వెంకటగిరి బహిరంగ సభలో నారా లోకేష్…

వెంకటగిరి బహిరంగ సభలో నారా లోకేష్…

వెంకటగిరి అదిరిపోయింది. వెంకటగిరి పట్టు చీర కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. కాశీ విశ్వనాధుడి ఆలయం, శ్రీ పోలేరమ్మ ఆలయం, పెంచలకోన లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం ఉన్న పుణ్య భూమి వెంకటగిరి. కమలమ్మ జీడిపప్పు మైసూర్పాక్ ఎంత స్వీట్ గా ఉంటుందో ఇక్కడి ప్రజలు అంత స్వీట్ గా ఉంటారు. వెంకటగిరి పవర్ ఫుల్ నేల… ఇక్కడి నుండి ఎంతో మంది మంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న వెంకటగిరి గడ్డ పై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం. యువగళం.. మనగళం.. ప్రజాబలం. యూత్ పవర్ కి ప్యాలస్ పిల్లి భయపడింది. యువగళాన్ని అడ్డుకోవడానికి పోలీసుల్ని పంపాడు.. మనం ఆగలేదు. యువగళాన్ని తొక్కేయండని సైకోలను పంపాడు.. మనం తగ్గలేదు. ఆఖరికి పీకేది ఏమి లేక కోడికత్తి బ్యాచ్ ని పంపి కోడిగుడ్డు వేయించాడు.

కోడిగుడ్డు వేసిన వాడి మొఖం మీద మన వాళ్లు రిటర్న్ గిఫ్ట్ గా ఆమ్లెట్ వేసి పంపారు. ప్యాలస్ పిల్లి దాక్కొని దాడులు చేయిస్తుంది. దమ్ముంటే నువ్వే రా జగన్ తేల్చుకుందాం. భయం మా బయోడేటాలో లేదు బ్రదర్. సాగనిస్తే పాదయాత్ర… అడ్డుకుంటే దండయాత్ర. అడ్డొస్తే ఆగిపోయేవాడిని కాదు. అడ్డొచ్చినవాడిని తొక్కుకుంటూ పోయే ఫైటర్ ని. మీ లోకేష్ ది అంబేద్కర్ గారి రాజ్యాంగం.. జగన్ ది రాజారెడ్డి రాజ్యాంగం. మీ లోకేష్ ది లోకల్… జగన్ ది ప్యాలస్. మీ లోకేష్ ది యువగళం… జగన్ ది పరదాల బ్రతుకు. మీ లోకేష్ అందరి వాడు.. జగన్ అమ్మని, చెల్లిని గెంటేసిన వాడు. ఒక్క ఛాన్స్ ఇస్తే జగన్ చేసింది ఏంటి? సాధించింది ఏంటి? ఏపీని పాత బీహార్ లా మార్చేసాడు.

జగన్ మొదట దళితుల పై దాడులు చేయించాడు. దళితుల్ని చంపాడు. అప్పుడు మిగిలిన వాళ్ళు మేము దళితులం కాదులే అని మౌనంగా ఉన్నారు. అప్పుడు జగన్ మైనార్టీల పై దాడి చేసాడు. మైనార్టీలను చంపాడు. మైనార్టీలను చంపితే మనకెందుకులే అని అంతా అనుకున్నారు. అప్పుడు జగన్ కన్ను బీసీల పై పడింది. బీసీలను వేధించడం మొదలు పెట్టాడు. బీసీలపై కదా అని ఇతర వర్గాలు సైలెంట్ గా ఉన్నాయి. మనల్ని కాదు కదా అని ఎవరూ మాట్లాడలేదు, ఎవరూ పోరాడలేదు. ఎవరూ మాట్లాడటం లేదు కదా అని జగన్ ఇప్పుడు మహిళల్ని, పిల్లల్ని కూడా వదలడం లేదు. అంద‌రినీ అంతం చేస్తున్నాడు. చంపేసి ప్రాణానికి ఖ‌రీదు క‌డుతున్నాడు. రేప్ జరిగితే మానానికి విలువ క‌డుతున్నాడు. గంట‌కో హ‌త్య‌.. పూట‌కో రేప్… కిడ్నాప్‌. అడుగ‌డుగునా దౌర్జ‌న్యాలు.. ప్ర‌తీ ఊరిలోనూ క‌బ్జాలు.. గంజాయి.. నేర‌గాళ్లు చెల‌రేగిపోతుంటే ఏ ముఖ్య‌మంత్రి అయినా డిజిపితో స‌మీక్ష నిర్వ‌హించి నేరాలు క‌ట్ట‌డి చేయాల‌ని ఆదేశిస్తారు. కానీ జగన్ మాత్రం తియ్యబోయే సినిమా పై రామ్ గోపాల్ వర్మ తో సమీక్షా సమావేశం పెట్టుకున్నాడు.

15 ఏళ్ల పిల్లాడిని పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేస్తే నో సీఎం. అమర్నాధ్ గౌడ్ చేసిన తప్పేంటి? తన అక్కని వేధిస్తున్న వైసిపి కార్యకర్త వెంకటేశ్వర రెడ్డి ని అడ్డుకున్నాడు. వైసిపి సైకో గ్యాంగ్ అమర్నాధ్ పై దాడి చేసి కాళ్ళు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టేసారు. కనీసం అమర్నాధ్ ఇంటికి వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి సీఎం కి మనస్సు రాలేదు. దానికి కారణం అమర్నాధ్ ఒక బీసీ. బీసీ లు అంటే జగన్ కి చిన్న చూపు. అందుకే అమర్నాధ్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లలేదు. కర్నూలు లో నేను పాదయాత్ర చేస్తున్న సంధర్భంలో రాము ఆయన భార్య నాకు స్వాగతం పలికి హారతి ఇచ్చారు. అది చూసి వైసిపి నేతలు తట్టుకోలేకపోయారు. ఎన్నో ఏళ్లుగా అక్కడే కూరగాయల వ్యాపారం చేసుకుంటున్న రాము షాప్ ని ధ్వంసం చేయించాడు వైసిపి కార్పొరేటర్ కృష్ణ కాంత్. జగన్ పడగొడితే… లోకేష్ నిలబెడతాడు. రాము కుటుంబానికి నేను అండగా ఉంటా త్వరలోనే రాము కొత్త షాప్ ఓపెన్ అవుతుంది. టిడిపి విశాఖ‌ని ఆర్థిక రాజ‌ధానిగా అభివృద్ధి చేసింది. వైసీపీ విశాఖని క్రైమ్ కేపిట‌ల్ గా మార్చేసింది. సొంత పార్టీ ఎంపీ కొడుకు, భార్య‌, ఆడిట‌ర్ జీవి కిడ్నాప్ అయ్యారు. అది కిడ్నాప్ కాదు జే గ్యాంగ్ సెటిల్మెంట్ అని ఎంపీ ఎంవీవీ మాటల్లో తేలిపోయింది.

జగన్ పాలన ఎంత దరిద్రంగా ఉందొ స్వయంగా వైసిపి ఎంపీ ప్రకటించారు. చంద్రన్న సంపద సృష్టికర్త… జగన్ అప్పుల అప్పారావు. చంద్రన్న విజనరీ… జగన్ ప్రిజనరి. చంద్రన్న ది ముందు చూపు… జగన్ ది మందు చూపు. టిడిపి అంటే తెలుగు వారి ఆత్మగౌరం… వైసిపి అంటే గలీజు పార్టీ. కరెంట్ తీగ కాదు బిల్లు పట్టుకుంటే షాక్ కొట్టేలా చేసాడు జగన్. మే కరెంట్ బిల్లు పట్టుకుంటే షాక్ కొట్టిందా? ఒక్క మే నెలలో జగన్ బాదుడు ఎంతో తెలుసా? రూ.11,300 కోట్లు. ఒక సారి ట్రూ అప్ ఛార్జీలు, రెండు సార్లు అడ్జెస్ట్మెంట్ ఛార్జీలు పెంచాడు. సీఎం గా ప్రమాణస్వీకారం చేస్తూ విద్యుత్ బిల్లులు తగ్గించేస్తా అన్నాడు. ఇప్పుడు వందల్లో బిల్లు వచ్చే వారికి వేలల్లో వస్తుంది. వైసిపి ఫ్యాన్ పర్మినెంట్ గా స్విచ్ ఆఫ్ చెయ్యండి మీపై పడిన భారం తగ్గుతుంది. జగన్ కి ఒక జబ్బు ఉంది. మైథోమానియా సిండ్రోమ్ (mythomania syndrome) తో జగన్ బాధపడుతున్నాడు. ఈ జబ్బు లక్షణాలు ఏంటో తెలుసా? ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు అబద్దాలు చెప్పడం ఈ జబ్బు లక్షణం.

మైథోమానియా సిండ్రోమ్ వలనే జగన్ నేను పేదవాడ్ని అంటూ పదే పదే అబద్దం చెబుతున్నాడు. లక్ష కోట్లు ఆస్తి ఉన్నా, లక్ష రూపాయల చెప్పులు వేసుకొని తిరుగుతున్నా, వెయ్యి రూపాయల వాటర్ బాటిల్ తాగుతున్నా పేదవాడ్ని అంటూ అబద్దం చెబుతాడు. బెంగుళూరు లో ప్యాలస్, హైదరాబాద్ లో ప్యాలస్, తాడేపల్లి లో ప్యాలస్, ఇడుపులపాయలో ప్యాలస్, ఇప్పుడు వైజాగ్ లో మరో ప్యాలస్ కడుతున్నాడు. ఇన్ని ప్యాలస్ లు ఉన్నా పేదవాడ్ని అని చెబుతాడు. సిమెంట్ కంపెనీలు, పవర్ ప్లాంట్లు, సొంత టివి, ఛానల్ ఉన్నా పేదవాడ్ని అని చెబుతాడు. మైథోమానియా సిండ్రోమ్ వలన జగన్ అబద్దాలు చెబుతూ అబద్దంలోనే బ్రతికేస్తాడు. జగన్ కట్టింగ్ అండ్ ఫిట్టింగ్ మాస్టర్. ఫిట్టింగ్ ఎలా ఉంటుందో చెబుతా. జగన్ కి రెండు బటన్స్ ఉంటాయి. ఒకటి బ్లూ బటన్. రెండోవది రెడ్ బటన్. బ్లూ బటన్ నొక్కగానే మీ అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. రెడ్ బటన్ నొక్కగానే మీ అకౌంట్ నుండి 100 రూపాయలు పోతుంది. అది ఎలాగో మీకు చెబుతా. విద్యుత్ ఛార్జీలు 9 సార్లు బాదుడే బాదుడు, ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు బాదుడే బాదుడు, ఇంటి పన్ను బాదుడే బాదుడు, చెత్త పన్ను బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్ ధరలు బాదుడే బాదుడు, నిత్యావసర సరుకుల ధరలు బాదుడే బాదుడు. మీకు ఇంకో ప్రమాదం కూడా ఉంది త్వరలోనే వాలంటీర్ వాసు మీ ఇంటికి వస్తాడు. మీరు పీల్చే గాలిపై కూడా పన్నేస్తాడు. జైల్ జగన్ కి దమ్ముంటే ఇంటికి స్టిక్కర్ కాదు కరెంట్ బిల్లుకి, బస్సు టికెట్ మీద, పెట్రోల్, డీజిల్ బిల్లు మీద, చెత్త పన్ను మీద, ఇంటి పన్ను మీదా స్టిక్కర్ వెయ్యాలి.

జగన్ కట్టింగ్ మాస్టర్. అది ఎలాగో చెబుతాను. అన్న క్యాంటిన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న భీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్, ఫీజు రీయింబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్లు కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్. 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం ఈ జైల్ జగన్. జగన్ మహిళల్ని నమ్మించి ముంచేసాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు ఎం మొఖం పెట్టుకొని ఓట్లు  అడుగుతున్నాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సి, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తా అని మోసం చేసాడు.

కష్టాలు చూసాను… కన్నీళ్లు తుడుస్తాను. భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించాం. మహాశక్తి పథకం కింద… 1) ఆడబిడ్డ నిధి:- 18 ఏళ్లు నిండిన మహిళలకు – నెలకు రూ.1500 అంటే ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు. 2) తల్లికి వందనం:- ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు 3) దీపం పథకం:- ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం 4) ఉచిత ప్రయాణం:- మహిళలకు ఉచిత ప్రయాణం. జగన్ యువత ఎప్పటికీ పేదరికంలో ఉండాలని కోరుకుంటున్నాడు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్ పధకం రద్దు చేసాడు.

యువగళాన్ని విన్నాం. ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి ద్వారా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. నిరుద్యోగ యువతకు యువగళం నిధి కింద నెలకు రూ.3000 ఇస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం. జగన్ రైతులు లేని రాజ్యం తెస్తున్నాడు. జగన్ పరిపాలనలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో రైతులు నష్టపోతున్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ నంబర్ 3, కౌలు రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 2. రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మీటర్లు పెడుతున్నాడు. మీటర్లు రైతులకు ఉరితాళ్లు.

రైతుల బాధలు చూసాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాతకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం. జగన్ ఉద్యోగస్తులను వేధిస్తున్నాడు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని 200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. జీతం ఒకటో తారీఖున వచ్చే దిక్కు లేదు. పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు. పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడు. నేను ప్రతి రోజూ మాట్లాడుతుంటే భయపడి కొంత బకాయి తీర్చాడు. ఇంకా రావాల్సింది చాలా ఉంది.ఆఖరికి పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వలేని చెత్త ప్రభుత్వం ఇది. బీసీలు పడుతున్న కష్టాలు నేను చూసాను. 26 వేల అక్రమ కేసులు, నిధులు, కుర్చీలు లేని కార్పొరేషన్లు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపకులాల వారీగా నిధులు, బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం.

డాక్టర్ సుధాకర్ దగ్గర నుండి డాక్టర్ అచ్చెన్న వరకూ జగన్ పాలనలో దళితుల్ని ఎలా చంపారో చూసారు. దళితుల్ని చంపడానికి జగన్ వైసిపి నాయకులకు స్పెషల్ లైసెన్స్ ఇచ్చాడు. 27 దళిత సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులను వేధించిన వారిని కఠినంగా శిక్షిస్తాం. జగన్ రద్దు చేసిన 27 దళిత సంక్షేమ కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తాం. జగన్ పాలనలో మైనార్టీలను చిత్ర హింసలకు గురిచేసాడు. అబ్దుల్ సలాం, కరీముల్లా, ఇబ్రహీం, మిస్బా, హాజిరా. ఇలా ఎంతో మంది బాధితులు. మైనార్టీలకు ఉన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. దుల్హన్, విదేశీ విద్య, రంజాన్ తోఫా, ఇమామ్, మౌజమ్ లకు గౌరవ వేతనం, మసీదుల అభివృద్ధి కి నిధులు కూడా ఇవ్వడం లేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పాత పధకాలు అమలు చెయ్యడంతో పాటు, ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం. యానాదుల సంక్షేమ కార్యక్రమాలు అన్ని రద్దు చేసారు. వారి భూములు వైసిపి నాయకులు లాక్కుంటున్నారు.

ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టించారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే యానాదుల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తాం. రెడ్డి సోదరులు కూడా ఆలోచించాలి. 2019 ఎన్నికల్లో మీరు ఎంతో కష్టపడి డబ్బు ఖర్చు చేసి జగన్ ని గెలిపించుకున్నారు. ఇప్పుడు మీకు కనీస గౌరవం అయినా ఉందా. నాడు-నేడు అన్ని సామాజిక వర్గాలకు సమాన గౌరవం ఇచ్చింది ఒక్క టిడిపి మాత్రమే.వెంకటగిరిని అభివృద్ధి లో పరుగులు పెట్టిస్తారు అని మీరు వైసిపి కి ఓటు వేసారు. కానీ జగన్ వెంకటగిరి కి ఇచ్చింది గుండు సున్నా. నియోజకవర్గాన్ని అభివృద్ధి చెయ్యమని అడిగినందుకు ఆనం రామనారాయణ రెడ్డి గారిని వేధించారు. వెంకటగిరి కి నిధులు ఇవ్వమని అడిగినందుకు నిందలు వేసారు. సైకో ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు సస్పెండ్ చేసారు. ఇప్పుడు ఏకంగా ఆనం గారి కుటుంబాన్ని అవమానపరుస్తూ వైసిపి నాయకులు మాట్లాడుతున్నారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారికి మంచి పేరు ఉంది. కానీ ఆయన ఆశయాలను గాలికి వదిలేసారు రామ్ కుమార్ రెడ్డి. ఎమ్మెల్యే టికెట్ కోసం అరాచకశక్తులను పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు.

రామ్ కుమార్ రెడ్డి గారి గురించి తెలుసుకున్న తరువాత ఆశ్చర్యం వేసింది. ఆయన ముందు ఎవరూ కూర్చో కూడదు అంట నిలబడి మాట్లాడాలి అంట. ప్రశాంతంగా ఉండే వెంకటగిరిని వైసిపి నాయకులు దౌర్జన్యాలు, భూకబ్జాలు, ఎర్రచందనం స్మగ్లింగ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చారు. కలువాయి మండలంలో వైసిపి నేతలు 600 ఎకరాలు కబ్జా చేసారు. ఎమ్మెల్యే గారికి తెలిసి కొన్ని పట్టాలు రద్దు చేయించగలిగారు. ప్రస్తుతం లోకాయుక్తా లో కేసు నడుస్తుంది. వైసిపి నేతలు పెన్నా నది నుండి ఇసుకను దోపిడీ చేస్తున్నారు. వెంకటగిరి, రాపూరు, కలువాయి, డక్కిలి, బాలాయపల్లి, సైదాపురం మండలాల్లో వేలాది ఎకరాల ప్రభుత్వ భూమిని వైసిపి నేతలు కబ్జా చేసారు. దళితుల భూములు కూడా వదలడం లేదు. వెంకటగిరి టైలర్స్ కాలనీలో పార్కులు, గుడులు, బడులు కోసం వదిలిన స్థలాన్ని వైసిపి లీడర్స్ ప్లాట్లు వేసి అమ్మేసారు. నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి రైట్ హ్యాండ్ ఎల్. కె. ఆర్. పోలీస్ స్టేషన్ల లో పంచాయతీల నుండి ఎర్రచందనం, ఇసుక, గ్రావెల్ దందా మొత్తానికి డాన్ ఆయనే.

ఈ ఎల్. కె. ఆర్ వెంకటగిరి బజార్ సెంటర్ లో 10 కోట్లతో అక్రమంగా ఒక భవనం కూడా నిర్మించాడు. వెంకటగిరి మున్సిపాలిటీ లో బిల్డింగ్ కట్టాలంటే వైసిపి నేతలకి కప్పం కట్టాల్సిందే. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేసిన శ్యాంప్రసాద్ రెడ్డి ఏకంగా సోమశిల కెనాల్ ని ఆకిల వలస దగ్గర పూడ్చి పెట్టాడు. వెంకటగిరి కి జగన్ అనేక హామీలు ఇచ్చాడు. ఆగిపోయిన ఎస్ఎస్ కెనాల్ పనులు పూర్తి చేసి వెంకటగిరి, డక్కిలి, రాపూరు మండలాలకు సాగునీరు ఇస్తాం అన్నాడు. ఆగిపోయిన బిహెచ్ఈఎల్ కంపెనీ నిర్మాణాన్ని పూర్తిచేస్తాం అని హామీ ఇచ్చాడు. వెంకటగిరి నుండి నాయుడుపేట కు వెళ్లే దారిలో రైల్వే బ్రిడ్జి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టుకోలేని అసమర్ధ సీఎం జగన్.

టిడిపి హయాంలోనే వెంకటగిరి అభివృద్ధి జరిగింది. రూ.3 వేల కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. సిసి రోడ్లు, పేదలకు టిడ్కో ఇళ్లు, సాగు, తాగునీటి ప్రాజెక్టులు నిర్మించింది టిడిపి. టిడిపి హయాంలో ప్రారంభించిన ఆల్తూరుపాడు రిజర్వాయర్ ని జగన్ ప్రభుత్వం ఆపేసింది. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు పూర్తి చేసి సాగు,తాగు నీరు అందిస్తాం. సోమశిల హై లెవల్ కెనాల్ పూర్తిచేస్తాం. పెండింగ్ లో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. వాటర్ గ్రిడ్ పధకం ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తాం. స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగాలు ఇస్తాం. ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తాం, ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేస్తాం. చేనేత కార్మికుల కష్టాలు నాకు తెలుసు. నూలు, కలర్ ఇతర సబ్సిడీలు అందిస్తాం. మగ్గం ఉన్న చేనేత కార్మికులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తాం. చేనేత కార్మికులకు టిడ్కో ఇళ్లు ఉచితంగా ఇస్తాం.

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు అందిస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేతను నేను దత్తత తీసుకుంటాను. మీ సంక్షేమం నా బాధ్యత. నిమ్మ, బెంగాల్ గ్రామ్, మినుము, పత్తి, వరి, హార్టీ కల్చర్ రైతుల సమస్యలు నాకు తెలుసు. పెట్టుబడి తగ్గించి గిట్టుబాటు ధర కల్పిస్తాం. టిడిపి కార్యకర్తల్ని వేధించిన ఎవరిని వదిలిపెట్టను. వెంకటగిరి లో ఉన్నా ఉగాండా పారిపోయినా పట్టుకొచ్చి లోపలేస్తా. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల్ని గుండెల్లో పెట్టుకుంటా. వైసిపి నాయకుల భూ అక్రమాల పై సిట్ వేసి ఆ భూములు వెనక్కి తీసుకోని పేదలకు పంచుతాం.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *