
వైసీపీ నేతల చేతిలో హత్యకి గురైన టిడిపి కార్యకర్త భార్య ధనలక్ష్మమ్మ రూ.5 లక్షలు అందజేసిన లోకేష్
- Ap political StoryNewsPolitics
- June 17, 2023
- No Comment
- 15
ఫ్యాక్షనిస్ట్ వైఎస్ జగన్ రెడ్డి పాలకుడయ్యాడు. రాజకీయ ప్రత్యర్థులని వెంటాడి వెతికి మరీ హత్యలు చేసేందుకు వైసీపీ నేతలకి లైసెన్సు ఇచ్చేశాడు. జగన్ రెడ్డి సీఎం అయిన వెంటనే కరడుగట్టిన టిడిపి నేతలు, కార్యకర్తల్ని వైసీపీ చంపడం మొదలుపెట్టింది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగరం మండలం మినగల్లు గ్రామానికి చెందిన సీనియర్ టిడిపి కార్యకర్త చిట్టిబోయిన పెద్ద వెంగయ్యని వైసీపీ నేతలు అత్యంత దారుణంగా హతమార్చారు.
వైసీపీ ఇంటి పెద్దని అంతమొందిస్తే, ఆ కుటుంబాన్ని ఆదుకునే బాధ్యతని తెలుగుదేశం తీసుకుంది. యువగళం పాదయాత్రలో భాగంగా అనంతసాగరంలో శుక్రవారం నిర్వహించిన బహిరంగసభలో మృతుడు భార్య ధన లక్ష్మమ్మకి రూ.5లక్షలు ఆర్థిక సాయాన్ని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అందజేశారు. తెలుగుదేశం కార్యకర్తలంతా ఒక కుటుంబమని, ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునే బాధ్యత తమదేనని లోకేష్ భరోసా ఇచ్చారు.