దోపిడీదుర్తి కుటుంబంపై నిప్పులు చెరిగిన నారా లోకేష్

దోపిడీదుర్తి కుటుంబంపై నిప్పులు చెరిగిన నారా లోకేష్

కియా కారు చూస్తే చంద్రబాబు గుర్తొస్తారని.. వేసుకునే డ్రాయర్ చూస్తే జగన్ తన్ని తరిమేసిన జాకీ కంపెనీ గుర్తొస్తుందని లోకేష్ చెప్పారు. రాప్తాడు ఎమ్మెల్యే పేరు తోపుదుర్తి. ప్రకాష్ రెడ్డి అయితే ఆయన అభివృద్ధి లో వీకు..అవినీతి లో తోపు అని.. అందుకే ఆయనకు నేను ముద్దుగా దోపిడీదుర్తి. ప్రకాష్ అని పేరు పెట్టానని లోకేష్ తెలిపారు. ఏ నియోజకవర్గానికైనా ఒక్క ఎమ్మెల్యేనే ఉంటారు. కానీ రాప్తాడు కి మాత్రం 5గురు ఎమ్మెల్యేలు ఉన్నారని.. దోపిడీదుర్తి. ప్రకాష్ అయన తండ్రి గారు, ఇద్దరు బ్రదర్స్, ఇంకో లేడి ఎమ్మెల్యే కూడా ఉన్నారని.. రాప్తాడు వీళ్లకి మంచి పేస్ట్రీ కేకులా దొరికిందని.. 5 ముక్కలుగా కోసుకొని తినేస్తున్నారని లోకేష్ అన్నారు.

ఎన్నికల ముందు ఇళ్లు అమ్ముకొని రాజకీయం చేస్తున్నామని వైసీపీ నేతలు అన్నారు.. ఈ నాలుగేళ్లలో వైసీపీ నేతల అవినీతి సంపాదన 1000 కోట్లు దాటిందని లోకేష్ తెలిపారు. దోపిడీదుర్తి కుటుంబం అధికారంలోకి రాగానే కొంత మంది పోలీసుల్ని పార్ట్నర్స్ గా చేర్చుకొని రైతులను, రియల్ ఎస్టేట్ వారిని బెదిరించి వందల ఎకరాలు దోచేసారని.. రాప్తాడు, అనంతపురం రూరల్ మండలాల్లో ఎక్కడ ఏ లేఔట్ వేయాలన్నా ఈ దోపిడీదుర్తి కుటుంబానికి కప్పం కట్టాల్సిందేనన్నారు. ఎకరానికి 10 లక్షలు వసూలుచేస్తున్నారని.. విశాఖపట్నంలో కూడా ఈ కుటంబం భూకబ్జాలు చేసిందని లోకేష్ ఆరోపించారు. చెన్నేకొత్తపల్లి మండలంలో ఓ రైతు తన భూమి వీరికి భూమి అమ్మలేదని పొలంలో ఉన్న మామిడి చెట్లు మొత్తం రాత్రికి రాత్రి నరికేశారంటే.. ఎంత దారుణమైనది ఆ కుటుంబమో అర్ధం చేసుకోవాలని లోకేష్ అన్నారు.

ఎమ్మెల్యే అన్న రాజారెడ్డి అనంతపురం టౌన్ లో కోటి రూపాయలు విలువైన మున్సిపాలిటీ స్థలాన్ని ఆక్రమించి షెడ్డు నిర్మించాడని.. అనంతపురం సిటీకి ఆనుకొని ఉన్న ఉప్పరపల్లి అనే గ్రామంలో పది ఎకరాల వంక పోరంబోకు భూమిని ఎమ్మెల్యే అన్న తోపుదుర్తి చందు అనుచరులు కబ్జా చేశారని.. ఈ భూమి విలువ 30 కోట్లు ఉంటుందని లోకేష్ తెలిపారు. రాప్తాడు నియోజకవర్గంలో ఇసుక, మట్టి, కంకర దందా మొత్తం దోపిడీదుర్తి కుటుంబానిదేనని .. ఆఖరికి ట్రాన్స్ పోర్ట్ కి కూడా వాళ్ళ టిప్పర్లే వాడాలని బెదిరిస్తారని లోకేష్ అన్నారు. దోపిడీదుర్తి కుటుంబానికి ఒక దోపిడీ కంపెనీ ఉందని.. దాని పేరు రాక్రిట్ అని చెప్పారు. అనంతపురంలో 9 వేలు, గుంటూరు, కృష్ణా లో వేల ఇళ్లు నిర్మించే కాంట్రాక్ట్ తీసుకున్నారని.. ఎన్నికల్లో సొంత ఇళ్లు లేదు అని ఏడ్చిన వాళ్లకి ఇంత పెద్ద కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారని లోకేష్ ప్రశ్నించారు.

ఇళ్ళ నిర్మాణానికి పునాది వేస్తే 70 వేల రూపాయలు బిల్లు చెల్లిస్తారు.. అయితే రాక్రిట్ సంస్థ 10 వేల రూపాయల్లో అత్యంత నాసిరకంగా పునాది నిర్మించి 70 వేల రూపాయలు బిల్లు తీసుకున్నారని.. రాక్రీట్ సంస్థ నిర్మిస్తున్న ఇళ్లు చిన్నపిల్లాడు బలంగా తంతే పడిపోయేంత నాసిరకంగా ఉన్నాయని .. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని లోకేష్ తెలిపారు. ఇళ్ల నిర్మాణం లో దోపిడీదుర్తి కుటుంబం కొట్టేసిన సొమ్ము 280 కోట్ల వరకు ఉంటుందని లోకేష్ తెలిపారు. టిడిపి హయాంలో జాకీ పరిశ్రమ రాప్తాడుకి తీసుకొస్తే.. దోపిడీదుర్తి కుటుంబం జాకీ కంపెనీని 15 కోట్లు కప్పం కట్టాలని బెదిరించిందని.. ఆ దెబ్బకి జాకీ వేరే రాష్ట్రానికి పారిపోయిందని లోకేష్ తెలిపారు. పేదలకు ఇచ్చే రేషన్ బియ్యాన్ని కూడా వదలలేదని.. రేషన్ బియ్యాన్ని కర్ణాటకకు తరలించి దోచుకుంటున్నారని.. ఇక్కడ ఉన్న మహిళా ఎమ్మెల్యే గారి దోపిడి మరో రకమని లోకేష్ తెలిపారు.

సహకార డైరీ పేరుతో మహిళల నుండి డ్వాక్రా సొమ్ము 10 కోట్లు వసూలు చేశారని.. ఆ డబ్బుతో డైరీ ఏర్పాటు చేస్తూ సొంత సొమ్ము తో ప్రజల్ని ఉద్దరిస్తున్నట్టు చూపిస్తున్నారని లోకేష్ తెలిపారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన పరిలాట సునీతను వద్దనుకుని తన్నే దున్నపోతును తెచ్చుకున్నారని లోకేష్ అన్నారు.అభివృద్ధి లో సునీతమ్మ స్పీడ్ అందుకోవడం ఎవరి వల్లా కాదని.. ప్రతిపక్షంలో ఉన్నా సునీతమ్మ ప్రజలు, రైతులకు అండగా పోరాటం చేసారని లోకేష్ గుర్తు చేసారు.టిడిపి హయాంలో రాప్తాడు నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం 5 వేల కోట్లు ఖర్చు చేసామని.. రూ. 804 కోట్లతో జీడిపల్లి రిజర్వాయర్ నుంచి పేరూరు ప్రాజెక్టు వరకు కాలువ తవ్వడంతో పాటు.. పుట్టకనుమ, సోమరవాండ్లపల్లి ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు మంజూరు చేసామని లోకేష్ తెలిపారు.

టీడీపీ హయాంలోనే.. హంద్రీనీవా కాలువ పనులు పూర్తి చేసి.. నియోజకవర్గంలోని 45 చెరువులకు, 120 చెక్ డ్యామ్ లకు సాగునీరు ఇవ్వడం జరిగిందని లోకేష్ తెలిపారు. రోడ్లు, ప్రభుత్వ భవనాలు, కాలేజీలు అన్నీ టిడిపి హయాంలో కట్టినవేనని లోకేష్ చెప్పారు. నియోజకవర్గంలో రోడ్లు వెయ్యడానికి కేటాయించిన 46 కోట్ల విలువైన పనులను కూడా .. కమిషన్ కక్కుర్తితో దోపిడీదుర్తి కుటుంబం ఆపేసిందని లోకేష్ తెలిపారు. రాప్తాడు నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీర్చేందుకు ప్రతి ఇంటికి నీటి కుళాయి ఏర్పాటు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.

అధికారంలోకి వస్తే జీడిపల్లి పేరూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తిచేస్తామని జగన్ అన్నారని.. పుట్టకనుమ రిజర్వాయర్ ను క్యాన్సిల్ చేసి దానికి స్థానంలో తోపుదుర్తి, ముట్టాల, దేవరకొండ జలాశయాలకు శంకుస్థాపనకు చేశారని లోకేష్ తెలిపారు. శంకుస్థాపన చేసి రెండున్నర సంవత్సరాలు పూర్తవుతున్నా ఇప్పటివరకు ఒక్క ఎకరా భూ సేకరణ కూడా పూర్తి చేయలేదని లోకేష్ విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పేరూరు ప్రాజెక్టు కాలువ పనులు పూర్తి చేయడంతో పాటు సోమరవాండ్లపల్లి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని.. భూములు ఇచ్చిన రైతులకు పరిహారం అందిస్తామని లోకేష్ అన్నారు.

నియోజకవర్గంలో రైతులను దోపిడీదుర్తి కుటుంబం గాలికొదిలేసిందని.. అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల్ని ఆదుకోలేదని.. టమాటో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని లోకేష్ తెలిపారు. మార్కెటింగ్, కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయమని అడిగినా .. జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. చీనీ, టమోటా, వేరుశనగ రైతులను టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆదుకుంటామని లోకేష్ భరోసా ఇచ్చారు. రాప్తాడు నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించే బాధ్యతను తీసుకుంటానని లోకేష్ తెలిపారు. టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వేధించిన వారిని వదిలిపెట్టనని లోకేష్ హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి ని భారీ మెజారిటీ తో గెలిపించాలని.. నియోజకవర్గ సమస్యలు పరిష్కరించే బాధ్యత స్వయంగా తీసుకుంటానని.. లోకేష్ భరోసా ఇచ్చారు.

 

Related post

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరు నగరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నగర ఇన్‌చార్జ్‌ ,మాజీమంత్రి పొంగూరు నారాయణ, సతీమణి రమాదేవి కలిసి పలు చోట్ల.. వినాయక స్వామివారిని…
శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకుని క్షేత్రం

శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకుని క్షేత్రం

హిందువులకు అత్యంత ముఖ్యమైన ఆరాధ్య దైవం విఘ్నేశ్వరుడు. సకల శుభంకరుడు.. సకల గణాలకు నాయకుడు గణేశుడు. అంతే కాదు.. లయకారుకుడైన ఆదిశంకరుడు, జగన్మాతల ముద్దుబిడ్డ వినాయకుడు. శివుని ఆదేశాలతో…
పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

టీడీపీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది. కానీ, వాటన్నంటినీ ఎదుర్కొని పార్టీని సమర్థవంతంగా ముందుండి నడిపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కానీ, ఇప్పుడు ఆయనకే కష్టం వచ్చింది. అక్రమ అరెస్ట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *