలుకి జగన్ కి చాలా అనుబంధం ఉంది. త్వరలో అబ్బాయిలు కూడా చంచల్ గూడాకి పోవడం ఖాయం. జగన్ డ్రామా ట్రూప్ కి వచ్చే ఐడియాలు డెకాయిట్లకు కూడా రావు. ముందు బాబాయ్ ని చంపేసారు. ఇప్పుడు ఆయన క్యారక్టర్ ని చంపేస్తున్నారు. జగన్ డ్రామా ట్రూప్ ఎంత డేంజరో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. అందుకే ఇది జగనాసుర రక్త చరిత్ర. నా వెంట్రుక కూడా పీకలేరు అన్నాడు ఇప్పుడు సీబీఐ కొట్టిన దెబ్బకి పర్యటనలు రద్దు చేసుకొని తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని వెంట్రుకలు పీక్కుంటున్నాడు అని లోకేష్ ఎద్దేవా చేశారు.

ఆలూరులో సైకో పనైపోయింది

ఆలూరులో ప్రజల ఉత్సాహం చూసిన తరువాత సైకో పనైపోయిందని ఫిక్స్ అయిపోయా అని లోకేష్ చెప్పారు. ఆలూరు పేరు మాత్రమే సాఫ్ట్ కానీ ఇక్కడ ప్రజలు చాలా స్ట్రాంగ్. బ్రిటిషు పాలకులనే గడగలాడించిన చరిత్ర ఆలూరు ప్రజలది. మీకు సైకో ఒక లెక్కా? చిప్పగిరి ప్రాంతంలో శ్రీ కృష్ణ దేవరాయలు చెన్నకేశవ స్వామి ఆలయం నిర్మించారు. తెర్నెకల్ లో బ్రిటీష్ వారిపై తిరుగుబాటు చేసిన యోధుడు ముత్తుకూరు గౌడప్ప ఇక్కడే జన్మించారు. ఎల్లార్తి దర్గా, దేవరగట్టు మాలమల్లేశ్వర స్వామి ఆలయం ఉన్న పుణ్య భూమి ఆలూరు. ఎంతో ఘన చరిత్ర ఉన్న ఈ ఆలూరు గడ్డ పై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం. నేను ఏం మాట్లాడినా దాన్ని వైసీపీ పేటీఎం బ్యాచ్ వక్రీకరించి ట్రోల్ చేస్తున్నారు. మా కార్యకర్తల పై దాడులు చేసిన వాళ్లకు, అక్రమ కేసులు పెట్టిన వాళ్లకు అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం. నాపై 20 కేసులు ఉన్నాయి. అయినా తగ్గే ప్రసక్తే లేదు. భయం మన బయోడేటాలో లేదు. వచ్చే ఎన్నికల యుద్ధానికి ఆలూరు ప్రజలు సిద్ధమా? ఆలూరులో పసుపుజెండా ఎగిరి 25ఏళ్లు అయ్యింది. వచ్చే ఎన్నికల్లో ఆలూరులో పసుపుజెండాను భారీ మెజార్టీతో ఎగరేయండి. మీ అవసరాలన్నీ నేను తీరుస్తా అని హామీ ఇచ్చారు.

నాడు నియంత…నేడు కమెడియన్

యువగళం. మనగళం. ప్రజాబలం. యువగళం పాదయత్రకి ముందు జగన్ కి పాదయాత్ర ప్రారంభం అయిన తరువాత జగన్ కి తేడా ఏంటో తెలుసా? యువగళం పాదయత్రకి ముందు జగన్ ఒక నియంత. నన్ను అడ్డుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసాడు నియంత. ఇంతకంటే పెద్ద నియంతలను ఫుట్ బాల్ ఆడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మనం తగ్గుతామా? లారీల్లో వస్తారో, రౌడీలతో వస్తారో రండి తేల్చుకుందాం అని సవాల్ చేస్తే తోకముడిచి పారిపోయారు. పాదయాత్ర ప్రారంభం అయిన తరువాత అన్ని వర్గాల ప్రజలు నియంతని నిలదీయడం మొదలు పెట్టారు. యువత ఎమ్మెల్సీ ఎన్నికల్లో నియంత కొమ్ములు వంచారు. పాదయాత్ర ప్రారంభం అయిన 74 రోజులకే జగన్ కమిడియన్ గా మారిపోయాడు. ఆఖరికి కుక్కలు, కోతులు కూడా ఆయన స్టిక్కర్ చూసి అసహ్యించుకుంటున్నాయి అని లోకేష్ విమర్శించారు. జగన్ నన్ను ఏమి పీకలేక ఏకంగా భారతీ రెడ్డిని రంగంలోకి దింపారు. ఆవిడ ఒక ఫేక్ వీడియో తయారు చేసి లోకేష్ దళితుల్ని అవమానించాడు అని సాక్షి మీడియాలో హడావిడి చేసారు. జగన్ దళితులకు పీకింది, పొడిసింది ఏంటి అని అన్న వీడియోని ఫేక్ ఎడిట్ చేసారు. నేను భారతీ రెడ్డికి సవాల్ విసిరాను. ఇప్పటి వరకూ సమాధానం రాలేదు. దళితుల్ని అవమానపర్చిన భారతి రెడ్డి క్షమాపణ చెప్పి తీరాల్సిందే. జగన్ డ్రామా ట్రూప్ మొత్తం అడ్డంగా బుక్కైపోయింది.

ఒక్క ఛాన్స్ తో దోచేస్తున్న లూటీ మోహన్

జనం జగన్ కి ఒక్క ఛాన్స్ ఇస్తే జగన్ జనాన్ని లూటీ చేసాడు. అందుకే ఆయన పేరు మార్చాను. జగన్ మోహన్ కాదు లూటీ మోహన్ అని లోకేష్ పేర్కొన్నారు. వెయ్యి రూపాయిలు ఖర్చు దాటిన ఏ జబ్బుకైనా ఆరోగ్యశ్రీ అన్నాడు. ఇప్పడు ఆరోగ్య శ్రీ ని అనారోగ్యశ్రీ గా మార్చేసాడు. బిల్లులు బకాయి పెట్టడంతో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తాం అని ప్రైవేట్ హాస్పిటల్స్ అంటున్నాయి. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసం దూది, మందులు లేని పరిస్థితి. లూటీ మోహన్ పెద్ద ఫిట్టింగ్ అండ్ కట్టింగ్ మాస్టర్. ఆయన ఫిట్టింగ్ ఎలా ఉంటుందో చెబుతాను. లూటీ మోహన్ కి రెండు బటన్స్ ఉంటాయి. ఒకటి బ్లూ బటన్. రెండోవది రెడ్ బటన్. బ్లూ బటన్ నొక్కగానే మీ అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. రెడ్ బటన్ నొక్కగానే మీ అకౌంట్ నుండి 100 రూపాయలు పోతుంది. అది ఎలాగో మీకు చెబుతా. విద్యుత్ ఛార్జీలు 8 సార్లు బాదుడే బాదుడు, ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు బాదుడే బాదుడు, ఇంటి పన్ను బాదుడే బాదుడు, చెత్త పన్ను బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్ ధరలు బాదుడే బాదుడు, నిత్యావసర సరుకుల ధరలు బాదుడే బాదుడు. మీకు ఇంకో ప్రమాదం కూడా ఉంది త్వరలోనే వాలంటీర్ వాసు మీ ఇంటికి వస్తాడు. మీరు పీల్చే గాలిపై కూడా పన్నేస్తాడు. లూటీ మోహన్ కట్టింగ్ మాస్టర్. అది ఎలాగో చెబుతాను. అన్న క్యాంటిన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న భీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్, ఫీజు రీయింబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్లు కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్. 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం ఈ లూటీ మోహన్ అని లోకేష్ వివరించారు.

యువత, మహిళలను చీట్ చేశాడు

లూటీ మోహన్ యువతని చీట్ చేసాడు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్ పధకం రద్దు చేసాడుఅని లోకేష్ ఆరోపించారు. ఖైదీలకు 2 వేల రూపాయల మెస్ ఛార్జీలు ఇస్తుంటే, విద్యార్థులకు మాత్రం వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తున్నాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం. జగన్ విశాఖ, అనంతపురం, గుంటూరు లో మూసేసిన స్టడీ సర్కిల్స్ తిరిగి ప్రారంభించడంతో పాటు అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం. లూటీ మోహన్ మహిళల తాళిబొట్లు తాకట్టు పెడుతున్నాడు. మద్యపాన నిషేధం తరువాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు మద్యాన్ని ఏరులై పారిస్తున్నాడు. మహిళల తాళిబొట్లు తాకట్టు పెట్టి 25వేల కోట్లు అప్పు తెచ్చాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సి, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తా అని మోసం చేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చాకా పన్నుల భారం తగ్గిస్తాం. నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తాం అని లోకేష్ హామీ ఇచ్చారు.

రైతులను కోలుకోలేని దెబ్బతీశాడు

లూటీ మోహన్ రైతుల్ని కోలుకోలేని దెబ్బతీసాడు అని ధ్వజమెత్తారు. లూటీ మోహన్ పరిపాలనలో పురుగుల మందులు పనిచేయవు. జగన్ బ్రాండ్లు ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్, ఆంధ్రా గోల్డ్ కొడితే మాత్రం పురుగులు చస్తాయి. రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మీటర్లు పెడుతున్నాడు. రాయలసీమ లో 1000 అడుగుల వరకూ బోర్లు వేస్తే కానీ నీళ్లు రావు…,మరి కరెంట్ బిల్లు ఎంత వస్తుందో ఆలోచించండి. మోటార్లకు మీటర్లు రాయలసీమ రైతులకు ఉరితాళ్లు. లూటీ మోహన్ ఉద్యోగస్తులను కూడా వేధించాడు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని 200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. పెన్షనర్ల కు సమయానికి పెన్షన్ కూడా ఇవ్వడం లేదు. పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు. మీకు తెలియకుండా మీ వస్తువు దొంగిలిస్తే దొంగ అంటాం. ఏకంగా పోలీసుల డబ్బులే కొట్టేసాడు లూటీ మోహన్. పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడు అని ఆరోపించారు.

బిసిల శాశ్వత కులధృవీకరణ పత్రాలిస్తాం

బీసీలకు బ్యాక్ బోన్ విరిచాడు లూటీ మోహన్. పేరుకే బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసారు. నిధులు కేటాయించలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్ కట్ చేసి 16,500 మందిని పదవులకు దూరం చేసాడు. బీసీలను అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల అక్రమ కేసులు బీసీల పై పెట్టాడు అని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు శాశ్వత కుల ధృవ పత్రాలు అందిస్తాం. బీసీలమని ఆరు నెలలకోసారి కుల ధృవపత్రాలు తీసుకోవాల్సిన దుస్థితి లేకుండా చేస్తాం. మొబైల్ లో ఒక్క బటన్ నొక్కగానే ఇంటికి బిసి కుల ధృవ పత్రాలు వచ్చే ఎర్పాటు చేస్తాం.అవి శాశ్వత కుల ధృవ పత్రాలు గా ఉపయోగపడేలా చట్టం లో మార్పులు తీసుకొస్తాం. దామాషా ప్రకారం బీసీ ఉపకులాలకు నిధులు, రుణాలు ఇస్తాం అని వెల్లడించారు.

వైసిపి పాలనలో దళితులపై దమనకాండ

దళితులపై వైసిపి పాలనలో దమనకాండ కొనసాగుతూనే ఉందని లోకేష్ చెప్పారు. డాక్టర్ సుధాకర్ దగ్గర మొదలైంది. ఇప్పుడు డాక్టర్ అచ్చెన్న వరకూ వచ్చింది. ఇసుక అక్రమాలను ప్రశ్నించినందుకు వరప్రసాద్ కి గుండు కొట్టించారు, మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ ని కొట్టి చంపారు, జగన్ లిక్కర్ స్కామ్ పై పోరాడినందుకు ఓం ప్రతాప్ కి చంపేసారు. పెద్దిరెడ్డి అవినీతి పై పోరాడినందుకు జడ్జ్ రామకృష్ణ ని హింసించారు. ఒక్క కేసులో అయినా దళితుల పై దాడి చేసిన వారికీ శిక్ష పడిందా? సుబ్రహ్మణ్యం అనే దళిత యువకుడిని చంపేసిన ఎమ్మెల్సీ అనంతబాబు కి సన్మానం చేసి ఉరేగించారు. వైసిపి పాలనలో దళితులను చంపడానికి జగన్ స్పెషల్ లైసెన్స్ ఇచ్చారన్నారు.

మైనారిటీలనూ మోసగించిన జగన్

మైనార్టీ సోదరులకు పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు. మైనారిటీలను వైసిపి ప్రభుత్వం దారుణంగా మోసం చేసింది. దుల్హన్, రంజాన్ తోఫా వంటి పథకాలు రద్దు చేశాడు అని లోకేష్ ఆరోపించారు. మసీదు, ఈద్గా, ఖబర్ స్తాన్ ల అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కేటాయించలేదు. ఆత్మహత్య చేసుకోవడం మైనార్టీలు మహా పాపంగా భావిస్తారు. జగన్ రెడ్డి సీఎం అయ్యాక నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. కేవలం వైసీపీ నాయకుల వేధింపుల వల్లే వాళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఇబ్రహీం అనే ముస్లిం నేతను నరసరావుపేటలో దారుణంగా నరికి చంపేశారు. పలమనేరులో మిస్బా అనే పదో తరగతి చెల్లిని వైసీపీ నాయకుడు సునీల్ టీసీ ఇప్పించి, బలవంతంగా వేధించడంతో, చదువుకు దూరం చేయడంతో ఆత్మహత్య చేసుకుంది. కర్నూలు లో హాజీరాని అత్యాచారం చేసి చంపేశారు. ఆమె తల్లికి కనీసం పోస్టుమార్టం రిపోర్ట్ ఇవ్వకుండా ప్రభుత్వం వేధించింది. టీడీపీ హయాంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసాం. హజ్ యాత్రకు సహాయం చేసాం. ఆనాడు బీజేపీ తో పొత్తు ఉన్నా మైనార్టీల పై ఒక్క దాడి జరగలేదు, ఒక్క సంక్షేమ కార్యక్రమం ఆపలేదు అని లోకేష్ వివరించారు.

రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ

లూటీ మోహన్ నేను రాయలసీమ బిడ్డ అంటాడు కానీ ఆయన రాయలసీమ కు పట్టిన క్యాన్సర్ గడ్డ అని లోకేష్ విమర్శించారు. అప్పర్ తుంగభద్ర కోసం కేంద్రం 5300 కోట్లు కేటాయించింది. ఆ ప్రాజెక్టు పూర్తి అయితే రాయలసీమ ఎడారిగా మారిపోతుంది. టిడిపి ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసింది 11 వేల కోట్లు. జగన్ 4 ఏళ్లలో ఖర్చు చేసింది 2,700 కోట్లు మాత్రమే. రాయలసీమ రైతులకు టిడిపి హయాంలో ఇచ్చిన డ్రిప్ ఇరిగేషన్ రద్దు చేసాడు జగన్ రెడ్డి. ఎస్సి,ఎస్టీలకు 100 శాతం సబ్సిడీ, మిగిలిన వారికి 90 శాతం సబ్సిడీ తో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం. అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు మరమత్తు కూడా మర్చిపోయాడు. ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయి 61 మంది చనిపోయారు. రిలయన్స్, అమరరాజా, జాకీ వెళ్లిపోవడం వలన రాయలసీమ యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు అని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు.

గుమ్మనూరి వల్ల ఒరిగిందేమిటి?

ఆలూరు ఎమ్మెల్యే పేరు గుమ్మనూరు జయరాం. మీరు రెండు సార్లు ఎమ్మెల్యే గా గెలిపించారు. 2019లో 40 వేల మెజారిటీతో గెలిపించారు. ఆయన మంత్రి కూడా అయ్యారు. కానీ ఆలూరు 10 ఏళ్ల క్రితం ఎక్కడ ఉందొ ఇప్పుడు అక్కడే ఉండిపోయింది. అభివృద్ధికి ఆలూరు ఆమడ దూరంలో ఉంది అని లోకేష్ చెప్పారు. గుమ్మనూరు జయరాం వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. గుమ్మనూరు జయరాం , ఆయన తమ్ముడు మరో ఆరు కుటుంబాలు తప్ప ఒక్క వాల్మీకి కుటుంబానికైనా న్యాయం జరిగిందా? ఆయన వందల ఎకరాల అధిపతి అయ్యారు. ఎకరం భూమి కొనే స్థితిలో ఇక్కడ వాల్మీకులు ఉన్నారా? ఆయన బెంజ్ లో తిరుగుతున్నారు. ఇక్కడ ఉన్న వాల్మీకులు కనీసం సైకిల్ కొనుక్కునే పరిస్థితిలో అయినా ఉన్నారా? ఈఎస్ఐ మందుల కొనుగోలు స్కాం లో ఆయన బెంజ్ కారు గిఫ్ట్ గా తీసుకున్నారు. అందుకే ఆయనని అందరూ బెంజ్ మంత్రి అంటున్నారు. ఈ పేరు నేను పెట్టింది కాదు ఆయన అవినీతి ఏ రేంజ్ లో ఉందో చూసిన తరువాత ప్రజలే ఆయన్ని బెంజ్ మంత్రి అని పిలవడం మొదలు పెట్టారు. బెంజ్ కారులో ఆలూరు రోడ్ల మీద తిరిగే దమ్ముందా బెంజ్ మంత్రి గారూ? మీ బెంజ్ ఏమి గాల్లో వెళ్ళదు కదా! ఆలూరులో రెండు రోజులుగా తిరుగుతున్నా అమ్మో రోడ్లు దారుణం. అని విమర్శించారు.

ఆ డబ్బు మేం చెల్లిస్తాం… రిజిస్ట్రేషన్ చేయండి

బెంజ్ మంత్రి భార్య రేణుక, కుటుంబ సభ్యులు, సన్నిహితులు పేర్లపైన ఆస్పరి మండలంలో ఇటినా కంపెనీ నుంచి 180 ఎకరాలు కొనుగోలు చేశారు అని లోకేష్ ఆరోపించారు. ఈ భూములు బినామి పేర్లతో లెక్కల్లో చూపని ఆదాయంతో కొన్నారని, ఇవి అక్రమాస్తులే అని ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. తాత్కాలిక అటాచ్ చేసింది. ప్రభుత్వ ధర ప్రకారం ఎవరైనా రిజిస్ట్రేషన్ కి డబ్బులు చెల్లిస్తే ఆ భూములు రైతుల పేరిట రిజిస్ట్రేషన్ చేస్తానని బెంజ్ మంత్రి హామీ ఇచ్చారు. ప్రభుత్వ ధర ప్రకారం ఆ రిజిస్ట్రేషన్ డబ్బు మేము చెల్లిస్తాం. రైతుల పేరిట రిజిస్ట్రేషన్ చెయ్యడానికి సిద్ధమా అని సవాల్ చేస్తున్నాను. బెంజ్ మంత్రి స్వగ్రామం గుమ్మనూరులో సోదరుడు గుమ్మనూరు శ్రీనివాసులు అంతర్రాష్ట్ర రాష్ట్ర పేకాట క్లబ్ నిర్వాహిస్తున్నారు. ఆ క్లబ్ పై దాడులు చేసిన పోలీస్ అధికారులపైనే దాడులు చేశారు అని చెప్పారు. బెంజ్ మంత్రి సోదరులు గుమ్మనూరు నారాయణ, శ్రీనివాసులు, వైసీపీ నేతలు నియోజకవర్గంలో భూ కబ్జాలు, భూ సెటిల్మెంట్స్ చేస్తున్నారు. కర్ణాటక మద్యం రోజుకి ఒక లోడ్ ఆలూరు లో దిగుతుంది. అవే బళ్లలో రేషన్ బియ్యం కర్ణాటక కు పంపుతున్నారు బెంజ్ మంత్రి. ఏకంగా ఆలూరు చెరువునే మింగేయడానికి స్కెచ్ వేసారు బెంజ్ మంత్రి. జేసీబీలు పెట్టి చెరువు భూమిని చదును చేస్తుంటే అధికారులు అడ్డుపడ్డారు. దేవనకొండ మండలం గుడిమిరాళ్ల, యలమకూరులో ప్రభుత్వ భూములు 150 ఎకరాలు వైసీపీ నాయకులు కొట్టేసారు. వేదవతి నది నుండి పెద్ద ఎత్తున ఇసుక లేపేస్తున్నారు బెంజ్ మంత్రి, ఆయన అనుచరులు. ఆఖరికి ఈయన అవినీతి గురించి రాసిన జర్నలిస్టుల మీద కూడా బెంజ్ మంత్రి దాడిచేయించారుఅని ఆరోపించారు.

పత్తికొండ, నగరడోనా రిజర్వాయర్లు పూర్తిచేస్తాం

2014 లో ఇక్కడ టిడిపి గెలవక పోయినా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది టిడిపి. సిసి రోడ్లు, సాగు, తాగునీటి ప్రాజెక్టులు నిర్మించాం. కానీ మీరు ఏమి చేసారు పాలిచ్చే ఆవుని వద్దనుకుని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నారుఅని లోకేష్ పేర్కొన్నారు. ఇక్కడ ప్రజలు సాగునీటి, తాగునీటి కోసం పడుతున్న కష్టాలు చూస్తుంటే నాకు కన్నీరు వస్తుంది. నియోజకవర్గంలో రోడ్లు చూసిన తరువాత అసలు బెంజ్ మంత్రికి మంత్రి పదవి అవసరమా అనిపించింది. వేదవతి ఎత్తిపోతల పథకం ద్వారా ఆలూరు, ఆదోని నియోజకవర్గాల్లో 80 వేల ఎకరాలకు సాగునీరు, 196 గ్రామాలకు తాగునీరు ఇవ్వాలని గత టీడీపీ ప్రభుత్వంలో ఆనాటి సీఎం చంద్రబాబు రూ.1,942.38 కోట్లు మంజూరు చేసి పనులు మొదలు పెట్టారు. జగన్ వచ్చిన తరువాత ఆ ప్రాజెక్టును అటక ఎక్కించారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తాం. వైసిపి ప్రభుత్వం ఆపేసిన పత్తికొండ రిజర్వాయర్, నగరడోన రిజర్వాయర్ లను పూర్తిచేస్తాం అని హామీ ఇచ్చారు. ఆలూరు పట్టణం సహా మెజార్టీ గ్రామాలు తాగునీటి సమస్యతో తల్లడిల్లుతున్నాయి. వారం పది రోజులకు ఒకసారి కూడా తాగునీరు అందడం లేదు. తాగునీటి శాశ్వత పరిష్కారం కోసం చంద్రబాబు ప్రభుత్వంలో వాటర్ గ్రిడ్ కు రూపకల్పన చేస్తే.. జగన్ ప్రభుత్వం వచ్చాక అతీగతి లేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతిఇంటికి నీటి కుళాయి ద్వారా సురక్షిత తాగు నీరు అందిస్తాం అని లోకేష్ వెల్లడించారు. రోడ్లు అయితే ఘోరంగా ఉన్నాయి. కొత్త రోడ్లు మేము వేస్తాం. టమాటో, ఉల్లి, పత్తి, మిరప, బెంగాల్ గ్రామ్ రైతుల కష్టాలు నాకు తెలుసు. పెట్టుబడి ఖర్చు తగ్గించి, గిట్టుబాటు ధర కల్పిస్తాం. ఆలూరులో ప్రభుత్వ డిగ్రీ, ఐటీఐ కాలేజీ, ప్రభుత్వ ఆసుపత్రులకు సొంత భవనాలు లేవు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే సొంత భవనాలు ఏర్పాటు చేస్తాం. కార్మికశాఖ మంత్రి బెంజ్ మంత్రి గారి నియోజకవర్గంలో యువతకి ఉద్యోగాలు లేవు, ఉపాధి లేక ఎంతో మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసి వలసలు ఆపుతాం అని లోకేష్ హామీ ఇచ్చారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *