స్టిక్కర్ లు అతికిస్తే పీకిపారేయండి గార్లదిన్నే బహిరంగ సభలో నారా లోకేష్

స్టిక్కర్ లు అతికిస్తే పీకిపారేయండి గార్లదిన్నే బహిరంగ సభలో నారా లోకేష్

నువ్వే మా నమ్మకం, నువ్వే మా భవిష్యత్తు, జగన్ కి చెబుదాం అని మూడు కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు అంట.అందులో మొదటిది నువ్వే మా నమ్మకం కార్యక్రమం. నిన్ను కన్న అమ్మ నమ్మలేదు, తోడబుట్టిన చెల్లి షర్మిల, సునీత నిన్ను నమ్మలేదు, నీ బావలు బ్రదర్ అనిల్, రాజశేఖర్ రెడ్డి నిన్ను నమ్మలేదు. సొంత కుటుంబ సభ్యులే నమ్మని జగన్ ని జనం ఎందుకు నమ్మాలి? అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. యువగళం పాదయాత్రలో భాగంగా శుక్రవారం శింగనమల నియోజకవర్గం గార్లదిన్నే లో జరిగిన భారీ బహిరంగ సభలో లోకేష్ ప్రసంగించారు. వాలంటీర్ వాసు స్టిక్కర్ అతికిస్తే. ఆ స్టిక్కర్ పీకి సొంత కుటుంబమే నమ్మని జగన్ ని మేము ఎందుకు నమ్మాలి అని ప్రశ్నించండి అని లోకేష్ పిలుపునిచ్చారు. రెండో కార్యక్రమం మా భవిష్యత్తు నువ్వే.

రాష్ట్రం భవిష్యత్తు నాశనం చేసిన వాడు ప్రజలకు భవిష్యత్తు ఎలా ఇస్తాడు. గంజాయి అమ్ముతూ యువత భవిష్యత్తు నాశనం చేస్తున్న వ్యక్తి మీ భవిష్యత్తు ఎలా అవుతాడు? అప్పులు చేసి రాష్ట్రాన్ని ముంచేసిన జగన్ మీ భవిష్యత్తు ఎలా అవుతాడు? ఐటీ ఎక్స్ పోర్ట్స్ లో ఏపి ని జీరో చేసిన వాడు మీ భవిష్యత్తు ఎలా అవుతాడు? అని లోకేష్ ప్రశ్నించారు. వాలంటీర్ వాసు స్టిక్కర్ అతికిస్తే. ఆ స్టిక్కర్ పీకి జగన్ మాకు పట్టిన దరిద్రం అని చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. ఇక మూడొవది జగన్ కి చెబుదాం? ఎం చెప్పాలి? ప్రత్యేక హోదా గురించి చెబుదామా? పోలవరం గురించి చెబుదామా? విశాఖ రైల్వే జోన్ గురించి చెబుదామా? విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి చెబుదామా? పెంచేసిన పన్నుల గురించి చెబుదామా? కోడి కత్తి డ్రామా గురించి చెప్పాలా? బాబాయ్ మర్డర్ గురించి చెప్పాలా? చెత్త పాలన గురించి ఏం చెబుతాం అని విమర్శించారు.

జగన్ చేసేవి అన్ని దొంగ పనులే అందుకే దొంగ మోహన్ అని పేరు పెట్టా. టెన్త్ ఫెయిల్ అయిన దొంగ మోహన్ కి అన్ని కన్నింగ్ తెలివితేటలేనన్నారు. దొంగ మోహన్ కి రెండు బటన్స్ ఉంటాయి. ఒకటి బ్లూ బటన్. రెండోవది రెడ్ బటన్. బ్లూ బటన్ నొక్కగానే మీ అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. రెడ్ బటన్ నొక్కగానే మీ అకౌంట్ నుండి 100 రూపాయలు పోతుంది. అది ఎలాగో మీకు చెబుతా. విద్యుత్ ఛార్జీలు 8 సార్లు బాదుడే బాదుడు, ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు బాదుడే బాదుడు, ఇంటి పన్ను బాదుడే బాదుడు, చెత్త పన్ను బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్ ధరలు బాదుడే బాదుడు, నిత్యావసర సరుకుల ధరలు బాదుడే బాదుడు. మీకు ఇంకో ప్రమాదం కూడా ఉంది త్వరలోనే వాలంటీర్ వాసు మీ ఇంటికి వస్తాడు. మీరు పీల్చే గాలిపై కూడా పన్నేస్తాడు అని వివరించారు. దొంగ మోహన్ వాలంటీర్ వాసు ని పంపి గోబెల్స్ ప్రచారం మొదలు పెట్టారు. వాలంటీర్లు మీ ఇంటికి వచ్చి టిడిపి గెలిస్తే సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తారు అని ప్రచారం చేస్తున్నారు. సంక్షేమాన్ని రాష్ట్రానికి పరిచయం చేసిందే టిడిపి బ్రదర్ జగన్. సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన హిస్టరీ దొంగ మోహన్ ది అని ఆయన పేర్కొన్నారు.

100 పధకాలు రద్దు

అన్న క్యాంటిన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న భీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్, ఫీజు రీయింబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్లు కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్. 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం గా దొంగ మోహన్ని గిన్నిస్ బుక్ లోకి ఎక్కించొచ్చు అని లోకేష్ ఎద్దేవ చేశారు. దొంగ మోహన్ యువతను చీట్ చేసాడు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్ పధకం రద్దు చేసాడు. ఖైదీలకు 2 వేల రూపాయల మెస్ ఛార్జీలు ఇస్తుంటే, విద్యార్థులకు మాత్రం వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తున్నాడు అని వివరించారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం. జగన్ విశాఖ, అనంతపురం, గుంటూరు లో మూసేసిన స్టడీ సర్కిల్స్ తిరిగి ప్రారంభించడంతో పాటు అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు అన్ని టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే క్లియర్ చేస్తామని హామీయిచ్చారు. దొంగ మోహన్ మహిళల తాళిబొట్లు కూడా తాకట్టు పెట్టాడు.

మద్యపాన నిషేధం తరువాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు మద్యాన్ని ఏరులై పారిస్తున్నాడు. మహిళల తాళిబొట్లు తాకట్టు పెట్టి 25వేల కోట్లు అప్పు తెచ్చాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సి, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తా అని మోసం చేసాడుఅని విమర్శించారు. టిడిపి అధికారంలోకి వచ్చాకా పన్నుల భారం తగ్గిస్తాం. నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. దొంగ మోహన్ రైతుల్ని కోలుకోలేని దెబ్బతీసాడని విమర్శించారు. దొంగ మోహన్ పరిపాలనలో పురుగుల మందులు పనిచేయవు. జగన్ బ్రాండ్లు ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్, ఆంధ్రా గోల్డ్ కొడితే మాత్రం పురుగులు చస్తాయన్నారు. రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మీటర్లు పెడుతున్నాడు. జగన్ పాలనలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు ఇస్తున్నాడు. ఇన్పుట్ సబ్సిడీ ఎత్తేశాడు. డ్రిప్ ఇరిగేషన్ కూడా ఎత్తేసాడని విమర్శించారు. రాయలసీమ లో 1000 అడుగుల వరకూ బోర్లు వేస్తే కానీ నీళ్లు రావు…,మరి కరెంట్ బిల్లు ఎంత వస్తుందో ఆలోచించండి.

మీటర్లు రాయలసీమ రైతులకు ఉరితాళ్లు అని హెచ్చరించారు. చీని, అరటి, వేరుశనగ, టమాటో రైతుల్ని మేము ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దొంగ మోహన్ ఉద్యోగస్తులను కూడా వేధించాడు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని 200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు. మీకు తెలియకుండా మీ వస్తువు దొంగిలిస్తే దొంగ అంటాం. ఏకంగా పోలీసుల డబ్బులే కొట్టేసాడు దొంగ మోహన్. పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడు అని ఆరోపించారు.

బీసీలకు శాశ్వత కులధృవీకరణ పత్రాలు

టిడిపి అధికారంలోకి రాగానే బీసీలమని ఆరు నెలలకోసారి కుల ధృవపత్రాలు తీసుకోవాల్సిన దుస్థితి లేకుండా చేస్తాం. వారికి శాశ్వత కుల ధృవ పత్రాలు అందిస్తామని లోకేష్ వెల్లడించారు. మొబైల్ లో ఒక్క బటన్ నొక్కగానే ఇంటికి బిసి కుల ధృవ పత్రాలు వచ్చే ఎర్పాటు చేస్తాం. అవి శాశ్వత కుల ధృవ పత్రాలు గా ఉపయోగపడేలా చట్టం లో మార్పులు తీసుకొస్తామని చెప్పారు. బీసీలకు బ్యాక్ బోన్ విరిచాడు స్కాం మోహన్. పేరుకే బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసారు. నిధులు కేటాయించలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్ కట్ చేసి 16,500 మందిని పదవులకు దూరం చేసాడు. బీసీలను అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 వేల అక్రమ కేసులు బీసీల పై పెట్టాడు. బీసిల రక్షణ కోసం ప్రత్యేక బీసీ రక్షణ చట్టం తీసుకొస్తామని వివరించారు. దామాషా ప్రకారం బీసీ ఉపకులాలకు నిధులు, రుణాలు ఇస్తామని చెప్పారు. నెల్లూరు జిల్లా చాటగొట్ల లో వైసిపి నేత ప్రభాకర్ ఒక బీసీ వడ్డెర మహిళకు అప్పు ఇచ్చాడు. ఆ డబ్బు తిరిగి ఇవ్వలేదని వివస్త్రను చేసి దూషించాడు. ఆ అవమానం భరించలేక ఆ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని హామీ ఇచ్చారు.

దళితులపై వైసిపి పాలనలో దమనకాండ కొనసాగుతూనే ఉందన్నారు. డాక్టర్ సుధాకర్ దగ్గర మొదలైంది. ఇప్పుడు డాక్టర్ అచ్చెన్న వరకూ వచ్చింది. ఇసుక అక్రమాలను ప్రశ్నించినందుకు వరప్రసాద్ కి గుండు కొట్టించారు, మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ ని కొట్టి చంపారు, జగన్ లిక్కర్ స్కామ్ పై పోరాడినందుకు ఓం ప్రతాప్ కి చంపేసారు. పెద్దిరెడ్డి అవినీతి పై పోరాడినందుకు జడ్జ్ రామకృష్ణ ని హింసించారు. ఒక్క కేసులో అయినా దళితుల పై దాడి చేసిన వారికీ శిక్ష పడిందా? సుబ్రహ్మణ్యం అనే దళిత యువకుడిని చంపేసిన ఎమ్మెల్సీ అనంతబాబు కి సన్మానం చేసి ఉరేగించారు. వైసిపి పాలనలో దళితులను చంపడానికి జగన్ స్పెషల్ లైసెన్స్ ఇచ్చారు. దళితులకు ఇచ్చిన 27 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు జగన్. అని ఆవేదన వ్యక్తం చేశారు.

మైనారిటీలకు మోసం

మైనారిటీలను వైసిపి ప్రభుత్వం దారుణంగా మోసం చేసింది. దుల్హన్, రంజాన్ తోఫా వంటి పథకాలు రద్దు చేశాడని లోకేష్ విమర్శించారు. మసీదు, ఈద్గా, ఖబర్ స్తాన్ ల అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కేటాయించలేదు.ఆత్మహత్య చేసుకోవడం మైనార్టీలు మహా పాపంగా భావిస్తారు. జగన్ రెడ్డి సీఎం అయ్యాక నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. కేవలం వైసీపీ నాయకుల వేధింపుల వల్లే వాళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఇబ్రహీం అనే ముస్లిం నేతను నరసరావుపేటలో దారుణంగా నరికి చంపేశారు. పలమనేరులో మిస్బా అనే పదో తరగతి చెల్లిని వైసీపీ నాయకుడు సునీల్ టీసీ ఇప్పించి, బలవంతంగా వేధించడంతో, చదువుకు దూరం చేయడంతో ఆత్మహత్య చేసుకుంది. కర్నూలులో హాజీరాని అత్యాచారం చేసి చంపేశారు. ఆమె తల్లికి కనీసం పోస్టుమార్టం రిపోర్ట్ ఇవ్వకుండా ప్రభుత్వం వేధించిందని ఆరోపించారు. టీడీపీ హయాంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసాం. హజ్ యాత్రకు సహాయం చేసాం. ఆనాడు బీజేపీ తో పొత్తు ఉన్నా మైనార్టీల పై ఒక్క దాడి జరగలేదు, ఒక్క సంక్షేమ కార్యక్రమం ఆపలేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రముఖులను అందించిన శింగనమల

రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, దేశానికి రాష్ట్రపతిగా నీలం సంజీవ రెడ్డి గారిని అందించిన నేల శింగనమల. పేద ప్రజల హక్కుల కోసం భూస్వాములు, పెట్టుబడిదారులతో పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన తరిమెల నాగిరెడ్డి గారు జన్మించిన ప్రాంతం ఇది అని లోకేష్ పేర్కొన్నారు. మొహరం సంతాప దినాలు ప్రారంభమయ్యే శ్రీ గుగూడు కుళ్లాయిస్వామి పవిత్ర పుణ్యక్షేత్రం ఉన్న స్థలం ఈ శింగనమల. ఇంత గొప్ప నేలపై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టమని లోకేష్ చెప్పారు. యువగళం దెబ్బకి జగన్ కి భయం పట్టుకుంది. నీది రాజారెడ్డి రాజ్యాంగం, నాది అంబేద్కర్ గారి రాజ్యాంగం అని ముందే చెప్పా. సాగనిస్తే పాదయాత్ర అడ్డుకుంటే దండయాత్ర అని చెప్పినా వినలేదు. మీ కోసం పోరాడుతున్న లోకేష్ ని అడ్డుకోవడానికి వెయ్యి మంది పోలీసుల్ని రంగంలోకి దింపాడు జగన్ అని వివరించారు. దాని రిజల్ట్ ఏంటో తెలుసా 4 ఎమ్మెల్సీలు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనం జగన్ కి 4 మొట్టికాయలు వేసారు. దెబ్బకి దెయ్యం దిగొచ్చింది అని విమర్శించారు.

దళితులకు న్యాయం చేయని ఎం‌ఎల్‌ఏ

శింగనమల ఎమ్మెల్యే పేరు జొన్నలగడ్డ పద్మావతి గారు. ఈవిడ ఎమ్మెల్యే అయితే ఇక్కడ దళితులకు న్యాయం జరుగుతుంది అనుకున్నారు. నియోజకవర్గం రూపు రేఖలు మారతాయి అనుకున్నారు. కానీ ఈమె పాలనలో దళితులకు అన్యాయమే జరిగింది అని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె చాలా బిజీగా ఉంటారు. వారంలో 5 రోజులు బెంగుళూరు, 2 రోజులు అనంతపురంలో ఉంటారు. ప్రజా సమస్యలు ఆమెకు పట్టవు. పేరుకే పద్మావతి గారు ఎమ్మెల్యే పెత్తనం అంతా ఆమె భర్త సాంబశివారెడ్డిదే. ఇప్పటి వరకూ ఉన్న రికార్డులను మీ నియోజకవర్గం బ్రేక్ చేసింది. మీకు మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు. పద్మావతి, ఆమె భర్త సాంబశివారెడ్డి, ఇంకో ఆరుగురు బంధువులు. సాంబశివారెడ్డి శింగనమలను కేక్ లా కట్ చేసి కుటుంబసభ్యులకు పంచేసారు అని ఆరోపించారు. శింగనమల – శ్రీరాంరెడ్డి, గార్లదిన్నె – నరేందర్‌రెడ్డి, బుక్కరాయసముద్రం – రమణారెడ్డి, నార్పల – రఘునాథరెడ్డి, పుట్లూరు – రాఘవరెడ్డి, యల్లనూరు – ప్రతాప్‌రెడ్డి అని వివరించారు.వీళ్లంతా ప్రభుత్వ భూములు, వివాదాలు ఉన్న భూములను కొట్టేస్తున్నారు. సుమారుగా 500 ఎకరాలు లేపేసి వాటాలు వేసుకొని పంచేసుకున్నారు.

నియోజకవర్గం లో ఇసుక, మట్టి ని ఘోరంగా దోచుకుంటున్నారు అని ఆరోపించారు. ఎన్నికల ముందు సొంత ఇల్లు లేదు అన్నవారు ఈ రోజు 25 కోట్లతో అదిరిపోయే ఇల్లు కట్టారు అని చెప్పారు. పామురాయి నుంచి ముచుకోట వరకు జాతీయ రహదారి నిర్మాణం జరుగుతోంది. ముందుగానే ఏ రహదారి డిపిఆర్ తెలుసుకుని ఆయా మార్గంలో భూములు కొట్టేశారు. అమ్మడానికి ఒప్పుకొని రైతులపైకి రెవెన్యూ అధికారుల్ని ఉసిగొల్పి లాక్కున్నారు. ఎంతవరకు వెళ్లారంటే భూమి అమ్మడానికి అంగీకరించని రైతుకు చెందిన పచ్చటి పొలాన్ని ట్రాక్టర్ తో తొక్కించారు. పుట్లూరు మండలంలో కాల భైరవ స్వామి ఆలయ పునరుద్ధరణకు గ్రామస్తులు చందాలు వేసుకుని నిధిని ఏర్పాటు చేసుకున్నారు. గుడి నిర్మాణానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించాలని సాంబశివరెడ్డి వద్దకు వెళితే రూ.10 లక్షలు కమిషన్ అడిగారు.సాంబశివారెడ్డి విద్యాశాఖ సలహాదారుడుగా పనిచేస్తూ ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలను బెదిరించి కోట్ల రూపాయలు కప్పం కట్టించుకున్నారు. ఈయన ఎంత గొప్ప సలహాదారుడంటే శింగనమల కెజిబివి హాస్టల్ లో ఒకే నెలలో రెండు సార్లు బాలికలకు పుడ్ పాయిజన్ అయ్యింది. కోడుమూర్తి గ్రామంలో 2.51 ఎకరాల ఎస్సిల స్మశానాన్నికబ్జా చేసారు. విండ్ మిల్, సోలార్ ప్రాజెక్టుల యాజమాన్యాలను బెదిరించి నెలకు కోటి రూపాయలు కొట్టేస్తున్నారు. బుక్కరాయసముద్రం మండలం భద్రంపల్లి లో రైతులకు చెందిన 18 ఎకరాల చుక్కల భూమి వైసిపి నాయకులు ఆక్రమించుకున్నారు అని ఆరోపణలు గుప్పించారు.

టిడిపి హయాంలోనే అభివృద్ధి

శింగనమలను అభివృద్ధి చేసింది టిడిపి. బుక్కరాయసముద్రం మండలం దెంతలూరు లో సెంట్రల్ యూనివర్సిటీ పనులు ప్రారంభించాం. వైసిపి వచ్చిన తరువాత ఆపేసారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేస్తాం. బుక్కరాయసముద్రం మండలం సిద్ధరామపురం లో పోలీసు క్వాటర్స్ నిర్మాణ పనులు ప్రారంభించాం. వైసిపి వచ్చిన తరువాత ఆపేసారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పనులు పూర్తి చేస్తాం. నార్పల క్రాస్ లో పాలిటెక్నిక్ కళాశాల నిర్మించాం. ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో చదివే బాలికల వసతి కోసం రూ. 2 కోట్ల వ్యయంతో నార్పల, శింగనమల లో హాస్టల్ నిర్మించడం జరిగింది అని లోకేష్ వివరించారు. అనంతపురం నుండి అరటి పండు విదేశాలకు ఎగుమతి అవుతుందంటే టిడిపి ముందు చూపే కారణం, టిడిపి ప్రభుత్వంలో విదేశాలకు అరటి ఎగుమతి చేసేందుకు జైన్, ఐఎంఎల్ కంపెనీలతో ఒప్పందం చేసుకోకముందు కేజీ అరటి రూ. 6 ఉండగా ప్రస్తుతం రూ. 32 ధర పలుకుతుందంటే చంద్రబాబు చలవేనన్నారు. గార్లదిన్నె మరియు శింగనమల మండల కేంద్రాలలో షాదీఖానాలను టిడిపి ప్రభుత్వం నిర్మించింది. మిగిలిన 10 శాతం పనులను వైసిపి పూర్తిచెయ్యలేదు. టిడిపి అధికారం వచ్చిన వెంటనే షాదీఖానాల నిర్మాణం పూర్తిచేస్తాం.

గండికోట-నిట్టూరు-బుక్కాపురం లిఫ్ట్ ఇరిగేషన్ పనులు టిడిపి ప్రభుత్వంలో వేగంగా జరిగాయి. ఇప్పుడు వైసిపి ప్రభుత్వం ఆ పనులు ఆపేసింది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పనులు పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. పుట్లూరు లిఫ్ట్ ఇరిగేషన్ కు వైసిపి నాయకులు శిలాఫలకం వేసి ఏడాదైనా డిపిఆర్ పూర్తి కాలేదు. కొర్రపాడు గ్రామము నందు ఎస్సీ బాలికల కోసం 20 కోట్ల గురుకుల పాఠశాలను దాదాపుగా 90 శాతం పనులను పూర్తి చేస్తే, ఇప్పటి వరకు మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేసి పాఠశాలను ప్రారంభిచలేదు. టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ పనులు పూర్తిచేస్తాం. చిత్రావతి నదిపై తాడిపత్రి-పులివెందుల వెళ్ళేందుకు ఏర్పాటు చేస్తున్న బ్రిడ్జ్ నిర్మాణ పనులు కమీషన్ల కోసం నిలిపివేసారు. వర్షాలు పడినప్పుడు ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. బ్రిడ్జ్ నిర్మాణాన్ని టిడిపి అదికారంలోకి వచ్చిన వెంటనే పూర్తిచేస్తామని వెల్లడించారు. అనంతపురం జిల్లా మా కుటుంబాన్ని ఆదరించింది. ఎంత చేసినా రుణం తీర్చుకోలేం. టిడిపి అధికారంలోకి వచ్చిన గతంలో చేసిన దాని కంటే రెట్టింపు అభివృద్ది చేస్తామని చెప్పారు. హంద్రీనీవా పనులు పూర్తి చేసి అనంతపురం లో సాగు, తాగు నీటి అవసరాలు తీరుస్తామన్నారు. టిడిపి కార్యకర్తల్ని వేధించిన ఎవరిని వదిలి పెట్టనని హెచ్చరించారు.

Related post

పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

టీడీపీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది. కానీ, వాటన్నంటినీ ఎదుర్కొని పార్టీని సమర్థవంతంగా ముందుండి నడిపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కానీ, ఇప్పుడు ఆయనకే కష్టం వచ్చింది. అక్రమ అరెస్ట్…
బాబుతో మాట్లాడతారనే భయంతో.. కోడికత్తి శ్రీనును విశాఖకు తరలింపు

బాబుతో మాట్లాడతారనే భయంతో.. కోడికత్తి శ్రీనును విశాఖకు తరలింపు

కోడికత్తి కేసు నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ ను మరో చోటకు షిఫ్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న శ్రీనివాస్ ను…విశాఖకు తరలించినట్లు తెలుస్తోంది.…
మూడో రోజు కూడా మాజీ మంత్రి నారాయణ హౌస్ అరెస్ట్

మూడో రోజు కూడా మాజీ మంత్రి నారాయణ హౌస్ అరెస్ట్

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నెల్లూరు వ్యాప్తంగా పలువురు టీడీపీ నాయకులను హౌస్​ అరెస్టు చేయడంతో పాటు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *