
వైసీపీ మాజీ మంత్రి అనిల్ కు.. నారా లోకేష్ మాస్ వార్నింగ్
- Ap political StoryNewsPolitics
- July 6, 2023
- No Comment
- 22
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నెల్లూరులో ప్రకంపనలు సృష్టిస్తోంది. భారీగా జనం తరలిరావడంతో యువగళం జనసంద్రమైంది. యువనేతకు దారి పొడవునా మహిళలు హారతులతో నీరాజనాలు పలికారు. నెల్లూరు దారులన్నీ పసుపు పూల వనాన్ని తలపించాయి. టీడీపీ నేతలు, కార్యకర్తలతో మమేకమై యువనేత సాగుతున్నారు. వైసీపీ నేతల అవినీతిని సూటిగా ప్రశ్నిస్తూ.. సింహపురి గడ్డపై సింహనాదంలా.. నారా లోకేష్ చేసిన గర్జన.. వైసీపీ గుండెల్లో ప్రకంపనలు సృష్టించాయి. యువగళం పాదయాత్రలో వైసీపీ మాజీ మంత్రి అనిల్ కు ఇచ్చిన మాస్ వార్నింగ్.. రాష్ట్రమంతటా చర్చనీయాంశమైంది.
యువగళంలో సాగుతున్న ఒక్కో అడుగు ప్రజల కోసమే.. యువత భవిష్యత్ కోసమే నని నారా లోకేష్ మొదటి రోజే చెప్పారు. పాదయాత్ర మొదట్నుంచి వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి, అరాచకాలను ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు. యువగళం సాగతున్న ప్రతి నియోజవర్గాల్లో అభివృద్ధి ఎక్కడ జరిగిందో సాక్ష్యాధారాలు చూపాలని.. వైసీపీ నేతలను.. నారా లోకేష్ డిమాండ్ చేస్తూనే ఉన్నారు. టీడీపీ చేసిన అభివృద్ధి ఇదీ.. అంటూ సెల్పీ కూడా దిగి సవాల్ విసురుతున్నారు. నెల్లూరులో సాగుతున్న యువగళం పాదయాత్రలో.. సిటీ ఎమ్మెల్యేై అనిల్ కుమార్ యాదవ్ పై నారా లోకేష్ మాటల తూటాలు.. ఆయన గుండెల్లో దూసుకు పోయాయి. నెల్లూరు జిల్లాలో వైసీపీ చేసిన అవినీతి ఇదీ అంటూ.. చర్చకు సిద్ధమా అంటూ నారా లోకేష్ సవాల్ విసిరారు.. పైగా.. చర్చకు వచ్చేటప్పుడు ..తోడుగా సీఎం జగన్ ని కూడా వెంట తెచ్చుకోవాలని.. నారా లోకేష్ ఛాలెంజ్ చేశారు.
వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్.. అవినీతి చిట్టాను ఆధారాలతో సహా నారా లోకేష్ బయట పెట్టారు. నాలుగేళ్లలో దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయలను.. అక్రమంగా సంపాదించారన్నారు. అనిల్ తన బినామీల పేరుతో వందల కోట్లు భూములు కొన్నారని.. భూకబ్జాల లిస్ట్ మొత్తాన్ని సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టారు. దొంతాలి వద్ద బినామీలు చిరంజీవి, అజంతా పేరు మీద రూ.10 కోట్ల విలువైన.. 50 ఎకరాలు, నాయుడుపేటలో కూడా బినామీ పేర్లతో రూ.100 కోట్ల విలువైన.. 58 ఎకరాల భూములు ఉన్నాయన్నారు. ఇనుమడుగు సెంటర్ లో బినామీలు రాకేష్, డాక్టర్ అశ్విన్ పేరుతో రూ. 10 కోట్ల విలువైన భూములు, ఇస్కాన్ సిటీలో బినామీల పేర్లతో .. రూ. 33 కోట్ల విలువైన 87 ఎకరాలు దోచుకున్నారని నారా లోకేష్ తెలిపారు. అల్లీపురంలో 4వ డివిజన్ కార్పొరేటర్, డాక్టర్ అశ్విన్ పేరుతో రూ.105 కోట్ల విలువైన 42 ఎకరాలు ఉన్నాయని..సాదరపాళెంలో కూడా.. డాక్టర్ అశ్విన్ పేరుతో 48 కోట్ల విలువైన మరో 12 ఎకరాలు ఉన్నాయని ఆధారాలు బయటపెట్టారు. ఒక పెద్ద కాంట్రాక్టర్ నుండి దశల వారీగా అనిల్ బినామీ చిరంజీవికి కోట్ల రూపాయలు వచ్చాయన్నారు. బృందావనంలో శెట్టి సురేష్ అనే బినామీ పేరుతో 25 కోట్ల రూపాయల విలువైన 4 ఎకరాలు ఉన్నాయన్నారు. దామరమడుగులో బావమరిది పేరుతో 4 కోట్ల విలువైన 5 ఎకరాలు, గూడూరు- చెన్నూరు మధ్యలో 120 ఎకరాలు కొట్టేశారన్నారు. ఇవికాక.. గత నాలుగేళ్లుగా .. వ్యాపారులు, ఆస్పత్రుల యజమానులు, జ్యువెలరీ షాపుల వారిని బెదిరించి కోట్లు కొట్టేయడం నిజం కాదా ..?అని ప్రశ్నించారు. పెన్నా నది నుంచి.. ఇసుకను అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలించి కోట్లు దోచుకున్నారని .. వీటన్నింటిపై .. అనిల్ కుమార్ చర్చకు సిద్ధమా.. అని నారా లోకేష్ సవాల్ విసిరారు.
వచ్చే 2024 ఎన్నికల్లో.. నెల్లూరు సిటీ టికెట్ ను.. జగన్ తో చెప్పి .. ఇప్పించుకోగలవా.. అంటూ అనిల్ ను నారా లోకేష్ ప్రశ్నించారు. అనిల్ కుమార్ ఒక సిల్లీ బచ్చా, హాఫ్ నాలెడ్జ్ ఫెలో .. అంటూ కౌంటర్ ఇచ్చారు. అనిల్ చేసిన.. అవినీతి, అక్రమాల చిట్టాను ఆధారాలతో సహా బయటపెట్టా..ఎప్పుడైనా.. ఎక్కడికైనా .. చర్చకు రావాలంటూ.. నారా లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీడియా సమావేశాల్లో .. అనిల్ యాదవ్ నోరు పారేసుకుంటున్నారని.. ఆయనలా.. అసభ్య పదజాలం.. గౌరవం లేకుండా మాట్లాడటం.. తనకూ వచ్చన్నారు. ఒక మంత్రిగా నెల్లూరు జిల్లాకు అనిల్ చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని.. తాను చేసినట్టు చెప్పుకుంటున్నారని నారా లోకేష్ మండిపడ్డారు.గత నాలుగేళ్లలో నెల్లూరులో అవినీతి, ల్యాండ్, ఇసుక, వైన్, మైన్, క్రికెట్ బెట్టింగ్ మాఫియాలు తప్ప.. అనిల్ కుమార్ ఏం చేయలేదన్నారు. నెల్లూరును అన్ని రకాల అక్రమాలకు కేంద్రంగా మార్చారని నారా లోకేష్ మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా.. యువగళం పాదయాత్రకు వచ్చిన ప్రజాదరణ చూసి.. వైసీపీ పిల్ల సైకోలకు దిక్కు తోచడం లేదన్నారు. అనిల్ కుమార్ కు పని తక్కువ.. పంచ్ డైలాగులు ఎక్కువని.. నాలుగేళ్లుగా నెల్లూరు జిల్లాలో .. ఒక్క సాగు నీటి ప్రాజెక్టు అయినా పూర్తిచేయకుండా ఏం చేస్తున్నారని.. నారా లోకేష్ ఫైర్ అయ్యారు. వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్.. ఎన్నో అక్రమాలు చేసి.. ఏమీ తెలియనట్లుగా.. గుట్టుగా ఉన్నారని.. నిజాలు తెలుసుకోవాలని.. ప్రజలకు .. నారా లోకేష్ పిలుపునిచ్చారు.
నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట నియోజకవర్గాల్లో కొనసాగిన పాదయాత్రకు అద్భుతమైన ప్రజా స్పందన వచ్చింది. జిల్లాలో వైసీపీ అవినీతిపై .. నారా లోకేష్ సూటిగా అడిగిన ప్రశ్నలకు .. వారి నుంచి .. సమాధానాలు రాలేక పోయాయి. వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ మద్ధతుగా నిలబడే వైసీపీ నేతలే కనబడటం లేదు. పైగా సొంత పార్టీ వాళ్ళే అనిల్‌కు వ్యతిరేకంగా ఉన్నారు. దీంతో అనిల్‌కు నెల్లూరు జిల్లాలో రాజకీయంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.