నారా లోకేష్ కు అపూర్వ స్వాగతం నెల్లూరులో ఎగసిన జన కెరటాలు

నారా లోకేష్ కు అపూర్వ స్వాగతం నెల్లూరులో ఎగసిన జన కెరటాలు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్ర.. అభిమాన సంద్రం మధ్య దిగ్విజయంగా దూసుకుపోతోంది. నాలుగేళ్ల జగన్ సర్కార్ అవినీతి, అసమర్థత, అభివృద్ధి రహిత పాలనను ప్రజలకు వివరిస్తూ.. నారా లోకేష్ ముందుకు సాగుతున్నారు. రాయలసీమలో దిగ్విజయంగా యువగళం పాదయాత్రను ముగించుకుని.. సర్వేపల్లి నియోజకవర్గం నుంచి .. జూలై 2న నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. నెల్లూరు జిల్లాలో ప్రవేశించిన నారా లోకేష్ పాదయాత్రకు.. టీడీపీ నేతలు, కార్యకర్తల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. నెల్లూరు స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆయన సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తమ శ్రేణులతో కలిసి లోకేశ్ కు అపూర్వ స్వాగతం పలికారు. యువ నేత నారా లోకేష్ రాకతో నెల్లూరు రూరల్ జనసంద్రంగా మారింది.

లోకేష్ పాదయాత్ర నెల్లూరు రూరల్ లో ఎంటర్ అవ్వడంతో.. ఇప్పటివరకు ఎక్కడ కూడా లేని విధంగా.. స్థానిక నేతలు, కార్యకర్తలు, అభిమానులు లోకేష్‌కు స్వాగతం పలికారు. టి‌డి‌పి సీనియర్ నేతలు, ఎమ్మెల్యే కోటంరెడ్డి ఇమేజ్ తోడు కావడంతో.. .. నారాలోకేష్ పాదయాత్రకు.. ఎన్నడూ లేనంత.. భారీ స్థాయిలో జనం తరలి వచ్చారు. భారీ స్థాయిలో కళాకారులు తమ కళారూపాలు ప్రదర్శిస్తుండగా, లోకేశ్ ను తమ నియోజకవర్గంలోకి స్వాగతించారు. పాట కచేరీలు, తప్పెట్లు, కేరళ వాయిద్యాలతో హోరెత్తించారు. లోకేశ్ ను ప్రత్యేకంగా తయారుచేసిన బేబీ కార్న్ కండెలతో చేసిన భారీ హారంతో గౌరవించారు. బూడిద గుమ్మడికాయలతో మరో హారం రూపొందించి లోకేశ్ కు నరదృష్టి సోకకుండా నివారణ చేశారు. లోకేష్ రాక నేపథ్యంలో, నెల్లూరు రూరల్ ప్రాంతంలో ఎటు చూసినా జనం, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కనిపించాయి. తమ అభిమాన నేత లోకేశ్ ను చూసేందుకు వచ్చిన జనంతో .. నెల్లూరు రూరల్ రోడ్లు క్రిక్కిరిసిపోయాయి.

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రవేశించిన యువగళం పాదయాత్రను ‘న భూతో న భవిష్యతి’ అనే విధంగా నిర్వహించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు చర్చించుకునే విధంగా.. యాత్రను విజయవంతం చేసేందుకు.. ఎమ్మెల్యే కోటంరెడ్డి పిలుపునివ్వడంతో.. వేలాదిగా రోడ్ల పైకి వచ్చిన ప్రజలు, వేల మంది యువత, మహిళలతో లోకేశ్ యువగళం జాతరను తలపించింది. మహిళలు, యువత, వృద్ధులను నారా లోకేశ్ ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ పాదయాత్రలో ఆనం రామనారాయణరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. యువగళం పాదయాత్రను చూస్తే..ఆంధ్రప్రదేశ్ లో.. తెలుగుదేశం పార్టీకి ఆదరణ మరింత పెరిగిందని, సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పదికి పది స్థానాల్లో టీడీపీ విజయభేరి ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నారా లోకేష్ పాదయాత్రకు వచ్చిన జనం చూసి.. నెల్లూరు రూరల్ టి‌డి‌పి కేడర్ లో జోష్ నెలకొంది.

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *