మోటార్లకు మీటర్లు బిగిస్తే పగులగొట్టండి  రైతులకు నారా లోకేష్ పిలుపు

మోటార్లకు మీటర్లు బిగిస్తే పగులగొట్టండి రైతులకు నారా లోకేష్ పిలుపు

ఉచిత విద్యుత్ రైతుల హక్కు
రైతులకు అండగా టిడిపి పోరాడుతుంది
ఒక్కో రైతుపై రూ. 2.50 లక్షల అప్పు
పెండింగ్ ప్రాజెక్ట్ లు పూర్తిచేసి ప్రతి ఏకరాకు సాగునీరు అందిస్తాం
మంత్రాలయం రైతులతో లోకేష్ ముఖాముఖీ

వ్యవసాయ పంపుసెట్ లకు మీటర్లు బిగిస్తే పగలగొట్టండి అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఆ రైతులకు టిడిపి మీకు అండగా పోరాడుతుంది అని హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా బుధవారం మంత్రాలయం నియోజకవర్గం లచ్చుమర్రి క్రాస్ వద్ద రైతులతో ముఖాముఖి సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు అడిగిన పలు ప్రశ్నలకు లోకేష్ సమాధానం ఇచ్చారు. ఉచిత విద్యుత్ అనేది రైతుల హక్కు.ఆ హక్కుని హరిస్తూ జగన్ రైతుల మోటర్లకి మీటర్లు బిగిస్తున్నాడు జగన్ అని లోకేష్ విమర్శించారు. పాదయాత్ర ద్వారా రైతులు పడుతున్న కష్టాలు నేరుగా తెలుసుకున్నాను.

వ్యవసాయ పనులు లేక గుంటూరు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి పనులు చేసుకుంటున్నారు. వాళ్ళతో మాట్లాడిన తరువాత వారి బాధలు తెలుసుకొని కన్నీళ్లు వచ్చాయి. నీళ్ళు ఇస్తే రాయలసీమ రైతులు బంగారం పండిస్తారు.రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల కోసం టిడిపి హయాంలో 11 వేల కోట్లు ఖర్చు చేసాం. జగన్ ప్రభుత్వం నాలుగేళ్లలో టిడిపి ప్రభుత్వం ఖర్చు చేసిన దానిలో పది శాతం కూడా ఖర్చు చెయ్యలేదు. డ్రిప్ ఇరిగేషన్ రద్దు చేసి రాయలసీమ రైతాంగాన్ని దెబ్బతీశారు. అకాల వర్షాలతో రైతులు నష్టపోతే కనీసం పంట నష్టం అంచనా వేసే దిక్కు లేదు. రైతుల రాజ్యం తెస్తానని, రైతులు లేని రాజ్యం తెచ్చాడు జగన్. ఏపి రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే 3 స్థానంలోనే ఉంది. కౌలు రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే 2 వ స్థానంలో ఉంది అని ఆవేదన వ్యక్తం చేశారు. టిడిపి హయాంలో సబ్సిడీ ధరకే విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అందజేసాం. రైతు రథాలు, డ్రిప్ ఇరిగేషన్ అందజేసాం.

రైతులు నష్టపోతే నష్ట పరహారాన్ని అందించింది టిడిపి ప్రభుత్వం. జగన్ నష్ట పరిహారం ఇవ్వడం లేదు. క్రాప్ ఇన్స్యూరెన్స్ పథకాన్ని రద్దు చేశారు.రూ.50 వేల లోపు రుణాలు అన్ని ఒకే సంతకంతో రద్దు చేసిన ఘనత టిడిపిదేనని పేర్కొన్నారు. టిడిపి హయాంలో రైతుల్ని ఆదుకోవడానికి ఇచ్చిన అన్ని సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశాడు జగన్. కోర్టు దొంగ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. రైతులు ఇబ్బందుల్లో ఉంటే ఆయన కోర్టు లో దొంగతనం చేసే పనిలో బిజీ గా ఉన్నారు. టిడిపి ప్రభుత్వంలో ఒక్కో రైతుపై రూ.70 వేలు అప్పు ఉంటే జగన్ పాలన లో ఒక్కో రైతు పై అప్పు రూ.2.50 లక్షలకు చేరిందని లోకేష్ చెప్పారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్టుబడి తగ్గించి, గిట్టుబాటు ధర కల్పిస్తాం.

ఉల్లి రైతులను ఆదుకోవడానికి కోల్డ్ స్టోరేజ్ లు ఏర్పాటు చేస్తాం. గిట్టుబాటు ధర ఇస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. నకిలీ విత్తనాలతో పత్తి రైతులు నష్టపోతే ప్రభుత్వం ప్రకృతి కారణంగా నష్టం వచ్చిందని కొట్టిపారేసింది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే నాణ్యమైన విత్తనాలు అందజేస్తాం. నకిలీ విత్తనాలు అమ్మే కంపెనీల పై చర్యలు తీసుకుంటాం. మిర్చి రైతులు అమ్ముకోవడానికి గుంటూరు వెళ్తున్నారు. అందుకే ఆదోనిలో మిర్చి యార్డు ఏర్పాటు చేస్తాం. మిరప రైతులను ఆదుకుంటాం. టొమాటో రైతులను ఆదుకోవడానికి ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజ్, టొమాటో వాల్యూ చైన్ ప్రాజెక్టు అమలు చేస్తాం. రైతులకు ఉచిత విద్యుత్ కూడా సరిగ్గా ఇవ్వలేని చెత్త ప్రభుత్వం జగన్ ది. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత పగలే ఉచిత విద్యుత్ అందజేస్తామని లోకేష్ వివరించారు. ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్న విష నాగు కుటుంబం ఎప్పుడైనా ముఖ్యమంత్రి ని కలిసి రైతులను ఆదుకోవాలి అని కోరారా? అని ప్రశ్నించారు. భూమి యజమానులకు ఇబ్బంది లేకుండా కౌలు రైతులను ఆదుకోవడం కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తాం.

టిడిపి హయాంలో పాడి రైతుల్ని ఆదుకున్నాం. సబ్సిడీ ధరకే మేత, దాణా అందించాం. పశువులు కొనడానికి సబ్సిడీ లో రుణాలు అందించాం. జగన్ పాలనలో పాడి రైతుల్ని కనీసం పట్టించుకోలేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో అందజేసిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు పాడి రైతులకు అందజేస్తామని లోకేష్ వెల్లడించారు. టిడిపి హయాంలో క్యూ లైన్లు లేకుండా విత్తనాలు, ఎరువులు అందించాం. ఇప్పుడు ఆర్బికే అంటూ హడావిడిగా కేంద్రాలు ప్రారంభించి పబ్లిసిటీ చేసుకోవడం తప్ప కనీసం అక్కడ విత్తనాలు, ఎరువులు ఇవ్వలేని దుస్థితి. ఆర్డీఎస్ రైట్ కెనాల్, గురురాఘవేంద్ర ప్రాజెక్టు, పులి కనుమతో పాటు అన్ని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం.

గోదావరి, కృష్ణా, పెన్నా నదులు అనుసంధానం చేసి రాయలసీమ రైతులకి సాగునీరు అందిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. సమావేశంలో మంత్రాలయం ప్రాంతానికి చెందిన రైతులు పలు ఇబ్బందులను లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. ఉల్లి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నాం. గిట్టుబాటు ధర ఉండటం లేదు. మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోతున్నాం. ఎకరాకు లక్ష రూపాయిలు పెట్టుబడి అవుతుంది. కనీసం అమ్ముకోవడానికి యార్డ్ లేక ఇబ్బంది పడుతున్నాం. అనేక జబ్బులు వస్తున్నాయి. తద్వారా దిగుబడి తగ్గిపోతుంది. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు రేట్లు జగన్ ప్రభుత్వంలో విపరీతంగా పెరిగిపోయాయి. కనీసం 9 గంటల ఉచిత విద్యుత్ కూడా సరిగ్గా ఇవ్వడం లేదు.

స్థానిక ఎమ్మెల్యే సాగునీరు ఇవ్వకుండా ప్రాజెక్టుల్లో చేపల పెంపకం చేపట్టి కోట్లు గడిస్తున్నాడు. కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నాం. టిడిపి ప్రభుత్వం వచ్చిన తరువాత మమ్మలని ఎలా ఆదుకుంటారు? జగన్ పాలనలో పాడి రైతులకు ఎటువంటి సహాయం అందడం లేదు.రైతు భరోసా కేంద్రాల్లో విత్తనాలు, ఎరువులు అందడం లేదు అని లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు.

Related post

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరు నగరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నగర ఇన్‌చార్జ్‌ ,మాజీమంత్రి పొంగూరు నారాయణ, సతీమణి రమాదేవి కలిసి పలు చోట్ల.. వినాయక స్వామివారిని…
శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకుని క్షేత్రం

శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకుని క్షేత్రం

హిందువులకు అత్యంత ముఖ్యమైన ఆరాధ్య దైవం విఘ్నేశ్వరుడు. సకల శుభంకరుడు.. సకల గణాలకు నాయకుడు గణేశుడు. అంతే కాదు.. లయకారుకుడైన ఆదిశంకరుడు, జగన్మాతల ముద్దుబిడ్డ వినాయకుడు. శివుని ఆదేశాలతో…
పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

టీడీపీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది. కానీ, వాటన్నంటినీ ఎదుర్కొని పార్టీని సమర్థవంతంగా ముందుండి నడిపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కానీ, ఇప్పుడు ఆయనకే కష్టం వచ్చింది. అక్రమ అరెస్ట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *