మా బాబు నెరసిన వెంట్రుక కూడా పీకలేరు నారా లోకేష్ సవాల్

మా బాబు నెరసిన వెంట్రుక కూడా పీకలేరు నారా లోకేష్ సవాల్

మీరు తెచ్చిన సిట్ తోనే మీకు అరదండాలు
ఏ ప్రాజెక్టూ పూర్తిచేయలేడని కంత్రీజగన్ కు శాపం
పాణ్యం ఎమ్మెల్యే పేరు కరప్షన్ రాంభూపాల్ రెడ్డి
పాణ్యం బహిరంగసభలో నిప్పులు చెరిగిన లోకేష్

సిట్ పై ఉన్న స్టే సుప్రీం కోర్టు ఎత్తేయడంతో వైసిపి పేటిఎం బ్యాచ్ స్వీట్లు పంచుకున్నారు. చంద్రబాబు అంతు తేలుస్తాం. చిన్న బాబు సంగతి తేలిస్తాం అని సకల శాఖా మంత్రి సజ్జల షో చేస్తున్నాడు. నాలుగేళ్లలో మా బాబు నెర‌సిన వెంట్రుక కూడా పీకలేకపోయారు, కొత్తగా పీకేది కూడా ఏమీ ఉండదని టిడిపి యువనేత నారా లోకేష్ నిప్పులు చెరిగారు. పాణ్యం నియోజకవర్గం పెదపాడు వద్ద శుక్రవారం నిర్వహించిన భారీబహిరంగ సభలో లోకేష్ మాట్లాడుతూ నాలుగేళ్లలో నా స్టూళ్లు లాక్కోవడం తప్ప పీకింది ఏమి లేదు. మీ సిట్ టైం అయిపోయింది. మా సిట్ టైం త్వరలోనే స్టార్ అవుతుంది. మీరు తెచ్చిన సిట్ తోనే మీ ల్యాండ్, స్యాండ్, వైన్, మైన్ మాఫియా అక్రమాలు అన్ని బయటకు తీసి వైసిపి నాయకుల్ని జైలుకి పంపుతాం అని లోకేష్ హెచ్చరించారు.

పాణ్యం పవర్ అదిరిపోయింది. పాణ్యం ప్రజల పంచ్ కి ప్యాలస్ పిల్లికి దిమ్మతిరిగిపోతుంది. ఎంతో చరిత్ర ఉన్న పాణికేశ్వరస్వామి పేరు మీదే పాణ్యం పేరు వచ్చింది. పాణ్యం నర్సరీలు జిల్లాలోనే ప్రత్యేక గుర్తింపు పొందాయి. కాల్వబుగ్గ శ్రీ రామేశ్వరస్వామి, లక్ష్మీపురం జగన్నాథ స్వామి, కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఉన్న నేల ఇది. పుణ్య భూమి పాణ్యంలో పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం. యువగళం. మనగళం. ప్రజాబలంఅని లోకేష్ వెల్లడించారు. జగన్ ఒక కంత్రి. అందుకే కంత్రి జగన్ అని పేరు పెట్టానన్నారు.

కంత్రి జగన్ అని ఎందుకు అంటునాన్నో వివరంగా చెబుతా. కంత్రి జగన్ ఆస్తి లక్ష కోట్లు, వేసే చెప్పుల ధర లక్ష రూపాయిలు, తాగే నీళ్ల బాటిల్ ధర వెయ్యి రూపాయిలు. 23 ఎకరాల్లో బెంగుళూరు యెలహంక ప్యాలస్, లోటస్ పాండ్ లో ఒక ప్యాలస్, ఇడుపుల పాయలో ఒక ప్యాలస్, తాడేపల్లి లో ఒక ప్యాలస్, ఇప్పుడు వైజాగ్ లో ఇంకో ప్యాలస్ కడుతున్నాడు. నాలుగేళ్లలో ఈయన పేదలకు కట్టిన ఇళ్లు ఐదు. కంట్రీ లోనే ఈ కంత్రి జగన్ ధనిక సీఎం. ఈయన పేదల గురించి మాట్లాడే మాటలు విని అబద్దమే సిగ్గుతో తలదించుకుంటుంది. లక్ష కోట్లు ప్రజాధనం కొట్టేసిన కంత్రి జగన్ కి పేదల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు అని లోకేష్ విమర్శించారు.

ఎన్నిసార్లు శంకుస్థాపనలు చేస్తారు?

ఎవరికో పుట్టిన బిడ్డకు తానే తండ్రి అంటాడు కంత్రి జగన్. ఆయన వంగలేడు కానీ ఎప్పుడో శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులకు మళ్ళీ శంకుస్థాపన చేస్తాడు అని లోకేష్ ఎద్దేవా చేశారు. కడప స్టీల్ ప్లాంట్ కి రెండో సారి శంకుస్థాపన చెయ్యడానికి వెళ్ళినప్పుడు వంగలేక పోయాడు. పక్కన ఉన్న పూజారులు రాయి ఎత్తి పట్టుకుంటే కొబ్బరికాయ కొట్టాడు. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కి మళ్లీ శంకుస్థాపన చెయ్యడానికి ఊపుకుంటూ వెళ్ళాడు. ఈ సారి కొబ్బరికాయ కొట్టడానికి సెట్టింగ్ వేసాడు.

ఐరెన్ రాడ్స్ తో క్రికెట్ స్టంప్స్ మాదిరిగా ఒక సెట్టింగ్ వేసి కొట్టాడు. శంకుస్థాపన చేసే ప్రాజెక్టు ఏది జగన్ తెచ్చింది కాదు. అందుకే కొబ్బరికాయ కొట్టడానికి నడుం సహకరించడం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కి వ్యతిరేకంగా పోరాటం చేసాడు. అధికారంలోకి రాగానే భూములు తిరిగి ఇస్తాం అన్నాడు. విశాఖ ఎయిర్పోర్ట్ లో ఈగలు తోలుకుంటున్నారు, ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకు దండగ అన్నాడు. ఇప్పుడు మాట మార్చాడు, మడమ తిప్పాడు అని విమర్శించారు. 2026 కి భోగాపురం ఎయిర్పోర్ట్ లో డబుల్ డెక్కర్ విమానాలు దింపుతాడు అంట. భోగాపురం ఎయిర్పోర్ట్ కి భూమి సేకరించింది చంద్రబాబు, శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించింది చంద్రబాబు.

ఇప్పుడు ఈ కంత్రి జగన్ మళ్లీ శంకుస్థాపన చేసాడు. కంత్రి జగన్ కి ఒక శాపం ఉంది జీవితంలో సొంతగా ఏ ప్రాజెక్టు, కంపెనీ తీసుకురాలేడు. ఆఖరికి పార్టీ కూడా ఆయనది కాదు. వేరే వాళ్ళు పెట్టిన పార్టీకి ఈయన మళ్లీ రిబ్బన్ కట్ చేసాడు అంతే. నేను ఐటి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అదానీ డేటా సెంటర్ తీసుకొచ్చాను. భూమి కేటాయించాం. చంద్రబాబు శంకుస్థాపన కూడా చేసారు. నాలుగేళ్లు ఆ ప్రాజెక్టు ముందుకు సాగకుండా అడ్డుకొని ఇప్పుడు మళ్లీ శంకుస్థాపన చేసాడని లోకేష్ చెప్పారు.

బాబాయిని కేసులో అడ్డంగా బుక్కయిన్ జగన్

బాబాయ్ ని లేపేసిన అబ్బాయిలు అడ్డంగా బుక్కైపోయారు అని లోకేష్ ఆరోపించారు. వివేకా మర్డర్ కి ముందు రోజు, మర్డర్ జరిగిన రోజు నిందితులు అంతా ఫోన్ కాల్స్ మాట్లాడుకున్నారు. నిందితులు అంతా ఫోన్ కాల్స్ ఎందుకు మాట్లాడుకున్నారు అని వైసిపి నేతల్ని అడిగితే జబర్దస్త్ స్కిట్స్ మించిన కామిడీ చేస్తున్నారు. వాళ్లంతా మీ ఇంట్లో కూర ఏంటి, మీ ఇంట్లో కూర ఏంటి అని చర్చించుకున్నారు అంట. ఎవరి ఇంట్లోనూ కూర బాలేదు అంట, అందుకే చివరిగా అవినాష్ రెడ్డి కంత్రి జగన్ గారి ఇంట్లో కూర ఏంటో కనుక్కోవడానికి కాల్ చేసాడట.

కూర లెక్కలు అన్ని సీబీఐ తేల్చేసింది. త్వరలో అందరూ కలిసి చంచల్ గూడా కి పోవడం ఖాయం అని లోకేష్ వెల్లడించారు. కంత్రి జగన్ పెద్ద ఫిట్టింగ్ అండ్ కట్టింగ్ మాస్టర్. ఆయన ఫిట్టింగ్ ఎలా ఉంటుందో చెబుతాను. కంత్రి జగన్ కి రెండు బటన్స్ ఉంటాయి. ఒకటి బ్లూ బటన్. రెండోవది రెడ్ బటన్. బ్లూ బటన్ నొక్కగానే మీ అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. రెడ్ బటన్ నొక్కగానే మీ అకౌంట్ నుండి 100 రూపాయలు పోతుంది.

అది ఎలాగో మీకు చెబుతా. విద్యుత్ ఛార్జీలు 8 సార్లు బాదుడే బాదుడు, ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు బాదుడే బాదుడు, ఇంటి పన్ను బాదుడే బాదుడు, చెత్త పన్ను బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్ ధరలు బాదుడే బాదుడు, నిత్యావసర సరుకుల ధరలు బాదుడే బాదుడు. మీకు ఇంకో ప్రమాదం కూడా ఉంది త్వరలోనే వాలంటీర్ వాసు మీ ఇంటికి వస్తాడు. మీరు పీల్చే గాలిపై కూడా పన్నేస్తాడు. కంత్రి జగన్ కి దమ్ముంటే ఇంటికి స్టిక్కర్ కాదు కరెంట్ బిల్లుకి, బస్సు టికెట్ మీద, పెట్రోల్, డీజిల్ బిల్లు మీద, చెత్త పన్ను మీద, ఇంటి పన్ను మీదా స్టిక్కర్ వెయ్యాలి అని సవాల్ చేశారు.

జగన్ పాలనలో అన్నీ కటింగులే

కంత్రి జగన్ కట్టింగ్ మాస్టర్. అది ఎలాగో చెబుతాను అని లోకేష్ తెలిపారు. అన్న క్యాంటిన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న భీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్, ఫీజు రీయింబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్లు కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్. 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం ఈ కంత్రి జగన్. కంత్రి జగన్ యువత ను చీట్ చేసాడు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్ పధకం రద్దు చేసాడు.

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం అని వివరించారు. కంత్రి జగన్ మహిళల పసుపు, కుంకుమ చెరిపేస్తున్నాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం హామీ ఎం అయ్యింది? సొంత జే బ్రాండ్లు అమ్ముకొని వేల కోట్లు సంపాదిస్తున్నాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సి, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తా అని మోసం చేసాడు. అధికారంలోకి వచ్చాకా పన్నుల భారం తగ్గిస్తాం. నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తాం. 2024 జరగబోయేది దేశంలోనే ధనిక సీఎం జగన్ కి ఆంధ్రప్రదేశ్ పేదలకు మధ్య యుద్ధం. పేదలు ఎప్పటికీ పేదరికంలో ఉండాలి అనేది కంత్రి జగన్ కోరిక. పేదరికం లేని రాష్ట్రం చూడాలన్నది మీ లోకేష్ కోరిక. కంత్రి జగన్ కి అన్ని కన్నింగ్ ఐడియాలే వస్తాయని వివరించారు.

రైతులేని రాజ్యం తెస్తున్న జగన్

కంత్రి జగన్ రైతులు లేని రాజ్యం తెస్తున్నాడుఅని లోకేష్ విమర్శించారు. కంత్రి జగన్ పరిపాలనలో పురుగుల మందులు పనిచేయవు. జగన్ బ్రాండ్లు ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్, ఆంధ్రా గోల్డ్ కొడితే మాత్రం పురుగులు చస్తాయి. రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మీటర్లు పెడుతున్నాడు. రాయలసీమలో 1000 అడుగుల వరకూ బోర్లు వేస్తే కానీ నీళ్లు రావు. మరి కరెంట్ బిల్లు ఎంత వస్తుందో ఆలోచించండి.

మీటర్లు రాయలసీమ రైతులకు ఉరితాళ్లు. కంత్రి జగన్ ఉద్యోగస్తులను కూడా వేధించాడు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని 200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు. పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడు. ఆఖరికి పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వలేని చెత్త ప్రభుత్వం ఇది అని లోకేష్ ధ్వజమెత్తారు.

బిసిల బ్యాక్ బోన్ విరిచిన కంత్రీజగన్

బీసీలకు బ్యాక్ బోన్ విరిచాడు కంత్రి జగన్. పేరుకే బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసారు అని లోకేష్ చెప్పారు. నిధులు కేటాయించలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్ కట్ చేసి 16,500 మందిని పదవులకు దూరం చేసాడు. బీసీలను అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల అక్రమ కేసులు బీసీల పై పెట్టాడు. అందుకే బీసీల భద్రత కోసం ప్రత్యేక బీసీ రక్షణ చట్టం తీసుకొస్తాం. బీసీలకు శాశ్వత కుల ధృవ పత్రాలు అందిస్తాం. బీసీలమని ఆరు నెలలకోసారి కుల ధృవపత్రాలు తీసుకోవాల్సిన దుస్థితి లేకుండా చేస్తాం. మొబైల్ లో ఒక్క బటన్ నొక్కగానే ఇంటికి బిసి కుల ధృవ పత్రాలు వచ్చే ఎర్పాటు చేస్తాం. అవి శాశ్వత కుల ధృవ పత్రాలు గా ఉపయోగపడేలా చట్టం లో మార్పులు తీసుకొస్తాం. దామాషా ప్రకారం బీసీ ఉపకులాలకు నిధులు, రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు.

దళితద్రోహి జగన్

కంత్రి జగన్ దళిత ద్రోహి. డాక్టర్ సుధాకర్ దగ్గర మొదలైందని లోకేష్ చెప్పారు. ఇప్పుడు డాక్టర్ అచ్చెన్న వరకూ వచ్చింది. ఇసుక అక్రమాలను ప్రశ్నించినందుకు వరప్రసాద్ కి గుండు కొట్టించారు, మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ ని కొట్టి చంపారు, జగన్ లిక్కర్ స్కామ్ పై పోరాడినందుకు ఓం ప్రతాప్ కి చంపేసారు. పెద్దిరెడ్డి అవినీతి పై పోరాడినందుకు జడ్జ్ రామకృష్ణ ని హింసించారు. ఒక్క కేసులో అయినా దళితుల పై దాడి చేసిన వారికీ శిక్ష పడిందా? సుబ్రహ్మణ్యం అనే దళిత యువకుడిని చంపేసిన ఎమ్మెల్సీ అనంతబాబు కి సన్మానం చేసి ఊరేగించారు. వైసిపి పాలనలో దళితులను చంపడానికి జగన్ స్పెషల్ లైసెన్స్ ఇచ్చారని ధ్వజమెత్తారు.

మైనారిటీలనూ మోసగించాడు

మైనారిటీలను మోసం చేసాడు కంత్రి జగన్. దుల్హన్, రంజాన్ తోఫా వంటి పథకాలు రద్దు చేశాడని లోకేష్ విమర్శించారు. మసీదు, ఈద్గా, ఖబర్ స్తాన్ ల అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కేటాయించలేదు. ఆత్మహత్య చేసుకోవడం మైనార్టీలు మహా పాపంగా భావిస్తారు. కంత్రి జగన్ సీఎం అయ్యాక నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. కేవలం వైసీపీ నాయకుల వేధింపుల వల్లే వాళ్లు ఆత్మహత్య చేసుకున్నారు.

ఇబ్రహీం అనే ముస్లిం నేతను నరసరావుపేటలో దారుణంగా నరికి చంపేశారు. పలమనేరులో మిస్బా అనే పదో తరగతి చెల్లిని వైసీపీ నాయకుడు సునీల్ టీసీ ఇప్పించి, బలవంతంగా వేధించడంతో, చదువుకు దూరం చేయడంతో ఆత్మహత్య చేసుకుంది. కర్నూలు లో హాజీరాని అత్యాచారం చేసి చంపేశారు. ఆమె తల్లి బేగంబీ కి కనీసం పోస్టుమార్టం రిపోర్ట్ ఇవ్వకుండా ప్రభుత్వం వేధించింది. ఇప్పటికీ ఆ తల్లికి న్యాయం జరగలేదన్నారు.

ఆయనపేరు కరప్షన్ రాంభూపాల్ రెడ్డి

పాణ్యంలో అభివృద్ధి గోరంత. అవినీతి కొండంత. ఆయన మాత్రం అపర కోటీశ్వరుడు అయ్యాడన్నారు. అందుకే ఆయన పేరు మార్చాను. ఆయన కాటసాని. రాంభూపాల్ రెడ్డి కాదు కరప్షన్. రాంభూపాల్ రెడ్డి. జగన్నాథగట్టుని కేజిఎఫ్ గా మార్చేసాడు కరప్షన్. రాంభూపాల్ రెడ్డి. కేజిఎఫ్ అంటే ఏంటో తెలుసా? కర్నూలు గ్రావెల్ ఫీల్డ్. కరప్షన్ రాంభూపాల్ రెడ్డి ఎర్రమట్టి మాఫియా జగన్నాథగట్టు కొండని మాయం చేస్తుంది. 1.71 లక్షలు క్యూబిక్ మీటర్లు అక్రమంగా తవ్వారని మైనింగ్ అధికారులే తేల్చారు. రూ.9.15 కోట్లు ఫైన్ కట్టాలని నోటీసులు పంపారు.

అధికారికంగానే రూ.9.15 కోట్లు అంటే ఇక అసలు దోపిడీ ఎంత అయ్యి ఉంటుందో లెక్కేసుకోండి. జర్నలిస్టులకు కేటాయించిన భూమిని కూడా కొట్టేసారు. 500 ఎకరాల విస్తీర్ణం ఉన్న జగన్నాథగట్టును విద్యాలయంగా మార్చాలని టిడిపి హయాంలో ట్రిపుల్ ఐటీ కళాశాల, ప్రభుత్వ క్లస్టర్ యూనివర్సిటీ.. వంటి విద్యా సంస్థలకు భూములు కేటాయించి నిర్మాణాలు చేపట్టింది. వక్ఫ్ భూములను కూడా వదలలేదు కరప్షన్. రాంభూపాల్ రెడ్డి. ముజఫర్ నగర్ దగ్గర ఉన్న సర్వే నంబర్ 524లోని మసీదుకి చెందిన 2 ఎకరాల భూమిని కబ్జా చేసారు. భూమి కోసం కోర్టులో పోరాడుతున్న ముస్లిం పెద్దలను ఇంటికి పిలిచి బెదిరించాడు అని లోకేష్ ఆరోపించారు.

పోరంబోకు భూములకూ స్కెచ్

కల్లూరు సున్నంగుడి సమీపంలో సర్వే నంబర్ 182 లో రస్తా పోరంబోకు భూమి 4.30 ఎకరాల భూమి ఉంది. విలువ రూ.25 కోట్లు. ఈ భూమి కొట్టేయడానికి స్కెచ్ వేసాడు కరప్షన్. రాంభూపాల్ రెడ్డి అని చెప్పారు. కరప్షన్. రాంభూపాల్ రెడ్డి ప్రధాన వ్యాపారం ల్యాండ్ సెటిల్మెంట్స్. నియోజకవర్గంలో ఎవరు వెంచర్ వెయ్యాలన్నా ఎమ్మెల్యేకి కప్పం కట్టాల్సిందే. ఓర్వకల్లు మండలం పిన్నాపురంలో పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చెయ్యడం కోసం టిడిపి ప్రభుత్వం 300 ఎకరాలు కేటాయించింది.

వైసిపి ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ పనులు ఆపేసింది. కరప్షన్. రాంభూపాల్ రెడ్డి, అనుచరులు బీసీ,ఎస్సి,ఎస్టీ రైతుల భూములు కారు చౌకగా బెదిరించి కొనేసారు. ప్రభుత్వం నుండి భూపరిహారం కింద కోట్లు కొట్టేసారు. ఉలిందకొండ గ్రామంలోని రాఘ మయూరి వెంచర్స్ లో పార్క్ కోసం కేటాయించిన భూమిని ఎమ్మెల్యే తన భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని లోకేష్ ఆరోపించారు. ఓర్వకల్లు మండలం పుడిచెర్ల, శకునాల, కొమ్ము చెరువుల్లో మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు ఎమ్మెల్యే కొడుకు నరసింహరెడ్డి. క్రషర్లు, మైన్స్ యజమానులను బెదిరించి కోట్లు కొట్టేస్తున్నాడు కరప్షన్. రాంభూపాల్ రెడ్డి.

ఓర్వకల్లు మండలం బైరాపురంలో వంద ఎకరాల ప్రభుత్వ భూమిని కరప్షన్. రాంభూపాల్ రెడ్డి కబ్జా చేసాడు. గని, శకునాల సోలార్ హబ్లో గన్ పెట్టి క్లీనింగ్ కాంట్రాక్టు కొట్టేసారు కరప్షన్. రాంభూపాల్ రెడ్డి రౌడీ గ్యాంగ్. కల్లూరు మండలం బస్తిపాడు గ్రామంలో వైసీపీ నేత సింగల్ విండో డైరెక్టర్ రమణారెడ్డి 30 ఎకరాలు ప్రభుత్వ భూమిని కబ్జా చేసాడు. కొరపొల్లూరు గ్రామంలో గడివేముల జడ్పీటీసీ చంద్రశేఖర్ రెడ్డి 30 ఎకరాలు కబ్జా చేసాడు. ఇతను ఎంత ఘనుడు అంటే టిడిపి సర్పంచ్ సంతకం ఫోర్జరీ చేసి 32 లక్షలు కొట్టేసాడు. దూపాడు గ్రామంలో 4 ఎకరాల భూమిని వైసీపీ నేత సత్యంరెడ్డి కబ్జా చేశారన్నారు.

తాగు, సాగు నీటి సమస్య పరిష్కరిస్తాం

పాణ్యంని అభివృద్ధి చేసింది టిడిపి. గ్రామాల్లో సిసి రోడ్లు, సాగు,తాగునీటి ప్రాజెక్టులు, పేదలకు ఇళ్లు, పరిశ్రమలు తెచ్చింది టిడిపి. పాణ్యం నియోజకవర్గంలో సాగు, తాగునీటి సమస్య పై నాకు అవగాహన ఉందని లోకేష్ చెప్పారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీటిని అందిస్తాం. ఓర్వకల్లు మండలంలో మల్లికార్జున రిజర్వాయిర్ టీడీపీ ప్రభుత్వంలోనే మంజూరు చేసాం. నాలుగేళ్లుగా సర్వే పేరుతో కాలయాపన చేస్తున్నారు. వెలగమాను ఫీడర్ ఛానల్ నిర్మిస్తానని ఎన్నికల ముందు కరప్షన్.

రాంభూపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వెలగమాను ఫీడర్ ఛానల్ పూర్తి చేసి 14 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. 2014 లో ఉమ్మడి కర్నూలు జిల్లా లో మీరు టిడిపిని మూడు చోట్ల మాత్రమే గెలిపించారు. అయినా జిల్లాను అభివృద్ధి బాటలో పరుగులు పెట్టించాం. 1,005 ఎకరాల్లో కేవలం 18 నెలల్లో కర్నూలు (ఓర్వకల్లు) ఎయిర్ పోర్టు నిర్మించి తొలి ఫ్లైట్ ఓర్వకల్లులో దింపాం ఓర్వకల్లులో ఇండస్ట్రీయబ్ ఏర్పాటు చేశాం. జైరాజ్ ఇస్పాత్ (ఉక్కు పరిశ్రమ) తెచ్ఛాం. దేశంలోనే అతి పెద్ద 1,000 మెగావాట్ల సోలార్ పార్క్ తీసుకొచ్చి 1,500 మందికి ఉపాధి చూపాం.ట్రిపుల్ ఐటీ, క్లస్టర్ యూనివర్సిటీ, ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసాం. జగన్నాథగట్టుపై 200 ఎకరాల్లో అందమైన భవనాలు నిర్మించాం. పాణ్యం నియోజకవర్గం పిన్నాపురం వద్ద భారీ పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ తీసుకొచ్చాం. ఇది పూర్తి అయితే 3వేల మందికి ఉద్యోగాలు వచ్చేవన్నారు.

బనగానపల్లె నియోజకవర్గం కోవెలకుంట్లను సిమెంట్ హబ్ గా మార్చాలనే సంకల్పంతో మూడు సిమెంట్ పరిశ్రమలతో ఎంఏయూ చేసుకొని JSW సిమెంట్ పరిశ్రమకు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. కర్నూలు జనరల్ ఆస్పత్రిలో రూ.250 కోట్లతో స్టేట్ క్యాన్సర్ యూనిట్ నిర్మాణం చేపడితే… జగన్ వచ్చి నాలుగేళ్లు అయినా పూర్తి చేయలేదు. అమెరికా అయోవా యూనివర్సిటీ సహకారంతో నందికొట్కూరు నియోజకవర్గంలో మెగా సీడ్ పార్క్ ఏర్పాటుకి భూమి కేటాయిస్తే. ఆ ప్రాజెక్టుని జగన్ రద్దు చేసాడు. రాయలసీమకు జీవనాడి అయిన మచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేసింది చంద్రబాబు గారు. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో వలసలు ఆపాలని ఆర్డీఎస్ కుడి కాలువ ప్రాజెక్టు రూ.1986 కోట్లతో చేపడితే… పనులు ఆపేశారు. ఆలూరు, ఆదోని నియోజకవర్గాలకు వేదావతి ప్రాజెక్టు రూ.1,947 కోట్లతో చేపడితే నిధులు ఇవ్వలేక పనులు ఆపేశారు. గండ్రేవుల రిజర్వాయిర్ నిర్మాణం కోసం రూ.2,400 కోట్లు మంజూరు చేసి జీవో ఇస్తే జగన్ వచ్చాక ఊసే లేదని విమర్శించారు.

తాగునీటి పథకాలనూ ఆపేశారు

డోన్, పత్తికొండ నియోజకవర్గాల్లో 68 చెరువులకు హంద్రీనీవా నీళ్లు ఇవ్వాలని రూ.244 కోట్లతో ఎత్తిపోతల పనులు చేపట్టి 70 శాతం పూర్తి చేస్తే ఆర్థిక మంత్రి బుగ్గన మిగిలిన 30 శాతం పూర్తి చేయలేదని లోకేష్ చెప్పారు. రూ. 368 కోట్లు ఖర్చు చేసి అవుకు టన్నెల్ పూర్తి చేసి పులివెందులకు నీళ్లు ఇస్తే.. జగన్ వచ్చాక మిగిలిన రెండవ టన్నెల్ పూర్తి చేయలేదు. హంద్రీనీవా కాలువ విస్తరణ పనులు రూ.1,000 కోట్లతో చేపడితే.. జగన్ వచ్చాక ఆపేశారు. 2019 లో ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలు 14 స్థానాల్లో వైసిపి ని గెలిపించారు. ఇద్దరు ఎంపీలను గెలిపించారు. ఒక్క పరిశ్రమ అయినా తెచ్చాడా? ఒక్క ప్రాజెక్ట్ నిర్మాణం అయినా చేసాడా? కర్నూలు ప్రజలు, మేధావులు ఆలోచించాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు.

3 రాజధానులపేరుతో చిచ్చుతప్ప చేసిందేమిటి?

మూడు రాజధానులు అని ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం తప్ప ఒక్క ఇటుక కూడా పెట్టలేదని లోకేష్ విమర్శించారు. కర్నూలుకి కేటాయించిన జ్యూడిషియల్ అకాడమీ ని తరలించాడు. కృష్ణా రివర్ మ్యానేజ్మెంట్ బోర్డు ని సంబంధం లేని విశాఖ కు తరలించాడు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పై స్టే ఉంటే కనీసం లాయర్ ని పెట్టి వాదించే దిక్కు లేదు. వివేకా ని చంపిన అవినాష్ ని కాపాడటానికి పెద్ద అడ్వకేట్లను పెట్టిన జగన్ కనీస శ్రద్ద రాయలసీమ ఎత్తిపోతల పథకంపై పెట్టలేదన్నారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *